Google Pani Puri Doodle (PIC@ Google)

New Delhi, July 12: సాయంత్రమైందంటే చాలు పానీపూరీ (Pani Puri) బండ్ల దగ్గర పెద్ద క్యూ కనిపిస్తుంది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఇష్టపడే పానీపూరికి గూగుల్ (Google) అరుదైన గౌరవం ఇచ్చింది. నార్త్ ఇండియాలో గోల్ గప్పా (Gol Gappas) అని పిలుచుకునే పానీపూరీ డూడుల్‌ను తయారు చేసింది. భారత్‌లో అత్యధిక ప్రజలు ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ పానీపూరీనే అంటూ గూగుల్ చెప్పుకొచ్చింది.

అయితే 2015 జులై 12న మధ్యప్రదేశ్‌ ఇండోర్ లో ఓ రెస్టారెంట్ 51 రకాల పానీపూరీలను ప్రిపేర్ చేసింది. మాస్టర్ చెఫ్ నేహా (Masterchef Neha) నేతృత్వంలో రకరకాల పానీపూరీలను తయారు చేసి రికార్డు సృష్టించింది. ఈ రికార్డు సాధించి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ (Google Doodle) విడుదల చేసింది.