వార్తలు
SLBC Tunnel Collapse Update: ఆరు రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి రాలేదు, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం ముఖ్యమా? ప్రశ్నించిన హరీష్ రావు
Hazarath Reddyతెలంగాణలో ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటన జరిగి ఆరు రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ రాలేదు.. ఎందుకింత బాధ్యతారాహిత్యం..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం ముఖ్యమా? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.
Posani Krishna Murali Interrogation: తెలియదు...గుర్తులేదు...మర్చిపోయా! పోలీసుల ప్రశ్నలకు పోసాని సమాధానాలివే! 8 గంటల పాటూ విచారించినా సమాధానం చెప్పని పోసాని
VNSసినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) విచారణ పూర్తయింది. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఆయన్ను విచారించారు. 8 గంటల పాటూ పోసానిని విచారించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్. అయితే, పోలీసుల విచారణకు పోసాని సహకరించ లేదని తెలుస్తోంది.
Mystery Illness in Congo: ఆ దేశాన్ని వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి, ఇప్పటికే 50 మందికి పైగా మృతి, వందల్లో బాధితులతో నిండిన ఆస్పత్రులు
VNSడెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో వింత వ్యాధి బెంబేలిత్తిస్తోంది. వాయువ్య కాంగోలో వింత వ్యాధిని గుర్తించారు. ఈ వ్యాధితో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణించారు. రోజురోజుకీ ఈ మిస్టరీ డిసీజ్ బారిన పడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
Charminar Bhagyalakshmi Temple: దేవాదాయ శాఖ పరిధిలోకి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, అవకతవకలు లేకుండా చూడాలని కోర్టు ఆదేశం
VNSచారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ బాధ్యతలను ఇకపై దేవాదాయశాఖ చూసుకోనున్నది. ప్రస్తుతం ఆలయ పర్యవేక్షణ బాధ్యత ట్రస్టీల పరిధిలో ఉండగా.. దేవాయదాయ శాఖ పరిధిలో కొనసాగించాలని ట్రిబ్యునల్ గురువారం తీర్పును వెలువరించింది. ప్రస్తుతం భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ బాధ్యతలను మహంత్ మనోహర్ దాస్, మహంత్ రాంచంద్రదాసు 1960 దశకం నుంచి చూసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.
Samsung Galaxy M16 5G Specifications: తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ 5G ఫోన్ తెచ్చిన శాంసంగ్, మార్కెట్లోకి గెలాక్సీ M16, గెలాక్సీ M06 5G ఫోన్లు, ధరతో పాటూ పూర్తి వివరాలివిగో..
VNSశాంసంగ్ గెలాక్సీ ఎం 16 5జీ (Samsung Galaxy M16 5G), శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ (Samsung Galaxy M06 5G) ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు రెండు మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity 6300) చిప్‌సెట్లు, 5000 ఎంఏహెచ్ (5,000mAh) సామర్థ్యం గల బ్యాటరీలతో ఉంటాయి.
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేశారా? ఫిబ్రవరి 28వ తేదీనే లాస్ట్ డేట్, మార్చి మొదటివారంలో కొత్త కార్డుల పంపిణీ షురూ
VNSతెలంగాణలో కొత్త రేషన్ కార్డుల (Ration Cards) కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. మరికొన్ని రోజుల్లో రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కారు భావిస్తోంది. ముందుగా మార్చి 1న లక్ష కార్డులు జారీ చేయనున్నట్టు ఇప్పటికే సర్కారు ప్రకటించింది. అయితే, ఆ రోజున రేషన్ కార్డుల జారీ కుదరకపోవచ్చు. మార్చి తొలివారం అనంతరం కొత్తకార్డుల జారీ చేసే ఛాన్స్ ఉన్నట్టు అధికార యంత్రాంగం అంటోంది
Kannappa Teaser Release: కన్నప్ప మూవీలో చేయనని రెండుసార్లు చెప్పాను, అయినా విష్ణు మొండి పట్టుదలతో ఒప్పుకున్నా, కన్నప్ప టీజర్ ఆవిష్కరణలో అక్షయ్ కుమార్
Hazarath Reddyముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ .. మంచు విష్ణు .. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి అధ్వర్యంలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.
Loco Pilot Halts Train To Urinate: వీడియో ఇదిగో, రైలు మధ్యలో ఆపి పట్టాలపై మూత్ర విసర్జన చేసిన లోకో పైలట్, ఆపుకోలేక అలా చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు
Hazarath Reddyముంబైలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనలో, ఒక లోకో పైలట్ మూత్ర విసర్జన చేయడానికి ముంబై లోకల్ రైలును పట్టాలపై మధ్యలో ఆపాడు. దీనికి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపించింది. అది మళ్లీ వైరల్ అవుతోంది.
Bihar Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టిన ట్రక్కు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో 7 మందికి గాయాలు
Hazarath Reddyబీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో గురువారం వేగంగా వస్తున్న ట్రక్కు ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టిన ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, సుహాగన్ దేవి (50), సుభాగ్య దేవి (65), సిరతియా దేవి (65), 12 ఏళ్ల బాలుడు అజీత్ కుమార్ ఉన్నారు.
Nilam Shinde Accident News: కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి తండ్రికి అత్యవసర యుఎస్ వీసా మంజూరు, ఫిబ్రవరి 16న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నీలం షిండే
Hazarath Reddyఫిబ్రవరి 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలిఫోర్నియా ఆసుపత్రిలో కోమాలో ఉన్న 35 ఏళ్ల భారతీయ విద్యార్థి నీలం షిండే తండ్రికి అమెరికా అత్యవసర వీసా ఇంటర్వ్యూను షెడ్యూల్ చేసింది
Raebareli: వీడియో ఇదిగో, బండ బూతులు తిట్టుకుంటూ జుట్టులు పట్టుకుని తన్నుకున్న అమ్మాయిలు, నూడిల్స్ తింటుండగా జరిగిన గొడవే కారణం
Hazarath Reddyయూపీలోని రాయ్‌బరేలిలో ఓ జాతరలో అమ్మాయిల సమూహాల మధ్య భీకర ఫైటింగ్ చోటు చేసుకుంది. చౌమెయిన్ తింటున్నప్పుడు చిన్న వాగ్వాదంతో మొదలైన గొడవ కొట్టుకునే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
Hazarath Reddyఅత్యాచార బాధితుల (మైనర్లతో సహా) అనేక మంది గుర్తింపులను బహిర్గతం చేయడం ద్వారా వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు (Vasireddy Padma lodges complaint) మేరకు ఆయనపై కేసు నమోదయింది.
Balakrishna: ఫొటో దిగారుగా ఇక చాల్లే వెళ్లిపోండి, కొమరవోలు గ్రామస్తులపై చిర్రుబుర్రులాడిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వీడియో వైరల్
Hazarath Reddyహిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొమరవోలు గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. మా ఊరిని అభివృద్ధి చేయరు అంటూ విజ్ఞప్తి చేసిన ఆ గ్రామస్థులపై 'ఫొటో దిగారుగా.. చాలు ఇక వెళ్లిపోండి' అంటూ కోప్పడినట్లుగా వీడియోలో తెలుస్తోంది
Champions Trophy 2025: సెమీ ఫైనల్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు తమ మ్యాచ్‌ల్లో ఓడితే భారత్, అఫ్గాన్‌ల మధ్య తొలి సెమీ ఫైనల్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddy2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో భారత్ ఇప్పటికే తన స్థానాన్ని బుక్ చేసుకుంది, కానీ గ్రూప్ బిలో బహుళ అవకాశాలు మిగిలి ఉన్నందున వారి ప్రత్యర్థి ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Latest ICC ODI Rankings: ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే గిల్, అయిదవ స్థానంలోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ
Hazarath Reddyగత వారం దుబాయ్‌లో జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌పై 101 నాటౌట్, పాకిస్థాన్‌పై 46 పరుగులు చేసిన గిల్, మ్యాచ్ విన్నింగ్ పాయింట్‌లలో 21 రేటింగ్ పాయింట్లు పొంది 817 రేటింగ్ పాయింట్లకు చేరుకున్నాడు, రెండవ స్థానంలో ఉన్న బాబర్ అజామ్‌తో అంతరం 23 నుండి 47 పాయింట్లకు పెరిగింది.
ICC Champions Trophy 2025: ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి పట్టిన డిఫెండింగ్ చాంపియన్, బంగ్లా కూడా రేసు నుంచి ఔట్, ఒక్క బాల్ పడకుండానే నేటి మ్యాచ్ రద్దు
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడిన 2 మ్యాచుల్లో ఓడి సెమీస్ రేసు నుంచి తప్పుకున్న పాకిస్తాన్ రిజ్వాన్ సేన.. మూడో దాంట్లోనైనా గెలుస్తుందేమోనని భావిస్తే అక్కడా వరుణుడు అడ్డు పడ్డాడు.దీంతో చాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని పాకిస్థాన్ ఒక్క గెలుపు కూడా లేకుండానే ముగించింది
Joe Root Crying Video: జోరూట్ భోరున ఏడ్చిన వీడియో ఇదిగో, ఆప్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో ఇంటిదారి పట్టిన ఇంగ్లండ్, చివరి ఓవర్లలో మారిపోయిన మ్యాచ్ స్వరూపం
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నిన్న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైన సంగతి విదితమే. ఎనిమిది పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. చివరి రెండు ఓవర్లలో ఆఫ్ఘాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంతో మ్యాచ్ ఊహించిన మలుపు తిరిగింది.
'Torture' Allegations on Rajamouli: రాజమౌళి కోసం నేను పెళ్ళి కూడా చేసుకోలేదు, దారుణంగా వాడుకుని వదిలేశాడు, జక్కన్నపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వీడియో ఇదిగో..
Hazarath Reddyటాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళిపై ఆయన మాజీ స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలతో వీడియో విడుదల చేశాడు. రాజమౌళి తనను భరించలేనంతగా టార్చర్ ('Torture' Allegations on Rajamouli) చేస్తున్నాడని, ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక సెల్ఫీ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
KJ Yesudas Hospitalised? ప్రముఖ గాయకుడు యేసుదాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారంటూ వార్తలు, ఖండించిన కొడుకు విజయ్ యేసుదాస్, నాన్న అమెరికాలో ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటన
Hazarath Reddyప్రముఖ నేపథ్య గాయకుడు కె.జె. యేసుదాస్ ఇటీవల చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన తర్వాత ఆయనపై ఊహాగానాలు చెలరేగాయి. ఈ వార్త త్వరగా వ్యాపించి, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులలో ఆందోళన కలిగించింది.
Kanpur: వీడియో ఇదిగో, అసభ్యంగా తాకాడని యువకుడిని 48 సెకన్లలో 14 సార్లు చెంపలు వాయించిన యువతి, సారి చెప్పినా ఆగకుండా చితకబాదింది
Hazarath Reddyకాన్పూర్‌లోని బెకన్‌గంజ్ మార్కెట్‌లో ఒక మహిళ తనను వేధించిన వ్యక్తిని ఎదుర్కొన్న తర్వాత నాటకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. బజారియా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన అద్నాన్‌గా గుర్తించబడిన నిందితుడు ఆ మహిళను అనుచితంగా తాకడానికి ప్రయత్నించాడని, ఇది వారి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసిందని వీడియో ద్వారా తెలుస్తోంది.