News
Pulivendula Road Accident: వీడియో ఇదిగో, పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడిన బస్సు, 25 మంది ప్రయాణికులకు గాయాలు
Hazarath Reddyఏపీలోని వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.
Yadagirigutta Temple: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం...ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించడం సరికాదన్న ఈవో, ఇకపై చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలని హెచ్చరిక
Arun Charagondaయాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలపై నిషేధం విధించారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి జ్ఞాపకార్థంగా భద్రపర్చుకుంటే అభ్యంతరం లేదని...చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Ruckus at Jamia Millia Islamia University: దీపావళి వేడుకల్లో పాలస్తీనా జిందాబాద్ అంటూ నినాదాలు, ఢిల్లీ జామియా యూనివర్సిటీలో తన్నుకున్న రెండు విద్యార్థి గ్రూపులు
Hazarath Reddyఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మంగళవారం సాయంత్రం దీపావళి వేడుకల్లో ఘర్షణ చోటుచేసుకుంది. బిజెపి విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సభ్యులు రంగోలీల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఘర్షణ జరిగింది. మరో గుంపు రంగోలిలను పాడు చేయడం మరియు డయాస్‌లను తన్నడం ద్వారా ఈవెంట్‌కు అంతరాయం కలిగించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.ఇది ఘర్షణకు దారితీసింది.
Seethakka Worships Lord Balaji: తిరుమలలో తెలంగాణ మంత్రి సీతక్క, ప్రియాంక గాంధీ విజయం కోసం ప్రత్యేక పూజలు..తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్ష
Arun Charagondaతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. బుధవారం వేకువజాము శ్రీవారికి పుష్పాలు అలంకరించే తోమాల సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహిళా నేత ప్రియాంక గాంధీ వయనాడ్ లో నామినేషన్ వేస్తున్న శుభసందర్భంలో ఆమె ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడంతో చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
Andhra Pradesh: నడిరోడ్డుపై మొసలి కలకలం, పిల్లుట్ల జంక్షన్ సమీపంలోరోడ్డుపైకి వచ్చిన మొసలి, భయాందోళనలో ప్రజలు
Arun Charagondaనడిరోడ్డుపై మొసలి కలకలం కలకలం రేపింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బైపాస్ పిల్లుట్ల జంక్షన్ సమీపంలో రోడ్డుపై అటుఇటు తిరిగింది మొసలి. పొలాల్లో నుంచి రోడ్డుపైకి వచ్చిన మొసలిని చూసి ప్రజలు భయాందోళనకు గురికాగా స్థానికుల సమాచారంతో మొసలి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు అటవీ శాఖ అధికారులు.
Vasireddy Padma Resigns YSRCP: వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా, జగన్‌పై తీవ్ర విమర్శలు, రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదు అని మండిపాటు
Arun Charagondaవైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకురాలు, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రిలీజ్ చేసిన వాసిరెడ్డి పద్మ...జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పార్టీ అంటే వ్యాపార కంపెనీ కాదని మండిపడ్డారు. పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యత లేదని, పరిపాలన చేయడంలో, సమాజం పట్ల అంతకన్న బాధ్యత లేదని మండిపడ్డారు.
Telangana Assembly: త్వరలో కొత్త అసెంబ్లీ భవనం, రూ.49 కోట్లతో నిర్మిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి, మండలి భవన రిపేర్లపై సమీక్ష సందర్భంగా వెల్లడి
Arun Charagondaరాష్ట్రంలో త్వరలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రూ.49 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. మండలి భవన రిపేర్లపై సమీక్ష సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ కౌన్సిల్ కు ఒకే దగ్గర భవనాలు ఉంటాయని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి.. మండలి భవన రిపేర్లపై సమీక్ష నిర్వహించారు.
Pinipe Viswaroop Son Srikanth Arrest: మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్ట్ , 14 రోజులు రిమాండ్, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
Arun Charagondaమాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గతంలో అరెస్ట్ అయిన ముద్దాయి వాంగ్మూలం ఆధారంగా శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు అని శ్రీకాంత్ తరపు న్యాయవాది వెల్లడించారు.
Bengaluru: ఉద్యోగాల పేరుతో మైనర్ బాలికలతో వ్యభిచారం, 12 మంది మైనర్ బాలికలను రక్షించిన పోలీసులు, జువైనల్ హోంకు తరలింపు
Arun Charagondaకర్ణాటక రాజధాని బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఉద్యోగాల పేరుతో 12 మంది మైనర్ బాలికలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో సహా త్రిపుర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర మరియు కర్ణాటకతో సహా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి మైనర్ బాలికలను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారు.
Telangana AEOs Protest: 160 మంది ఏఈవోలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, నిరసనగా ఇవాళ అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ఆందోళనకు పిలుపునిచ్చిన ఏఈవోలు
Arun Charagondaతెలంగాణ ప్రభుత్వం 160 మంది ఏఈవోలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ఆందోళనకు పిలుపునిచ్చారు ఏఈవో లు. సస్పెండ్ చేసిన 160 మంది ఏఈవో లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెనుకకు తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2600 మంది ఏఈవో కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు తరలి రావాలన్న ఏఈవో ల సంఘం నేతలు కోరారు.
YS Jagan: ఇవాళ గుంటూరు, కడప జిల్లాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన, బాధిత కుటుంబాలకు పరామర్శ, రాత్రి పులివెందులలో బస చేయనున్న జగన్
Arun Charagondaనేడు గుంటూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు వైఎస్ జగన్. గుంటూరులో యువకుడి దాడిలో మృతిచెందిన..యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అలాగే మధ్యాహ్నం బద్వేల్‌కు బయల్దేరనున్న జగన్ ప్రేమోన్మాది దాడిలో మృతిచెందిన..దస్తగిరిమ్మ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం పులివెందుల చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
Cyclone Dana Live Updates: నాలుగు రాష్ట్రాలకు 'దానా' తుపాను ఎఫెక్ట్, ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు మూసివేత, పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
Arun Charagondaబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఒడిశా ,పశ్చిమ బెంగాల్ తీరప్రాంత జిల్లాలలోని అన్ని పాఠశాలలును ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. దానా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండే తీర ప్రాంత జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Snake Rescued in Uttar Pradesh: వీడియో ఇదిగో, పొలంలో మందు పిచికారీ చేస్తున్న రైతు పైకి దూసుకొచ్చిన 10 అడుగుల కొండ చిలువ, తర్వాత ఏమైందంటే..
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో వరి పొలంలో కనిపించిన 10 అడుగుల పొడవున్న కొండచిలువను అటవీ అధికారులు రక్షించారు. పొలంలో మందు పిచికారీ చేస్తున్న రైతుకు భారీ పాము కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు
Bengaluru Building Collapse Video: వీడియో ఇదిగో, కూలీలు పనిచేస్తుండగానే కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు భవన కార్మికులు
Vikas Mకర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనంలో కూలీలు పనిచేస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో పలువురు కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. బెంగళూరులోని హొరమావు అగార ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Chain Snatching Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, మెడలో చైన్ రాకపోవడంతో మహిళను అలాగే ఈడ్చుకెళ్లిన దొంగలు, తమిళనాడులోని మధురైలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
Vikas Mతమిళనాడులోని మధురైలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఈనెల 20న బైక్పై వచ్చిన నిందితులు ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాగడానికి ప్రయత్నించారు. గొలుసు లాగే క్రమంలో కిందపడిపోయిన ఆమెను అలాగే రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకెళ్లారు.
Toyota Rumion:టయోటా రూమియన్ పండుగ ఎడిషన్ విడుదల, ధర రూ. .10.44 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.13.73 లక్షల వరకు..
Vikas Mటొయోటా గ్లాన్జా, టైసర్, హైరైడర్ యొక్క పండుగ ఎడిషన్‌లను ప్రారంభించింది. ఇప్పుడు, కంపెనీ రూమియోన్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ప్రారంభించింది. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన ఎంపీవీ కారు రుమియాన్ (Rumion) స్పెషల్ ఎడిషన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
BSNL Tariffs: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీఎస్ఎన్ఎల్, సమీప భవిష్యత్తులో టారిఫ్‌లు పెంచబోమని కీలక ప్రకటన
Vikas Mవివిధ కంపెనీలు మొబైల్ టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పెంపుపై స్పష్టతనిచ్చింది. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లు పెంచబోమని కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తదితర ప్రైవేటు ఆపరేటర్లు ఇటీవల టారిఫ్‌ను పెంచాయి.
Ram Charan: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మ, సినిమా రంగానికి చేసిన సేవలకు గాను మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు
Vikas Mమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మైనపు బొమ్మను ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేస్తారు. తాజాగా, మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు... రామ్ చరణ్ కొలతలను తీసుకున్నారు.
Amaravati Drone Summit 2024: ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసిన విజయవాడ డ్రోన్ షో, సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్లు అందజేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు, అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 వీడియోలు ఇవిగో..
Hazarath Reddyకేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహించిన డ్రోన్ షో విజయవంతం అయింది. డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన ఈ భారీ ఈవెంట్ లో డ్రోన్ విన్యాసాలు అచ్చెరువొందించాయి.
BSNL New Logo: బీఎస్ఎన్ఎల్ కొత్త లోగో ఇదిగో, భారతదేశంతో కూడిన లోగోను ఆవిష్కరించిన భారత కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
Vikas Mభారత కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసన్ సమక్షంలో కొత్త BSNL లోగోను ఆవిష్కరించారు. BSNL యొక్క కొత్త లోగో పాతదానితో పోలిస్తే చాలా మార్పులతో వచ్చింది.