వార్తలు

Nitin Gadkari Comments on EV Subsidy: ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై కేంద్రం స‌బ్సిడీ ఎత్తివేయ‌నుందా? కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్కరి

VNS

ఈవీ (EV), సీఎన్‌జీ వాహనాలకు మరింత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నానన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల కంటే ఈవీ వాహనాలపై జీఎస్టీ తక్కువగా ఉందన్నారు. ‘నా దృష్టిలో ఈవీ వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు.

Female Aghori at Mallanna Temple: వీడియో ఇదిగో, కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి వచ్చిన మహిళా అఘోరీ, ఆసక్తిగా తిలకించిన భక్తులు

Hazarath Reddy

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కొమ్రెల్లి మల్లన్న దేవాలయం అని ప్రసిద్ది చెందింది. ఇది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని కొండపై ఉన్న హిందూ దేవాలయం. తాజాగా మహిళా అఘోర కొమరవెల్లి దేవాలయానికి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Heartbreaking Video: హృదయవిదారక వీడియో, అంబులెన్స్ లేకపోవడంతో చిన్నారుల మృతదేహాలను 15 కిలోమీటర్లు భుజాలపైనే మోసుకెళ్లిన తల్లిదండ్రులు

Hazarath Reddy

మహారాష్ట్రలోని గడ్చిరోలీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.అంబులెన్సు రాకపోవడం వల్ల కన్నుమూసిన కన్నబిడ్డలను భుజాన వేసుకున్న తల్లిదండ్రులు 15 కిలోమీటర్లు నడిచి స్వగ్రామం చేరుకున్నారు. పిల్లలకు కొన్ని రోజులుగా జ్వరం రావడం వల్ల చుట్టుపక్కలవారి మాటలు నమ్మి ఆస్పత్రికి కాకుండా భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

Koneti Adimulam Video Row: కోనేటి ఆదిమూలం వైరల్ వీడియోపై స్పందించిన అతని భార్య, కాంట్రాక్ట్ పనులు ఇవ్వకపోవడం వల్లే ఆమె ఇలా చేసిందని మండిపాటు

Hazarath Reddy

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భార్య గోవిందమ్మ స్పందించారు. ఆదిమూలం మంచివారని, రాజకీయ కుట్రలో భాగంగా ఆయనను ఇరికించారని ఆమె చెప్పారు.

Advertisement

Video: వీడియో ఇదిగో, పాము, ముంగీస ఫైట్, గాయపడిన కింగ్ కోబ్రాని కాపాడిన స్నేక్ క్యాచర్, అభినందనలు తెలిపిన స్థానికులు

Hazarath Reddy

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండళేశ్వరంలో పాముని కాపాడిన స్నేక్ క్యాచర్... పాము, ముంగీస ఫైట్ లో పాము గాయపడటంతో స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని చేరుకున్న వర్మ పాముకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా వర్మను స్థానికులు అభినందించారు.

Hyderabad Rain: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌ను మళ్లీ ముంచెత్తిన భారీ వర్షం, పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Hazarath Reddy

హైద‌రాబాద్ న‌గ‌రంలో సాయంత్రం నుండి వాన దంచికొట్టింది. భారీ వ‌ర్షానికి న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో భారీగా కురుస్తున్న వర్షం కురుస్తుంది.

Malad Building Collapse: ముంబైలో ఘోర ప్రమాదం, స్లాబ్ కుప్పకూలి ముగ్గురు కూలీలు మృతి, వీడియో ఇదిగో...

Hazarath Reddy

నిర్మాణంలో ఉన్న భవనంలోని 20వ అంతస్తులోని స్లాబ్ గురువారం కూలిపోవడంతో కనీసం ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ కంట్రోల్ తెలిపింది. ఈ సంఘటన -- రెండు రోజులలో జరిగిన రెండవది.

AI Global Summit 2024: విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ పెట్టింది పేరు, గ్లోబల్‌ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని వెల్లడి

Hazarath Reddy

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్‌ ఏఐ’ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్‌ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో (AI Global Summit 2024) చర్చించారు

Advertisement

Koneti Adimulam on Allegations: ఆమె నా సోదరిలాంటిది, అత్యాచారం ఎలా చేస్తాను, మహిళ ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Hazarath Reddy

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఈ రోజు సంచలన వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోపై తొలిసారిగా స్పందించారు.

Telangana: ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hazarath Reddy

రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా (Free electricity) చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో వరదల సమస్యల వల్ల సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని తెలిపారు.గురువులకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

TDP Office Attack Case: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు

Hazarath Reddy

అమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నందిగం సురేశ్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

TDP Office Attack Case: వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో నిందితుడు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

HC on Suicide Abetment: పెళ్లయిన ఏడేళ్లలోపు భార్య ఆత్మహత్య, భర్తపై క్రూరత్వానికి సంబంధించిన అపోహను ప్రేరేపించదంటూ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

కేవలం ఒక మహిళ తన పెళ్లయిన ఏడేళ్లలోపు ఆత్మహత్యకు పాల్పడిందనే వాస్తవం సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 113-A ప్రకారం స్వయంచాలకంగా ఊహించబడదని పేర్కొంది. 1872 నాటి భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 113A, వివాహిత అయిన స్త్రీ యొక్క భర్త లేదా బంధువు ఆత్మహత్యకు ప్రేరేపించే ఊహతో వ్యవహరిస్తుందని గమనించాలని తెలిపింది

Dog Attack in Srikakulam: శ్రీకాకుళంలో పిచ్చి కుక్క దాడి, 24 మందికి తీవ్ర గాయాలు...వీడియో ఇదిగో

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో దారుణం చోటు చేసుకుంది. 24 మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చగా కొందరికి తీవ్ర గాయాలు.. మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

MLA Gali Banu Prakash: రోజా జైలుకు వెళ్లడం ఖాయం, ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు తినేసిందని ఎమ్మెల్యే భాను ప్రకాష్ సంచలన కామెంట్

Arun Charagonda

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం అన్నారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొకటిగా బయటకు వస్తోందని..ఆధారాలతో త్వరలో రోజా జైలుకు వెళ్ళబోతున్నారు అన్నారు. ఎన్డీయే పాలనలో రోజాకు చిప్పకూడు ఖాయం..ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారన్నారు.

AP CM Chandrababu: సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం, చంద్రబాబుకు సమీపంలో వచ్చిన రైలు, వెంట్రుక వాసిలో తప్పిన ప్రమాదం

Arun Charagonda

ఏపీ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా ఇ వాళ నిడమానూరు ప్రాంతంలో బుడమేరుకు పడిన గండిన పరిశీలించేందుకు వెళ్లారు. బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు రైలు వంతెనపైకి కాలి నడకన వెళ్లారు. భద్రతా సిబ్బంది వారించినా వినలేదు.

Advertisement

Hyderabad Shocker: జగద్గిరిగుట్టలో మహిళా దొంగల ముఠా అరెస్ట్, నలుగురు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు, కస్టమర్లలాగ వచ్చి దోపిడి

Arun Charagonda

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో మహిళా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. బంగారు దుకాణాల్లో యజమాని,షాప్ సిబ్బంది దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్నారు మహిళలు. కార్లలో వచ్చి కస్టమర్ల లాగా నటిస్తూ దోపిడీ చేస్తున్న ఆరుగురు మహిళలను అరెస్ట్ చేశారు. జోడిమెట్ల, చైతన్యపూరి ,జగద్గిరిగుట్టలో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు.

MLA Koneti Adimulam: చెల్లి చెల్లి అంటూనే మూడు సార్లు ఎమ్మెల్యే అత్యాచారం, ఏకాంత వీడియోలతో మూగబోయిన వైనం, ఎమ్మెల్యే ఇంటిదగ్గర నిశ్శబ్ద వాతావరణం!

Arun Charagonda

ఆయనో ప్రజా ప్రతినిధి. సమాజంలో అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ బుద్ది వక్రీకరించింది. ఫలితం సమాజంలో అందరిలో దోషిగా నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అవును తిరుపతి జిల్లా సత్యవేడు కోనేటి ఆదిమూలం వ్యవహార తీరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Telangana: ఆదివాసి యువతిపై అత్యాచారయత్నం, గాయపడ్డ బాధితురాలిని పరామర్శించిన మంత్రి సీతక్క, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రస్తుతం బాధితురాలికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి సీతక్క బాధితురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, అల్లూరి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన సోకిలేరు వాగు, 40 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

Hazarath Reddy

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలో సోకిలేరు వాగు పొంగిపొర్లుతోంది. దీంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, శబరి నదులకు భారీగా వరద నీరు రావడంతో సోకిలేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

Advertisement
Advertisement