Politics

Hyderabad: వీడియో, పాతబస్తీలో యువకులు ర్యాష్ డ్రైవింగ్,గన్ చూపించి వారికి చుక్కలు చూపించిన మీర్‌చౌక్‌ ఎస్సై, కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించిన యువకులు

Hazarath Reddy

పాతబస్తీలోని మీర్‌చౌక్‌ ఏసీపీ ప్రసాద్‌ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున పాతబస్తీ ఎతేబార్‌చౌక్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు ఓపెన్‌ టాప్‌ కారులో ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. విధి నిర్వహణలో మీర్‌చౌక్‌ ఎస్సై దీన్ని గమనించి వెంటనే తన పౌచ్‌లో ఉన్న గన్‌ను చేతిలోకి తీసుకుని కారు కిందకు దిగండి అంటూ బిగ్గరగా ఆరిచాడు.

Border Row: కర్ణాటకలో కలిసిన 865 గ్రామాలు ఇక మహారాష్ట్రలోకి, మ‌రాఠీ భాష మాట్లాడే గ్రామాలను రాష్ట్రంలో కలిపే తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిసిన మహా అసెంబ్లీ

Hazarath Reddy

మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు కీల‌క తీర్మానం ఏక గ్రీవంగా ఆమోదం పొందింది. ఈ తీర్మానం ద్వారా మ‌రాఠీ భాష మాట్లాడే క‌ర్నాట‌క‌లోని 865 గ్రామాల‌ను మ‌హారాష్ట్ర‌లో క‌ల‌ప‌నున్నారు. క‌ర్నాట‌క‌తో బోర్డ‌ర్ స‌మ‌స్య ఉత్ప‌న్నం అవుతున్న నేప‌థ్యంలో సీఎం ఏక‌నాథ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

Kodali Nani: వంగవీటి రంగా చావుకు టీడీపీనే కారణం, ఈ హత్యలో చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉంది, సంచలన వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని

Hazarath Reddy

కాపు నాయకుడు వంగావీటి మోహనరంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani comments) అన్నారు. సోమవారం గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొడాలి నాని హాజరై రంగా చిత్రపటానికి నివాళులర్పించారు.

Chalapathi Rao: రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరం.. చలపతి రావు మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

Rudra

సీనియర్ సినీ నటుడు చలపతిరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమని చెప్పారు.

Advertisement

CM Jagan Speech in Kamalapuram: ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడి ఐదు కోట్ల ప్రజలే నా కుటుంబం, కమలాపురంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

నువ్వు మా బిడ్డ. రాష్ట్రం వైపు నువ్వు చూడు. మిగిలిన విషయాలు మేం చూసుకుంటాం అని దీవించి పంపితే.. ఇవాళ మీ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో మంచి పనులు చేస్తూ.. దేవుడి ఆశీస్సులతో ఇవాళ ఈ నియోజకవర్గంలోనూ మంచి చేసే అవకాశం ఇచ్చినందుకు పేరుపేరునా అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..

Delhi Mayor Elections 2022: ఆప్‌ మేయర్‌ అభ్యర్థిగా మహిళ, షెల్లీ ఒబెరాయ్‌ పేరును ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ

Hazarath Reddy

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళ(శుక్రవారం) మేయర్‌ క్యాండిడేట్‌ను ప్రకటించింది ఆ పార్టీ. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆప్‌ మేయర్‌ అభ్యర్థిగా మహిళ అభ్యర్థి పేరును ప్రతిపాదించింది.

Parliament Winter Session: షెడ్యూల్ కంటే ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా, మొత్తం 13 సమావేశాలతో 62 గంటల 42 నిమిషాలపాటు జరిగిన సభ

Hazarath Reddy

లోక్‌సభ షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగా నిరవధింకగా వాయిదా పడింది.డిసెంబర్ 7న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29న ముగియాల్సి ఉంది.అయితే, లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన.. ప్రభుత్వం, వివిధ పార్టీల ప్రతినిధులతో కూడిన బిజినెస్ అడ్వైజరీ కమిటీలో -- సెషన్‌ను కుదించడానికి నిర్ణయం తీసుకోబడింది.

Errabelli Comments On NTR: టీడీపీ చంద్రబాబుది కాదు.. ఏపీలో ఎన్టీఆర్‌ను సీఎం చేయాలి.. ఎర్రబెల్లి

Rudra

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడి ఇటీవలి ఖమ్మం యాత్ర తెలంగాణ రాజకీయక్షేత్రంలో నిప్పును రాజేసింది. చంద్రబాబు, టీడీపీపై ఇప్పటికే సెటైర్లు వేసిన పలువురు బీఆర్ఎస్ నేతల జాబితాలోకి తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరారు.

Advertisement

Telangana: చంద్రబాబు ఖమ్మం టూర్, సెటైర్లు పేల్చుతున్న తెలంగాణ టీఆర్ఎస్ నేతలు, ఏపీలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అన్న హరీష్ రావు, టీడీపీ ఇప్పటీకే భూ స్థాపితమైందన్న కవిత

Hazarath Reddy

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఖమ్మంలో (Chandra Babu Khamma Tour) పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) సెటైర్లు వేశారు.

Border Row: చైనా భారత్‌లోకి ప్రవేశించినట్లే మేము కర్ణాటకలోకి అడుగుపెడతాం, సరిహద్దు సమస్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్, ముదురుతున్న కర్ణాటక-మహారాష్ట్ర బార్డర్ వివాదం

Hazarath Reddy

చైనా దేశంలోకి ప్రవేశించినట్లే కర్ణాటకలో అడుగుపెడతాం ("Like China, we will enter Karnataka) అంటూ సరికొత్త వివాదానికి తెర లేపారు. ఈ విషయంలో తనకు ఎవరి ‘అనుమతి’ అవసరం లేదని శివసేన పార్టీ సీనియర్ నేత చెప్పారు.

Telangana: మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేఖంగా 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి ఇంట్లో భేటీ, మా నియోజకవర్గ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలు మండిపాటు

Hazarath Reddy

ఈ రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డి తన ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఇతరులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు

List of States Debt 2022: అప్పుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌, 11వ స్థానంలో తెలంగాణ, వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాను వెల్లడించిన కేంద్రం

Hazarath Reddy

భారతదేశంలో వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై కేంద్రం (center Financial Ministry) లోక్ సభ వేదికగా స్పష్టతనిచ్చింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్‌ సభలో సోమవారం రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వక ప్రశ్న సంధించారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ(సహాయ) మంత్రి పంకజ్ చౌదరి (Union Finance (Assistance) Minister Pankaj Choudhary) రాష్ట్రాల అప్పుల వివరాలను (list of states debts 2022) వెల్లడించారు.

Advertisement

Jaishankar Slams Rahul Gandhi: సైనికులు 13 వేల అడుగుల ఎత్తులో నిలబడి పహారా కాస్తున్నారు, వారి పట్ల Pitai లాంటి పదాలు ఉపయోగించడం సరికాదు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ మండిపాటు

Hazarath Reddy

కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ భారత జవాన్లపై చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్ర స్థాయిలో (Jaishankar hits out at Rahul Gandhi) మండిపడ్డారు. భారత జవాన్లకు పిటై (Pitai Word) అనే పదాన్ని ఉపయోగించకూడదంటూ రాహుల్‌పై (Jaishankar Slams Rahul Gandhi) విరుచుకుపడ్డారు.

CM Jagan in Action: ఏపీలో మాదక ద్రవ్యాలు అనే పదం ఎక్కడా వినిపించకూడదు, నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా మార్చండి, ఎస్‌ఈబీ అధికారులతో సీఎం జగన్ సమీక్ష

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో ఎక్సైజ్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (SEB) పనితీరు పైన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ (CM Jagan Review) ష నిర్వహించారు. నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) మారాలని ఈ సమావేశంలో ఆయన ఆకాంక్షించారు.

Himachal CM Sukhu Covid Positive: ప్రధాని మోదీతో సమావేశానికి ముందు కరోనాకు గురైన హిమాచల్ సీఎం సుఖు, కార్యక్రమాలు అన్నీ ఇప్పుడు రీషెడ్యూల్

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన సుఖ్విందర్ సింగ్ సుఖుకు కరోనా వైరస్ సోకినట్లు, పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ (CMO) వర్గాలు సోమవారం తెలిపాయి.

MLAs Poaching Case: మలుపులు తిరుగుతున్న ఎమ్మెల్యేల ఎర కేసు, సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఈడీ విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్యే లేఖ

Hazarath Reddy

తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల ఎర కేసులో (MLAs Poaching Case) విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి (MLA Rohit Reddy) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే

Advertisement

Crisis In TS Congress: తెలంగాణలో ‘హస్త’వ్యస్తం.. కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం... 12 మంది రాజీనామా.. రేవంత్ నాయకత్వానికి వ్యతిరేకంగానే..

Rudra

తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ అంతకంతకు ప్రశ్నార్థకంగా మారుతున్నది. హస్తం పార్టీలో ఎప్పటినుంచో ఉన్న అసంతృప్తులు ఇటీవల పీసీసీ కమిటీల ప్రకటన అనంతరం భగ్గుమన్నాయి.

EAM Jaishankar: ఉగ్రవాదం గురించి ముందు మీ దేశ మంత్రులను అడగండి, ద‌క్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్ర‌వాదం అన్న పాక్ జర్నలిస్టు ప్రశ్నకు విదేశాంగ‌ మంత్రి జైశంక‌ర్‌ కౌంటర్

Hazarath Reddy

ద‌క్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్ర‌వాదం ఉంటుంద‌ని పాకిస్థాన్ జ‌ర్న‌లిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ‌ మంత్రి జైశంక‌ర్‌ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జ‌ర్న‌లిస్టు వేసిన ప్ర‌శ్న‌కు మంత్రి జైశంక‌ర్ బ‌దులిస్తూ.. పాకిస్థాన్‌లోని మీ మంత్రిని ఈ ప్ర‌శ్న వేయాల‌న్నారు.

Bihar Hooch Tragedy: కల్తీ మద్యం తాగి ఎవరైనా మరణిస్తే ఒక్క రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు, అసెంబ్లీలో స్పష్టం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్

Hazarath Reddy

కల్తీ మద్యం సేవించి ఎవరైనా చనిపోతే పరిహారం ఇవ్వబోమని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం అన్నారు. ఛప్రా జిల్లాలో పెరుగుతున్న హూచ్ మరణాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Bharat Jodo Yatra: నేటితో 100 రోజులు పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర, సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన పాదయాత్ర, నేడు రాజస్థాన్‌లోని దౌసా నుండి తిరిగి ప్రారంభం

Hazarath Reddy

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాజస్థాన్‌లో 12వ రోజు శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది.వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉదయం 6 గంటలకు మీనా హైకోర్టు, దౌసా నుండి పాదయాత్రను పునఃప్రారంభించారు.

Advertisement
Advertisement