రాజకీయాలు
Mamata Banerjee: మరోసారి మమతా బెనర్జీ ఏకగ్రీవం, ఇకపై దూకుడు పెంచుతామన్న దీదీ, బీజేపీపై పోరాటానికి ప్రాంతీయపార్టీలు కలిసి రావాలంటూ పిలుపు
Naresh. VNSతృణమూల్‌ కాంగ్రెస్‌ ఛైర్‌ పర్సన్‌ (TMC chairperson) గా సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగాల్‌ (Bengal)లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (TMC) సంస్థాగత ఎన్నికలు ఐదేళ్ల తర్వాత జరగ్గా.. పార్టీ ఛైర్‌పర్సన్‌గా దీదీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌ పార్థ ఛటర్జీ ప్రకటించారు.
Rahul Gandhi in Parliament: మీ విధానాల వల్ల చైనా, పాకిస్తాన్ నుంచి ముప్పు! కేంద్రంపై రాహుల్ ఫైర్, నిరుద్యోగంపై రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనే లేదు, లోక్‌సభలో మోడీ సర్కారుపై రాహుల్ ధ్వజం
Naresh. VNSదేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). గత 50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా (Corona)సమయంలో 84శాతం కుటుంబాలు తమ ఆదాయాన్ని(Lost Income) కోల్పోయాయన్నారు.
Telangana CM KCR: బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తాం, ఆయన బట్టలు మారిస్తే దేశం బాగుపడుతుందా, దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి, కేంద్ర బడ్జెట్ 2022పై మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyకేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది దారుణమైన బడ్జెట్‌, అది పసలేని, పనికిమాలిన బడ్జెట్‌ అని, ఏ వర్గానికీ మేలు చేయని బడ్జెట్‌ అని అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో కేసీఆర్‌ కేంద్ర బడ్జెట్‌పై (BJP, Union Budget 2022-23) మాట్లాడారు.
TRS Boycotts Presidential Speech: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు, పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో టీఆర్ఎస్ ఎంపీలు నిరస‌న
Hazarath Reddyపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేప‌థ్యంలో ఈ రోజు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌సంగించిన విష‌యం తెలిసిందే. అయితే, తెలంగాణ‌ సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు.
Assembly Elections 2022: అయిదు రాష్ట్రాల ఎన్నికలు, ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఫిజికల్ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని పొడిగించిన ఈసీ, కొత్త మార్గదర్శకాలు విడుదల
Hazarath Reddyత్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల్లో (Assembly Elections 2022) ఫిజికల్ ర్యాలీలు, రోడ్‌షోలపై విధించిన నిషేధాన్ని మరోసారి ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారంనాడు పొడిగించింది. ఫిబ్రవరి11వ తేదీ వరకూ నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.
Ban on exit poll: ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేదం, ఒకవేళ ప్రకటిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిక, ఐదు రాష్ట్రాల్లో అప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ లేనట్లే
Naresh. VNSఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఐదు రాష్ట్రాల్లో అన్ని దశల్లో ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేదం విధించింది
South Central Railway: ఈ నెల 31 వరకు 55 రైళ్లు రద్దు, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ సీఆర్ పరిధిలోని 55 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్లలో ఎక్కువగా ప్యాసింజర్ ట్రైన్లు ఉండగా, మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి.
Ex TDP MLA Sobha joins YSRCP: విజయనగరం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ, వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎస్‌. కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి
Hazarath Reddyవిజయ నగరం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లా ఎస్‌. కోట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి వైసీపీ తీర్థం పుచుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్‌సీపీలోకి వచ్చానని ఆమె తెలిపారు.
Punjab Congress: సీఎం అభ్యర్ధిత్వంపై కార్యకర్తలదే తుది నిర్ణయం, మా మధ్య విభేధాలు లేవంటూ చన్నీ, సిద్ధూ ప్రకటన, పంజాబ్ లో రాహుల్ టూర్‌ లో పలు ఆసక్తికర సంఘటనలు
Naresh. VNSపంజాబ్‌(Punjab) లో విజయం కోసం కాంగ్రెస్(Congress) పార్టీ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు నేతలు. ఇక పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై దృష్టిసారించింది అధిష్టానం. సీఎం చన్నీ(CM Channi), పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ(PCC Chief Siddu) మధ్య సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)
Rahul Gandhi Letter to Parag Agrawal: మరోసారి ట్విట్టర్ వర్సెస్ రాహుల్ గాంధీ, నా ఫాలోవర్స్ ను అడ్డుకుంటున్నారంటూ ట్విట్టర్ సీఈవోకు లేఖ, అలాంటిదేమీ లేదంటూ ట్విట్టర్ రిప్లై
Naresh. VNSట్విట్టర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ . తన ఫాలోవర్స్ ను అడ్డుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ప్ర‌భుత్వం ఒత్తిడి చేయ‌డం వ‌ల్ల త‌న స్వ‌రాన్ని నొక్కి పెట్టేందుకు ట్విట్ట‌ర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రాహుల్ విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్‌కు లేఖ కూడా రాశారు.
UP Elections 2022: యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ, బీజేపీ కండువా కప్పుకున్న మాజీ కేంద్ర మంత్రి ఆర్‌పీఎన్ సింగ్
Hazarath Reddyయూపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత ఆర్ పీఎన్ సింగ్ కాషాయం కండువా కప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మంధ్ర ప్రధాన్ సమక్షంలో RPN Singh బీజేపీలో చేరారు.
Prashant Kishor: 2024లో బీజేపీని ఓడించడంపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీతో అది సాధ్యం కాదని స్పష్టం, పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సూచన
Hazarath Reddy2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడం (Possible To Defeat BJP In 2024) సాధ్యమేనని, అందుకు తగిన ప్రతిపక్షం ఏర్పాటుకు తాను సహాయపడతానని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు అనుకూలంగా రాకపోయినా ఇది సాధ్యమేనన్నారు.
UP Elections: ఓటు అడిగేందుకు బాత్రూంలోకి వెళ్లిన ఎమ్మెల్యే, స్నానం చేస్తున్న వ్యక్తిని కూడా వదలరా! ఇదెక్కడి ప్రచారం సామీ! అంటూ నెటిజన్ల ఆశ్చర్యం
Naresh. VNSకాన్పూర్‌ లోని గోవింద్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌రుపున టీ చేస్తున్న ఎమ్మెల్యే సురేంద్ర మియాథాని ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ఏం చేశాడో తెలుసా? ఓ వ్య‌క్తి స్నానం చేస్తుండ‌గా అత‌డి ద‌గ్గ‌రికి వెళ్లి అత‌డితో ముచ్చ‌టించ‌డం స్టార్ట్ చేశాడు. అతను స్నానం చేస్తున్నాడని కూడా వదలకుండా ఇల్లు ఉందా? అంతా ఓకేనా.. అంటూ ప్ర‌శ్నించాడు
Ban on Roadshows: మరోసారి నిషేదం పొడిగింపు, ఐదు రాష్ట్రాల్లో సభలు, సమావేశాలపై ఈసీ కీలక నిర్ణయం, ఈ నెల 31వరకు ఆంక్షలు పొడిగింపు, కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్తర్వులు
Naresh. VNSఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో జనవరి 31 వరకు రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధం కొనసాగుతుందని ఎలక్షన్‌ కమీషన్‌ పేర్కొంది. ఈ మేరకు పంజాబ్ (Punjab), ఉత్తరప్రదేశ్, గోవా , ఉత్తరాఖండ్, మణిపూర్‌ లలో జనవరి 31 వరకు రోడ్‌షో(Road shows)లు, ప్రచార ర్యాలీలు నిషేధిస్తున్నట్లు ఈసీ(EC) తెలిపింది.
Utpal Parrikar Quits BJP: గోవాలో బీజేపీ భారీ షాక్, పార్టీని వీడిన మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటన
Naresh. VNSమ‌నోహ‌ర్ పారికర్‌ కుమారుడు ఉత్ప‌ల్ పారికర్‌ బీజేపీకి రాజీనామా చేశారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ప‌ణాజీ (Panaji) నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతున్న‌ట్లు శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్లైంది. ‘గ‌తంలో, ఇప్పుడు… మా పార్టీని ఒప్పించ‌డానికి శ‌త‌ధా ప్ర‌య‌త్నాలు చేశాను. అయినా ప‌ణాజీ టిక్కెట్ తెచ్చుకోలేక‌పోయాను.
Goa Assembly Elections 2022: గోవా ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్, కుల ఆయుధాన్ని ఎక్కుపెట్టిన ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్, అవినీతిని పాలేకర్ తుడిచేస్తారని వెల్లడి
Hazarath Reddyఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిని ప్రకటించారు. గోవా రాష్ట్రంలో శక్తిమంతమైన భండారి (ఓబీసీ) సామాజిక వర్గానికి చెందిన పాలేకర్ ను (Lawyer Amit Palekar) ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు.
Aparna Yadav Joins BJP: బావ అఖిలేష్ యాదవ్‌కు షాక్, బీజేపీ తీర్థం పుచుకున్న ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్
Hazarath Reddyసమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్, యూపీ డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్యాల సమక్షంలో బీజేపీ తీర్థం స్వీకరించారు.
Uttar Pradesh Assembly elections: యూపీ ఎన్నికల బరిలోకి అఖిలేష్ యాదవ్, నేరుగా పోటీ చేయనున్న ఎస్పీ అధినేత, త్వరలోనే పోటీచేసే స్థానం ఖరారు
Naresh. VNSసమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Samajwadi Party Chief Akhilesh Yadav) ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రస్తుతం అజాంగర్ ఎంపీ(MP from Azamgarh)గా ఉన్న ఆయన...నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. కేవలం శాసనమండలిలో సభ్యుడిగా మాత్రమే కొనసాగారు. అయితే ఈసారి అలా కాకుండా నేరుగా పోటీలో ఉండాలని భావిస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
5 States Elections: ర్యాలీలు, రోడ్‌ షోలపై నిషేదం పొడిగింపు, ఈ నెల 22 వరకు సభలు, రోడ్‌ షోలు రద్దు, కోవిడ్ తగ్గకపోవడం ఈసీ నిర్ణయం, డిజిటల్ ప్రచారం చేసుకోవాలంటూ సూచన
Naresh. VNSఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ర్యాలీలు(poll rallies), రోడ్ షోలు(roadshows ), పాదయాత్రలు, బహిరంగసభలను నిర్వహించకూడదు. ఇంటింటి ప్రచారాన్ని కూడా ఐదుగురికి మించి ఉండకుండా చూసుకోవాలి. గతంతో జనవరి 15 వరకు ఆంక్షలను విధించిన ఈసీ, వాటిపై సమీక్ష జరిపింది.
UP Polls: యూపీ ఎన్నికల కోసం బీజేపీ ఫస్ట్ లిస్ట్, యోగి, కేశవ్ ప్రసాద్ మౌర్యలు పోటీ చేసేది అక్కడి నుంచే, పుకార్లకు చెక్ పెడుతూ అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేసిన బీజేపీ
Naresh. VNSఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP Polls) కోసం ప్రధాన పార్టీలు అభ్యర్ధుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party), కాంగ్రెస్‌ (Congress)లు అభ్యర్ధుల లిస్ట్ రిలీజ్ చేశాయి. తాజాగా అధికార బీజేపీ కూడా తమ జాబితా ప్రకటించింది.