Madras High court

Chennai, DEC 28: అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్‌లో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై దర్యాప్తు కోసం మహిళా పోలీస్‌ అధికారిణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అలాగే బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారం ఆదేశించింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో (Anna University Campus) విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యార్థి సంఘాలతోపాటు ప్రతిపక్షాలు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్, భద్రతా సిబ్బందితో ఫోటోలకు ఫోజు..హోంమంత్రి అనిత ఆగ్రహం,విచారణకు ఆదేశం 

కాగా, ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి బదిలీ చేయాలంటూ మద్రాస్ హైకోర్టు పిటిషన్‌ దాఖలైంది. జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం, జస్టిస్‌ వీ లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై శనివారం విచారణ జరిపింది. కేసు దర్యాప్తు కోసం ముగ్గురు మహిళా ఐపీఎస్‌ అధికారిణులతో కూడిన సిట్‌ను (SIT) ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే బాధిత విద్యార్థిని చదువు ప్రభావితం కాకుండా చూడాలని, అన్నా యూనివర్శిటీ ఆమె నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.