News

Prasanth Kishore: పదో తరగతి పాస్‌ అయితే బీహార్ సీఎం, సీఎం నితీశ్‌ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్

Arun Charagonda

యువత రాజకీయాల్లో రావాలని పిలుపునిచ్చారు పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఇటీవలే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్, జన్ సురాజ్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

Hyundai Grand I10 Nios Hy Cng Duo: హుంద్యాయ్ నుంచి మార్కెట్లోకి మ‌రో సీఎన్జీ వాహ‌నం, మ‌ద్య‌త‌ర‌గగతి ప్ర‌జ‌ల‌కు అందుబాటు ధ‌ర‌లోకి తెచ్చిన కంపెనీ

VNS

గ్రాండ్ ఐ10 నియోస్ హెచ్‌వై-సీఎన్జీ డ్యూ (Hyundai Grand i10 Nios Hy-CNG Duo) కారు 1.2 లీటర్ల బై-ఫ్యూయల్ (Bi-Fuel) ఇంజిన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ సీఎన్జీ మోడ్‌లో గరిష్టంగా 69 హెచ్పీ విద్యుత్, 95.2 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.

Novak Djokovic Wins Olympic Gold: ఒలింపిక్స్ లో క‌ల సాకారం చేసుకున్న జొకోవిచ్, తొలిసారి గోల్డ్ మెడ‌ల్ సాధించిన జొకోవిచ్

VNS

మాజీ వ‌రల్డ్ నంబ‌ర్ 1 నొవాక్ జ‌కోవిచ్ (Novak Djokovic) త‌న‌ క‌ల సాకారం చేసుకున్నాడు. విశ్వ క్రీడ‌ల్లో ఏండ్లుగా ఊరిస్తున్న బంగారు ప‌త‌కాన్ని Gold) కొల్ల‌గొట్టాడు. కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చ‌రిత్ర సృష్టించిన జ‌కో ఎట్ట‌కేల‌కు పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ ప‌ట్టేశాడు.

Filmfare South Awards: ఫిల్మ్ ఫేర్ లో తెలుగు సినిమాల‌కు అవార్డుల పంట‌, బెస్ట్ మూవీగా బ‌లగం, బెస్ట్ యాక్ట‌ర్ గా నాని, పూర్తి అవార్డుల వివ‌రాలిగో

VNS

తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు (Filmfare Awards South) వరించాయి. ఉత్తమ చిత్రంగా బలగం, దసరాలో (Dasar Movie) నటనకు గాను బెస్ట్‌ హీరోగా నాని (Nani), ఉత్తమ దర్శకుడిగా వేణు యేల్డండి (Venu Yeldandi) నిలిచారు

Advertisement

Bangladesh Violence: బంగ్లాదేశ్ లో మ‌రోసారి ర‌క్తపాతం, ఏకంగా 32 మంది మృతి, ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్

VNS

బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు (Bangladesh)వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు వదిలారు.

Abids Kidnap Case:వీడియో ఇదిగో.. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు, కిడ్నాప్ చేసిన వ్యక్తిని చితకాదిన కుటుంబ సభ్యులు

Arun Charagonda

హైదరాబాద్ అబిడ్స్ కిడ్నాప్ కేసును గంటల్లోనే చేధించారు పోలీసులు. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు బృందాలు బరిలోకి దిగగా గంటల వ్యవధిలోనే చేధించారు పోలీసులు. కిడ్నాప్ చేసిన నిందితుడిని చితకబాదారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది

Astrology: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి..ఎలా జరుపుకోవాలి పాటించాల్సిన నియమాలు ఇవే.. ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో బంగారం కురిపించడం ఖాయం.

sajaya

శ్రావణమాసం అంటేనే చాలా శుభకరం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి నోములు, వ్రతాలు ఆడవాళ్లు జరుపుకుంటారు. భర్త ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి. మానసిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు.

Astrology: ఆగస్టు 16 నుంచి శని గమనంలో మార్పు..ఈ 3 రాశులకు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది కష్టకాలం నడుస్తుంది.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం శని చాలా ప్రభావంతమైన గ్రహం. ఈ గ్రహం కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆగస్టు 16న శని గ్రహం గమనంలో మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

Advertisement

Astrology: ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారు కుబేరులు అవుతారు.. డబ్బు సంపాదించడంలో నిపుణులు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వల్ల కొంత మందికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా సంఖ్య శాస్త్రంలో కూడా రాడిక్స్ సంఖ్య కలిగి ఉంటుంది. ఈ సంఖ్య వారి అదృష్టాన్ని తెలియజేస్తుంది.

KTR On CM Revanth Reddy US Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, మాకైతే తెలంగాణ ఫస్ట్

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటపై ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి భారీ బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్తున్నది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి, మంత్రి శ్రీధర్‌బాబుకు నా శుభాకాంక్షలు. ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

Maharashtra: వీడియో ఇదిగో..సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిన యువతి, 150 అడుగుల లోయ నుండి?

Arun Charagonda

మహారాష్ట్రలోని సతారా జిల్లా బోర్నె ఘాటు సమీపంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఘాటు సమీపంలో స్నేహితులతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఓ యువతి జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమీపంలోనే ఉన్న శివేంద్ర రాజే సేఫ్టీ బృందం ఆమెను క్షేమంగా పైకి తీసుకొచ్చింది.

Health Tips: కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే అవిస గింజలతో చెక్.

sajaya

అవిస గింజలు వీటిని ఫ్లాక్ సీడ్స్ అని అంటారు. చూడడానికి చాలా చిన్నగా ఉన్న వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Advertisement

Health Tips: బోడ కాకరకాయల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసా.

sajaya

కేవలం సంవత్సరంలో వర్షాకాలంలో మాత్రమే లభించే కూరగాయ బోడ కాకరకాయ. దీనిని ఆ కాకరకాయ అని కూడా అంటారు. దీనిలో పోషక విలువలు చూస్తే చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.

Health Tips: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే.

sajaya

కొంతమందిలో సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన అనేది వస్తుంది. అలా కాకుండా ఎటువంటి దంత సమస్యలు లేకుండా కేవలం నోటి దుర్వాసన వస్తున్నట్లయితే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Andhra Pradesh: వైసీపీ నేతపై హత్యాయత్నం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, కర్రలతో దాడి, కారు ధ్వంసం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. గింజుపల్లి శ్రీనివాసరావు పై హత్యాయత్నం జరిగింది. కర్రలతో ప్రత్యర్ధులు దాడి చేశారు.కారును ధ్వంసం చేశారు.వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Health Tips: మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా.

sajaya

పెసలు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థం. ఇందులో ప్రోటీన్ తో పాటు అనేక రకాలైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు మొలకెత్తి ఈ పెసలను గింజలు తీసుకున్నట్లయితే మీరు వెయిట్ లాస్ అవుతారు. పెసలలో ప్రోటీన్ అధిక శాతం ఉంటుంది.

Advertisement

Nizamabad: గొడ్డుకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ప్రిన్సిపాల్‌పై మండిపాటు ,ఎంఈవోకు ఫిర్యాదు

Arun Charagonda

గొడ్డు కారంతో మధ్యాహ్న భోజనం వండించిన సంఘటన నిజామాబాద్ కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో చోటు చేసుకుంది. కారంలేని పప్పు వడ్డించారని పిల్లలు తినడానికి ఇష్టపడలేదు. దీంతో పిల్లలకు కారం,నూనె పోసి ఇవ్వగా దాంతోనే తిన్నారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిపై మండిపడి, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.

AP Volunteer System: వలంటీర్‌ వ్యవస్థలో మార్పులు, శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు, కొంతమందితోనే వలంటీర్ సిస్టమ్, చంద్రబాబు కీలక నిర్ణయం?

Arun Charagonda

ఏపీలో వలంటీర్ వ్యవస్థపై క్లారిటీ వచ్చేసింది. ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వలంటీర్ల సేవలను వాడుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం వలంటీర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారు.

Uttar pradesh: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై డబుల్ డెక్కర్ బస్సు - కారు ఢీ, 7 మంది మృతి..వీడియో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్ ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు మరియు కారు ఢీకొన్న ప్రమాదంలో 7 మంది మృతి చెందారు.

Bihar: బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు, ఆల్‌ఖైదా పేరుతో బెదిరింపులు, అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

Arun Charagonda

బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. పాట్నాలోని సీఎం కార్యాలయానికి బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement