రాజకీయాలు

Ramateertham Temple: మత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న రామతీర్థం ఘటన, అక్కడ అసలేం జరిగింది? అప్రమత్తమైన ఏపీ సర్కారు, అన్ని దేవాలయాలకు జియో ట్యాగింగ్ చేస్తామని తెలిపిన డీజీపీ సవాంగ్, రామతీర్దంలో హై టెన్సన్

Hazarath Reddy

ఏపీలో రామతీర్థం ఘటన రాజకీయ రంగును పులుముకుంది. అన్ని పార్టీలు దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకునేందుకు అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్సన్ కొనసాగుతోంది. హైందవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలో రామతీర్థంకు (Ramateertham Temple) పిలుపు ఇచ్చింది. అలాగే జనవరి 5వ తేదీన జనసేన-బీజేపీ రామతీర్థం ధర్మయాత్రను చేపట్టనున్నాయి.

Akhilesh Yadav: బీజేపీ వ్యాక్సిన్ ఎలా నమ్మాలి, కరోనా వ్యాక్సిన్ తీసుకునే ప్రసక్తే లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన అఖిలేశ్ యాదవ్, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు

Hazarath Reddy

కరోనా వ్యాక్సిన్‌ను తీసుకునేది లేదని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. బీజేపీ స‌ర్కార్ ఇస్తున్న వ్యాక్సిన్‌ను తాను న‌మ్మ‌ను అని, ఇప్పుడైతే తానేమీ కోవిడ్ టీకాను తీసుకోవ‌డం లేద‌ని (Won't Get Vaccinated For Now) స‌మాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాద‌వ్ అన్నారు. బీజేపీ వ్యాక్సిన్‌ను తానెలా నమ్ముతానని ( Cannot Trust BJP's Vaccine) ఎదురు ప్రశ్నించారు.

YCP Ministers vs Pawan: నువ్వొక బోడి నాయుడివి, పకీర్ సాబ్‌వి, బోడి లింగం కాబట్టే రెండు చోట్ల తొక్కి పడేశారు, పవన్ కళ్యాణ్ శతకోటి లింగాల్లో బోడి లింగం వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన వైసీపీ మంత్రులు

Hazarath Reddy

గుడివాడ, మచిలీపట్నంలలో సోమవారం పర్యటించిన పవన్... మంత్రి కొడాలి నానిపై పంచ్ డైలాగులతో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు కౌంటర్ (YCP Ministers Counter to Pawan Kalyan) విసిరారు.

Rajinikanth Politics: ఆ దేవుడు నన్ను హెచ్చరించాడు, రాజకీయాల్లోకి రావడం లేదని రజనీకాంత్ సంచలన ప్రకటన, అభిమానులంతా నన్ను క్షమించాలని కోరిన తలైవా

Hazarath Reddy

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ ఆగమనంపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ (Rajinikanth To Not Launch Political Party) మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

Advertisement

Farmers' Protest: మేం రైతులం..ఉగ్రవాదులం కాదు, ప్రభుత్వంతో మళ్లీ చర్చలు జరపనున్న రైతు సంఘాలు, డిసెంబర్ 29న చర్చకు రావాలంటూ వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌కు లేఖ

Hazarath Reddy

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టుబడుతున్న రైతులు.. ప్రభుత్వంతో మళ్లీ చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు రైతు సంఘాలు వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌కు (Agriculture Secretary Vivek Agarwal) లేఖ పంపాయి.

RLP Quits NDA Over Farm Laws: మోదీ సర్కారుకు మరో ఎదురుదెబ్బ, ఎన్టీఏ నుంచి వైదొలిగిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ, కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ ఏకమవుతున్న ప్రతిపక్షాలు

Hazarath Reddy

‌కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న‌బీజేపీ నేతృత్వంలోని NDA కూట‌మికి మ‌రో ఎదురుదెబ్బ (RLP Quits NDA Over Farm Laws) త‌గిలింది. ఇప్ప‌టికే శివ‌సేన‌, శిరోమ‌ణి అకాలీద‌ళ్ పార్టీలు NDA కూట‌మికి గుడ్ బై చెప్ప‌గా తాజాగా రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (RLP) ఆ జాబితాలో చేరింది.

'Will Bury You 10-Feet Deep': మామా..మంచి ఫామ్ మీద ఉన్నాడు, మిమ్మల్ని పది అడుగుల గోతిలో పాతేస్తా, మాఫియాకు హెచ్చరికలు జారీ చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ మాఫియా, గుండాగాళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గుడ్‌ గవర్నెన్స్‌ డే సందర్భంగా సీఎం (Madhya Pradesh CM Shivraj Singh Chouhan) మాట్లాడుతూ.. తన మూడ్ అసలు బాలేదని రాష్ట్రంలో ఎవరైనా మాఫియా ఉంటే వెంటనే తట్టాబుట్టా సర్దుకుని పారిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో ఆపకుంటే అందర్నీ 10 అడుగుల గోతిలో పాతిపెడతానని ('Will Bury You 10-Feet Deep') హెచ్చరించారు.

Farmers’ Protest: ఎంఎస్పీపై చర్చకు తావు లేదు, విభేదించే వారితో చర్చలకు సిద్ధంగా ఉన్నాం, రైతులను పక్కదారి పట్టించవద్దు, ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టిన ప్రధాని మోదీ

Hazarath Reddy

కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్న (Farmers’ Protest) సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అంశంపై చర్చకు అసలు తావే లేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసలు చేస్తున్న రైతులకు మద్దతిస్తున్న విపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

Advertisement

PM Kisan: రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ నిధి కింద రూ.18 వేల కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, 9 కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ మొత్తం

Hazarath Reddy

రైతులకు మోడీ సర్కారు శుభవార్తను చెప్పింది. పీఎం కిసాన్ కింద రూ. 18 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం (PM Narendra Modi Releases Rs 18,000 Crore) విడుదల చేసింది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాలో జమకానుంది. ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన్ (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) కింద దేశంలో 9 కోట్ల మంది రైతులకు (9 Crore Farmers) ఈ మొత్తం అందనుంది.

Farm Laws Stir: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో ఉద్రిక్తత, ప్రియాంక గాంధీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, రాష్ట్రపతిని కలిసి మెమొరాండం సమర్పించిన రాహుల్ గాంధీ

Team Latestly

కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు రైతులు దిల్లీ సరిహద్దుల నుండి కదలరని చెప్పారు. ప్రతిపక్షాలు రైతులతోనే ఉన్నాయి. చట్టాలు రద్దు అయ్యే వరకు నిరసన తెలిపే రైతులను ఎవరూ ఆపలేరు ఆయన పేర్కొన్నారు. ఈ సత్యాగ్రహంలో దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు అందరూ మద్ధతుగా నిలవాలని రాహుల్ గాంధీ కోరారు...

Manohar Lal Khattar: ఎమ్‌ఎస్‌పీ ఎప్పటికీ రద్దు కాదు, రద్దు చేయాలని చూస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా, చర్చలతోనే సమస్యకు పరిష్కారం, సంచలన వ్యాఖ్యలు చేసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాక్‌ ఖట్టర్‌

Hazarath Reddy

ఢిల్లీ సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతుల ఉద్యమిస్తున్న సంగతి విదితమే. నిరసనలు 26వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం మనోహర్‌లాక్‌ ఖట్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంటలకు కల్పించే కనీస మద్ధతు ధరను(ఎమ్‌ఎస్‌పీ) ఎవరైనా రద్దు చేయాలని చూస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఖట్టర్‌ ఆదివారం మాట్లాడారు.

West Bengal Assembly Elections 2021: ఒక్కసారి గెలిపించండి, రాష్ట్రాన్ని బంగారు బెంగాల్‌లా మార్చి చూపిస్తాం, మిడ్నాపూర్‌లో బహిరంగ సభలో అమిత్ షా, సుబేందుతో సహా ఎంపీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక

Hazarath Reddy

తృణమూల్ మాజీ నేత, మమతా బెనర్జీకి (Mamata Banerjee) అత్యంత సన్నిహితుడైన సుబేందు అధికారి శనివారం బీజేపీలో (Suvendu Adhikari Joins BJP) చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో మిడ్నాపూర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో (Amit Shah in Midnapore) సుబేందు బీజేపీలో చేరారు. ఈయనతో పాటు ఎంపీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.

Advertisement

Fire at Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం, స్టీల్ ప్లాంట్ ఎస్‌ఎమ్‌ఎస్-2‌లో లాడిల్ తెగిపోవడంతో కోటి రూపాయల విలువైన ఉక్కుద్రావణం నేలపాలు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ కార్వనిర్వాహక రాజధానిగా తయారుకాబోతున్న విశాఖపట్నం జిల్లాలోని విశాఖ ఉక్కులో విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం (Fire at Vizag Steel Plant) చోటు చేసుకుంది. ఎస్ఎంఎస్-2లో ద్రవ ఉక్కుతో ఉన్న లాడిల్ జారిపడటంతో అది నేలపై పడిపోయింది. ఉక్కు పడిన చోట ఆయిల్ ఉండటంతో ఒక్కసారిగా మంటలు (Fire accident in Vizag steel plant) ఎగిసిపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న నలుగురి సిబ్బందికి గాయాలు అయ్యాయి.

CJs Reshuffle: ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ జస్టిస్‌ల బదిలీ, ఏపీ హైకోర్ట్ సీజే సిక్కిం హైకోర్టుకు బదిలీ, తెలంగాణ హైకోర్ట్ సీజేగా జస్టిస్ హిమా కోహ్లీ పేరు ప్రతిపాదన

Team Latestly

సోషల్ మీడియా పోస్టుల ద్వారా న్యాయవ్యవస్థను దుర్భాషలాడాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించిన సమయంలో, హైకోర్టు యొక్క తటస్థతను పునరుద్ధరించాలంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం సీజే ఎస్ఐ బొబ్డేకు లేఖ రాశారు....

Makkal Sevai Katchi: రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్‌ సేవై కర్చీ, బాషా సినిమాలో వాడిన ఆటోనే ఎన్నికల గుర్తు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం ఎదురుచూపు, తమిళ మీడియాలో న్యూస్ వైరల్, ఇంకా అధికారికంగా రాని సమాచారం

Hazarath Reddy

తమిళనాడులో వచ్చే ఏడాది మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల (Tamilnadu elections 2021) బరిలో దిగేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ రెడీ అవుతున్నారు. డిసెంబర్‌ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరు, చిహ్నంపై ( Rajinikanth Party Symbol) తలైవా ఇప్పటికే తీవ్ర కసరత్తు జరిపారు.

Kamal Haasan Fire on PM Modi: కొత్త పార్లమెంట్ భవనం అవసరమా? ముందు దేశ ప్రజల ఆకలి సంగతి చూడండి, ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై విరుచుకుపడిన మక్కల్ నిధి మయమ్ అధినేత కమల్ హసన్

Hazarath Reddy

నూతన పార్లమెంట్‌ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసిన నేపథ్యంలో మక్కల్ నిధి మయమ్ (Makkal Needhi Maiam) అధినేత, నటుడు కమల్ హసన్ ప్రధాని మోదీపై తీవ్రంగా (Kamal Haasan Fire on Modi) మండిపడ్డారు.

Advertisement

Central Vista Bhoomi Pooja: 'ఆత్మ నిర్భర్ భారత్‌కు ఇది పునాది' ! సెంట్రల్ విస్టాకు భూమి పూజ చేసిన ప్రధాని మోదీ, నూతన పార్లమెంట్ భవనం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రకటన

Team Latestly

స్వాతంత్య్రం తర్వాత దేశానికి దారిచూపిన ప్రస్తుత పార్లమెంట్ భవనం వందేళ్ల క్రితం నిర్మించింది. అది దేశ ప్రజాస్వామ్య అవసరాలను తీర్చింది. ఇప్పుడు నిర్మించబోయే నూతన భవనం 21వ శతాబ్దానికి చెందిన భారత్‌కు సేవలందిస్తుందని. దేశ ఆకాంక్షలను, ఆశయాలను నెరవేరుస్తుందని, ఈ భవనం ఆత్మనిర్భర్ భారత్ స్థాపనకు పునాది అవుతుంది...

Bharat Bandh: వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతుల పోరు, కొనసాగుతున్న భారత్ బంద్, నిర్మానుష్యంగా మారిన ఢిల్లీ సరిహద్దులు, నోయిడాలో 144 సెక్షన్, పోలీసులు భారీ బందోబస్త్, బంద్‌కు మద్దతు ప్రకటించిన పలు సంఘాలు

Hazarath Reddy

ప్రధాని మోదీ సర్కారు తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్‌ బంద్‌ (Bharat Bandh Today Latest Updates) జరుగుతోంది. దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్‌ఎస్‌, వైసీపీ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. బంద్‌లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

Vijayashanti Joins BJP: కేసీఆర్‌ని గద్దె దింపేది మేమే, కాంగ్రెస్ పార్టీ పోరాడలేని స్థితికి చేరుకుంది, బీజేపీలో చేరిన విజయశాంతి, చేరిన వెంటనే తెలంగాణ సీఎంపై మాటల తూటాలు పేల్చిన రాములమ్మ

Hazarath Reddy

తెలంగాణ రాములమ్మ.. సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ తీర్థం (Vijayashanti Joins BJP) పుచ్చుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి బీజేపీలో చేరిన తరువాత సీఎం కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు.

Justin Trudeau: ఇండియా హెచ్చరికలు బేఖాతర్, రైతులకే నా మద్ధతు, మరోసారి స్పష్టం చేసిన కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో, శాంతియుత నిరసన హక్కులకు కెనడా ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని వీడియో

Hazarath Reddy

ఢిల్లీలో రైతుల ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శాంతియుత నిరసన హక్కులకు కెనడా ఎల్లప్పుడూ మద్దతునిస్తుంది’’ అంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) భారత రైతులకు సంఘీభావం తెలుపుతూ వీడియో విడుదల చేసిన సంగతి విదితమే. అయితే దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. రైతుల ఆందోళనపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో, పార్లమెంట్‌ సభ్యులు చేసిన వ్యాఖ్యలను భారత్‌ తప్పుబట్టింది.

Advertisement
Advertisement