రాజకీయాలు

West Bengal Assembly Elections 2021: రాహుల్ గాంధీ కీలక నిర్ణయం, పశ్చిమ బెంగాల్ పర్యటనలన్నీ రద్దు, కరోనా నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని పిలుపు

Hazarath Reddy

దేశంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో (West Bengal Assembly Elections 2021) ఆయన పాల్గొనవలసిన అన్ని బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు.

Motkupalli Narasimhulu Health Update: మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం, ఐసీయూలో చికి​త్స అందిస్తున్నామని తెలిపిన వైద్యులు, కరోనాతో సోమాజిగూడలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత

Hazarath Reddy

తెలంగాణలో పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకి (Motkupalli Narasimhulu Health Update) కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మోత్కుపల్లి చికిత్స కోసం సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మోత్కుపల్లికి (Motkupalli Narasimhulu) ఐసీయూలో చికి​త్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.

Tirupati Bypoll 2021 Completed: తిరుపతి ఉప ఎన్నికలో 64.29 శాతం పోలింగ్‌ నమోదు, అత్యధికంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 72.68 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 50.58 శాతం ఓటింగ్ నమోదు, మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తిరుపతి లోక్‌సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ సజావుగా (Tirupati Bypoll 2021 Completed) కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 64.29 శాతం పోలింగ్‌ (64.29 per cent polling recorded) నమోదైంది.

Lalu Prasad Yadav Gets Bail: దుమ్కా ఖజానా కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కి బెయిల్, దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా రూ. 3.13 కోట్లు విత్ డ్రా చేశారంటూ కేసు నమోదు, 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా

Hazarath Reddy

దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఎట్టకేలకు బెయిల్ (Lalu Prasad Yadav Gets Bail) లభించింది. దుంకా ట్రెజరీ కేసులో రాంచీ హైకోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా లాలూ దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అంతేగాక బెయిల్ సమయంలో చిరునామా, ఫోన్ నంబర్ లాంటివి మార్చకూడదని స్పష్టం చేసింది.

Advertisement

Tirupati Bypoll 2021: దొంగ ఓట్ల కలకలం, తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలని కోరిన చంద్రబాబు, టీడీపీ డ్రామాలాడుతోందని మంత్రి పెద్దిరెడ్డి మండిపాటు, నకీలీ ఓటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎస్ఈసీ విజయానంద్, ప్రశాంతంగా ఉప ఎన్నిక కొనసాగుతుందని తెలిపిన డీజీపీ సవాంగ్

Hazarath Reddy

తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల అంశం కలకలం రేపుతోంది. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ (Tirupati Lok Sabha Bypoll Election 2021 Updates) నడుస్తోంది. కాగా తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్ నమోదైంది.

West Bengal Assembly Elections 2021 Phase 5: బెంగాల్‌లో మొదలైన ఐదో దశ ఎన్నికల పోలింగ్‌, 45 స్థానాలకు 342 మంది అభ్యర్థులు పోటీ, వచ్చే నెల 2న ఈసీ ఫలితాలు, తదుపరి విడతల పోలింగ్‌పై కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల 5వ దశ పోలింగ్‌ శనివారం ప్రారంభమైంది. కోల్‌కతాలోని దక్షిణేశ్వర్‌లో హిరాలాల్ మజుందర్ మెమోరియల్ కాలేజ్ ఫర్ ఉమెన్ పోలింగ్ బూత్‌ ఇద్ద ఇప్పటికే ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. 4వ దశ పోలింగ్‌ ఘర్షణల నేపథ్యంలో పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

Nagarjuna Sagar By Election 2021: సాగర్ ఉప ఎన్నికల్లో 9 గంటల వరకు 9.8% పోలింగ్ నమోదు, ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్, మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో..

Hazarath Reddy

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ (Nagarjuna Sagar By Election 2021) ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లంత పోలింగ్ కేంద్రాల కు బారులు తీరారు. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Tirupati Lok Sabha Bypoll 2021: కొనసాగుతున్న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్, మొరాయిస్తున్న ఈవీఎంలు, ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగి గుండెపోటుతో మృతి, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్ (Tirupati Lok Sabha Bypoll Election 2021) ఉదయం 7 గంటలకే మొదలైంది. ఈ పోలింగ్‌.. సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. కోవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలున్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం ఆరు గంటల నుంచి అనుమతిస్తారు.

Advertisement

పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్, ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన

Vikas Manda

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు, ప్రత్యేక వైద్య బృందంతో పవన్‌కు చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన

Team Latestly

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సుమన్ అధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. యాంటీ వైరల్ డ్రగ్స్ తో పవన్ కు చికిత్స అందిస్తున్నారు....

'Well Done Modi Ji': మా సలహా పాటించారు..వెల్‌డన్ మోదీజీ, సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడాన్ని స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ, ప్రజల మెరుగైన భవిష్యత్ కోసం కలిసి పనిచేయడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక విధి అంటూ ట్వీట్

Hazarath Reddy

సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ‘‘వెల్‌డన్ మోదీజీ....’’ అంటూ ప్రశంసించింది. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘‘వెల్‌డన్ మోదీజీ... మా సలహా పాటించారు. దేశ హితం కోసం రాహుల్, ప్రియాంక ఎంత దూరమైనా ప్రయాణిస్తారు.

KT Jaleel Resigns: తన రక్తం తాగుతున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు సంతోషంగా ఉండండి, కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య, తన పదవికి రాజీనామా చేసిన కేటీ జలీల్‌

Hazarath Reddy

లోకాయుక్త నుంచి నెపోటిజం, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొన్న కేరళ ఉన్నత విద్యా మంత్రి కేటీ జలీల్‌ మంగళవారం రాజీనామా (KT Jaleel Resigns as Kerala Education Minister) చేశారు. ఆయన తన రాజీనామా లేఖను (KT Jaleel Resigns) ముఖ్యమంత్రికి పంపించారు. అనంతరం అది గవర్నర్‌ను చేరగా, గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ దాన్ని ఆమోదించారని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పింది.

Advertisement

Atchannaidu Leaked Video: చంద్రబాబుపై తిరుపతిలో నేనే చొక్కా విసిరేశాను, ఆయన వల్ల నాకు ప్రాణ హాని ఉంది, తిరుపతి వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆకుల వెంకటేశ్వరరావు, అచ్చెన్నాయుడుతో సంభాషణ వీడియోను లీక్ చేసిన వ్యక్తి ఇతనే..

Hazarath Reddy

ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్ల తనకు ప్రాణ హాని ఉందని టీడీపీ నాయకుడు, వీడియోను లీక్ చేసిన ఆకుల వెంకటేశ్వరరావు (TDP Akula Venkateswara Rao) ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేస్తామని తెలుగుదేశం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు.

West Bengal Assembly Elections 2021: బెంగాల్ రాజకీయ వార్, బీజేపీ నేత రాహుల్ సిన్హాపై 48 గంట‌ల పాటు ప్రచార నిషేధం, కూచ్ బేహార్ కాల్పులపై నోరు జారిన బీజేపీ నేత, రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌కు కూడా నోటీసులు జారీ చేసిన ఈసీ

Hazarath Reddy

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ, బీజేపీ మధ్య వార్ తారాస్థాయికి చేరింది. ఒకరికొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయాలను మరింతగా వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో (West Bengal Assembly Elections 2021) రెచ్చ‌గొట్టే, అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న నేత‌ల‌పై ఎన్నిక‌ల సంఘం (Election Commission) క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Atchannaidu Leaked Video: ఆడే బాగుంటే మనకెందుకీ పరిస్థితి, తిరుపతి ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ లేదు, బొక్కా లేదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అచ్చెన్నాయుడి లీక్ వీడియో, క్లిప్పింగ్‌పై స్పందించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Hazarath Reddy

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఓ కార్యకర్త మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో (Atchannaidu Leaked Video) వైరల్‌గా మారింది. తనకు చంద్రబాబు, లోకేష్ అన్యాయం చేశారంటూ వెంకట్ అనే పార్టీ నేత అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) ముందు ఆవేదన వెల్లగక్కాడు. తనకు అన్యాయం జరిగిందని లోకేశ్‌కు (Nara Lokesh) చెబితే ఆత్మహత్య చేసుకోమన్నాడని అచ్చెన్నాయుడు ముందు వాపోయాడు.

AP Navaratnalu Calendar 2021: నవరత్నాలు 2021 క్యాలండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, నెలలవారీగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వార్షిక క్యాలెండర్‌, ఏ పథకం డబ్బులు ఎప్పుడు పడతాయో ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

సంక్షేమ పథకాలను (Welfare Schemes) ఒక క్రమపద్థతిలో నిర్మాణాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అనుగుణంగా 2021–22 సంవత్సరానికి సంబంధించి నెలలవారీగా వార్షిక క్యాలెండర్‌ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి (ఎక్స్‌ అఫిషియో) జి.విజయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Stones Pelted at TDP Roadshow: మళ్ళీ నేను వస్తా..మీ తోక కట్‌ చేస్తా, రాళ్ళు వేస్తే తోలు తీస్తా.. తాట తీస్తా అంటూ చంద్రబాబు ఫైర్, ఓడిపోతామనే ఈ డ్రామాలకు దిగారన్న వైసీపీ, చంద్రబాబు తిరుపతి రోడ్ షొ లో రాళ్ల దాడిపై వేడెక్కిన ఏపీ రాజకీయం

Hazarath Reddy

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభపై రాళ్ల దాడి (Stones Pelted at TDP Roadshow) జరిగింది. కొందరు దుండగులు సభకు విచ్చేసిన వారిపై రాళ్లు విసరగా, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

West Bengal Elections 2021: బీజేపీ హటావో...దేశ్ బచావో, బెంగాల్ ఎన్నికల్లో పిలుపునిచ్చిన మమతా బెనర్జీ, నందిగ్రామ్‌లో దీదీ క్లీన్‌బోల్డ్ అయ్యారని ప్రధాని మోదీ విమర్శ, బెంగాల్‌లో అధికారంలోకి వస్తే హింసకు తావు లేకుండా చేస్తామని తెలిపిన అమిత్ షా

Hazarath Reddy

బెంగాల్‌లో ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో ఓడిపోతామని కేంద్రంలోని బీజేపీకి తెలుసునని, అందుకునే వాళ్లు తుపాకులు తీస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.

West Bengal Elections 2021 Phase 4: పశ్చిమ బెంగాల్‌లో రక్తపాతం, హింసాత్మకంగా మారిన నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌, 76.16 శాతం పోలింగ్ నమోదు, మమతా బెనర్జీపై మండిపడిన ప్రధాని మోదీ

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లో శనివారం నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మూడు దశల పోలింగ్‌ ప్రశాంతంగా జరగ్గా ఈ నాలుగో దశ (West Bengal Elections 2021 Phase 4) హింసాత్మకంగా మారింది. కుచ్‌బిహర్‌లో కాల్పులు జరిగి మొత్తం ఐదుగురు మృతి చెందారు. అలాగే పలుచోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి.

No Lockdown in Delhi: కేసులు పెరిగినా లాక్‌డౌన్ విధించ‌బోం, లాక్‌డౌన్ తప్పదంటూ వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కొన్ని ఆంక్షలు మాత్రం తప్పవని వెల్లడి

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న వేళ లాక్‌డౌన్ తప్పదంటూ వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించబోవడం (No Lockdown in Delhi) లేదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement