యువతలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న సమస్య తెల్ల జుట్టు మహిళల్లో పురుషుల్లో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొంతమందిలో ఈ సమస్య చిన్నప్పటి నుంచే ఇబ్బంది పెడుతుంది. అయితే దీన్ని సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్కెట్లో లభించే అనేక రకాల హెయిర్ డైలు అనేక రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా చర్మ క్యాన్సరు జుట్టు రాలిపోవడం కళ్ల సమస్యలు వంటివి తీసుకొస్తుంది. అలా కాకుండా కొన్ని సహజ పద్ధతుల ద్వారా తెల్ల జుట్టును దూరం చేసుకోవచ్చు. ఈ టిప్స్ ఫాలో అయితే తెల్ల జుట్టు రాకుండా నివారించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గోరింటాకు- సహజంగా లభించే గోరింటాకును మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో నిమ్మరసం, కొంచెం కాఫీ, పొడి వంటివి కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్టును తలకు అప్లై చేసుకుని ఒక గంట తర్వాత వాష్ చేసుకున్నట్లయితే తెల్లజుట్టు సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా తెల్ల జుట్టు నలుపు రంగులోకి మారుతుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
బీట్రూట్- బీట్రూట్ కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. బీట్రూట్ ను మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో కాస్త హెన్నా పౌడర్ కలుపుకొని తలకు అప్లై చేసుకొని ఒక అరగంట తర్వాత వాష్ చేసుకున్నట్లయితే తెల్ల జుట్టు నలుపు రంగులోకి మారుతుంది. ఇది ఇందులో ఎటువంటి కెమికల్స్ వాడకపోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
ఉసిరి- ఉసిరిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికే కాకుండా జుట్టు నల్లబడడానికి కూడా సహాయపడుతుంది. ఉసిరికాయల్ని తీసుకొని వాటిని ఎండలో పెట్టుకొని వాటిని పొడి లాగా చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఉసిరికాయ పొడిని కొబ్బరి నూనెలో వేసి మరిగించుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో దాచుకోవాలి. అను నేను రెగ్యులర్గా జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా తెల్ల జుట్టు రాను రాను తగ్గుతుంది. రెగ్యులర్గా ఈ నూనెతో జుట్టును మసాజ్ చేసుకోవడం ద్వారా మెలను ఉత్పత్తి పెరిగి జుట్టు నల్లగా మారుతుంది.
కరివేపాకు- కరివేపాకును కూడా జుట్టు నల్లబడడానికి వాడుతూ ఉంటారు. కరివేపాకును తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని కొబ్బరి నూనెలో వేసి మరిగించుకోవాలి. తర్వాత దీన్ని వడకట్టుకొని ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. దీని ప్రతి రోజు జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా సహజంగానే మీ జుట్టు నలుపు రంగులోకి మారుతుంది.
గుంట గరగర ఆకు- గుంటగరగరాకు తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో ప్రముఖ స్థానంలో ఉంటుంది. దీనిని పౌడరు అన్ని షాప్స్ లలో లభిస్తుంది. మీకు సహజంగా ఈ ఆకు పల్లెటూర్లో ఎక్కువగా లభిస్తుంది. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని తలకు అప్లై చేసుకొని ఒక అరగంట తర్వాత తలస్నానం చేసినట్లయితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.