వార్తలు
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినులతో ఇంగ్లీష్ టీచర్ అసభ్యకర ప్రవర్తన, చెప్పులతో చితకబాదిన తల్లితండ్రులు
Hazarath Reddyపల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మోడల్ స్కూల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ అడ్డదారి తొక్కాడు. స్కూలులో పనిచేసే ఇంగ్లీష్ టీచర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మండిపడిన తల్లిదండ్రులు అతగాడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులతో ఎడాపెడా వాయించి పడేశారు.
Bihar Shocker: వీడియో ఇదిగో, యూట్యూబ్‌లో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు, ఒక్కసారిగా అవి పేలడంతో గాయాలపాలై ఆస్పత్రిపాలు..
Hazarath Reddyబీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో యూట్యూబ్ వీడియోను చూసి బాంబు తయారీకి ప్రయత్నించిన ఐదుగురు చిన్నారులు గాయపడిన దారుణ ఘటన చోటుచేసుకుంది
Ola: క్విక్ కామర్స్ వ్యాపారంలోకి మళ్లీ ఓలా రీ ఎంట్రీ, డార్క్‌స్టోర్స్ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడిన రైడ్ దిగ్గజం, ఈ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అవకాశం
Vikas Mగతంలో క్విక్ కామర్స్ (quick commerce) విభాగంలో అడుగపెట్టి అర్ధంతరంగా వైదొలగిన ఓలా తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం సొంతంగా డార్క్ స్టోర్లను (చిన్నపాటి గోదాములు) ఏర్పాటు చేయాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ భావిస్తున్నట్లు సమాచారం.
Andhra Pradesh Rain Update: ఏపీకి మరో మూడు రోజులు అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక, దంచికొడుతున్న వానలు
Hazarath Reddyఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, తమిళనాడు పరిసరాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న మరో ద్రోణి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
Pawan Kalyan Meets CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, ఎందుకో తెలుసా?
Arun Charagondaకర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లాలో ఏనుగులు గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అంతేగాదు ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు కొల్పోయే పరిస్థితి వచ్చింది.
Telcos Disconnect 73 Lakh Mobile Connections: 73 లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్ చేసిన కేంద్రం, ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని టెల్కోలకు డాట్ ఆదేశం
Vikas Mవివరాల ధ్రువీకరణలో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు రద్దు చేసినట్లు బుధవారం లోక్‌సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) టెల్కోలను ఆదేశించింది.
RBI: ఆర్బీఐ కీలక అప్‌డేట్, యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితి రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన
Vikas Mరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పన్ను చెల్లింపుల UPI పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచింది. దీనర్థం మీరు ఇప్పుడు UPIని ఉపయోగించి పెద్ద పన్ను మొత్తాలను త్వరగా, సులభంగా చెల్లించవచ్చు.ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను ర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు.
Helicopter Crash in Nepal: నేపాల్‌లో మరో హెలికాప్టర్ ప్రమాదం, సువాకోట్ సమీపంలో కుప్పకూలిన విమానం, 5 మంది చైనీయులు మృతి
Hazarath Reddyనేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది.
Earthquake in Japan Videos: జపాన్‌లో భారీ భూకంపం, స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు కంపించిన భూమి, సునామీ హెచ్చరికలు జారీ వీడియోలు ఇవిగో..
Hazarath Reddyజపాన్‌లో స్వల్ప వ్యవధిలోనే భూమి రెండుసార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఓసారి 7.1, మరోసారి 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. జపాన్ దక్షిణ తీరంలో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జపాన్‌లోని దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
Telangana Rain Update: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyతెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం.. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
CM Kejriwal Custody Extended: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట, సీబీఐ కేసులో జ్యూడిషియల్ కస్టడీ పొడగింపు, తీహార్ జైలులోనే కేజ్రీవాల్
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు రిలీఫ్ దక్కలేదు. ఈడీ కేసులో మధ్యంత బెయిల్ దక్కిన సీబీఐ కేసులో మాత్రం రిలీఫ్ లభించడం లేదు. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడగిస్తున్నట్లు
Hyderabad: వీడియో ఇదిగో, నిర్లక్ష్యంగా కారును డ్రైవ్ చేసి బైక్‌ను ఢీకొట్టిన డ్రైవర్, త్రుటిలో తప్పించుకున్న చిన్నారి
Hazarath Reddyహైదరాబాద్‌లోని చైతన్యపురిలో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లో ఓ డ్రైవర్ రోడ్డుపై పార్క్ చేసిన కారును స్టార్ట్ చేసి సర్వీస్ రోడ్డులోని కిల్లా మైసమ్మ దేవాలయం సమీపంలో ప్రయాణిస్తున్న బైక్‌ను అకస్మాత్తుగా ఢీకొట్టాడు. తన చిన్నారి బాబును స్కూల్ నుంచి తీసుకెళ్తున్న వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు,
Cyberabad Police: సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడకండి..పోలీసుల ప్రాథమిక జాగ్రత్తలు, ప్రతిఒక్కరూ తెల్సుకోవాల్సిన వీడియో
Arun Charagondaసైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుడా ఉండటానికి తీసుకోవాల్సి ప్రాథమిక జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు సైబరాబాద్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Dog Attack in Karimnagar: షాకింగ్ వీడియో, ఆడుకుంటున్న 18 నెలల బాలుడుపై వీధి కుక్క దాడి, తృటిలో తప్పించుకున్న మరో బాలుడు
Hazarath Reddyకరీంనగర్ జిల్లాలో పద్దెనిమిది నెలల బాలుడుపై వీధీ కుక్క దాడి చేసింది. శాతావాహన యూనివర్సిటీ సమీపంలోని విద్యానగర్ వీధీలో రోడ్డుపై ఆడుకుంటున్న హరినందన్ అనే చిన్న పిల్లాడిపై వీధి కుక్క దాడి చేసింది. ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటుండగా ఎక్కడనుంచి వచ్చిందో అకస్మాత్తుగా నల్ల కుక్క దూసుకొచ్చింది
Nagarjuna Sagar Project Gates Open: తెరుచుకున్న నాగార్జునసాగర్ 26 గేట్లు, పర్యాటకుల తాకిడి, నిండుకుండలా మారిన పులిచింతల
Arun Charagondaగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త కిడ్నాప్, బొలెరో వాహనంలో కత్తులతో వచ్చి మరీ..
Hazarath Reddyపల్నాడుజిల్లాలోని బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా ప్రత్యర్థులు తీసుకెళ్లారు. ఆటోను అడ్డగించి నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.
CM Revanth Reddy: గుడ్ న్యూస్..తెలంగాణలో చార్లెస్ ష్యాబ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్, భారత్‌లో ఫస్ట్ టెక్నాలజీ సెంటర్ హైదరాబాద్‌లోనే
Arun Charagondaతెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఈ నేపథ్యంలో గుడ్ న్యూస్ అందించారు. అమెరికన్ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ ష్యాబ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ అనంతరం ఈ ముఖ్యమైన నిర్ణయం, గుడ్ న్యూస్‌ని ప్రకటించారు.
School Bus Accident Video: వీడియో ఇదిగో, హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వేగంగా వెనక్కి వెళ్ళిన స్కూలు బస్సు, పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా
Hazarath Reddyరంగారెడ్డిలోని మైలార్‌దేవ్‌పల్లిలో పయనీర్ స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు బోల్తా పడింది. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వెనక్కి వెళ్లిన బస్సు.. పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. పలువురు విద్యార్థులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు
Prakasam Barrage Gates Lifted: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత, కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
Hazarath Reddyవిజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది.కృష్ణా నది దిగువన ప్రకాశం బ్యారేజీ వద్ద బుధవారం వరద ఉద్ధృతి నెలకొంది. బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లను ఎత్తారు. రాత్రి తొమ్మిదింటికి ఎగువ నుంచి 1,51,948 క్యూసెక్కులకు వరద పెరిగింది. 50 గేట్లను మూడు అడుగులు, మిగతా 20 గేట్లను రెండు అడుగులు మేర ఎత్తారు.
Andhra Pradesh Horror: ఏలూరు జిల్లాలో మరో దారుణ హత్య, భార్యను నరికి చంపి ఇంటి ముందే కత్తితో కూర్చున్న భర్త, విడాకుల గొడవలో బలైన ఇల్లాలు
Hazarath Reddyసాయిలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా.. సూర్యచంద్రం ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని సాయి లక్ష్మి మెడపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.