Politics
Rioting Must Stop Says SC: సుప్రీంకోర్టుకు చేరిన జామియా మరియు అలీగర్ విద్యార్థుల ఆందోళన, హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్ట్ సీరియస్, 'అల్లర్లు' ఆగితేనే విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించిన పిటిషన్లను విచారిస్తామన్న సీజేఐ
Vikas Mandaఅందరి హక్కులను మేము పరిగణలోకి తీసుకుంటాము కానీ ఇలాంటి హింసాత్మకమైన వాతావరణంలో కాదు, ఈ అల్లర్లు తగ్గితే సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంటాము, హక్కుల కోసం జరిగే శాంతియుత నిరసనలకు తాము వ్యతిరేకం కాదు" అని సీజేఐ అన్నారు. .....
Jharkhand Polls: జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికలు, బరిలో ప్రముఖులు, అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.25 కోట్లు,75 మంది అభ్యర్థులకు నేర చరిత్ర, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
Hazarath Reddyజార్ఖండ్ (Jharkhand)రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగో విడత పోలింగ్ ( Jharkhand Assembly Elections 2019 Phase 4) ప్రశాంతంగా జరుగుతోంది. 15 అసెంబ్లీ స్థానాలకు (15-assembly-seats) పోలింగ్ జరుగుతుండగా.. మొత్తం 221 మంది అభ్యర్థులు ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇందులో 23 మంది మహిళలు. మొత్తం 47 లక్షల 85 వేల 009 ఓటర్లున్నారు.
Unnao Rape Case: ఉన్నావ్ అత్యాచార కేసుపై తీర్పు నేడే, బీజేపీ ఎమ్మెల్యే భవితవ్యాన్ని తేల్చనున్న ఢిల్లీ కోర్టు, తీర్పు ఇవ్వనున్న జిల్లా జడ్జ్‌ ధర్మేష్‌ శర్మ, 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌‌లో అత్యాచార ఘటన
Hazarath Reddyదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు (Delhi's Tis Hazari Court) ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. యువతిని కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ఈ కేసులో(Unnao Rape Case) బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగర్‌ (former BJP MLA Kuldeep Singh Sengar) నిందితుడిగా ఉన్నారు.
AP Assembly Sessions Day-6: 3 లక్షల ఇళ్లకు రూ.2 వేల 626 కోట్ల దోపిడి, బాబుది మద్యం తాగించు పాలసీ, వైయస్ జగన్‌ది మద్యం మాన్పించు పాలసీ, రూ.8 వేలకు రూ.80 వేల అద్దె చెల్లిస్తున్నారు, హాట్ హాట్‌గా సాగుతున్న ఏపీ అసెంబ్లీ 6వ రోజు సమావేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు (AP Assembly Winter Sessions 2019 Day-6) హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌ (Reverse Tendering Scheme), మద్యం పాలసీల (Debate on alcohol bans)పైన వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఈ విషయం మీద మాటల యుద్ధం నడుస్తోంది.
Chandra Babu Naidu: అమరావతిని చంపేశారు, రాష్ట్రంలో తుగ్లక్, ఉన్మాది పాలన నడుస్తోంది, రివర్స్‌లో నడిచి నిరసన తెలిపిన చంద్రబాబు, నేడు అసెంబ్లీలో చర్చకు రానున్న 13 కీలక బిల్లులు, సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్
Hazarath Reddyరాష్ట్రంలో టెండర్లన్నీ రిజర్వు చేసుకుని రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అసత్యాలు చెబుతున్నారని వైసీపీ ప్రభుత్వం YCP GOVT)పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మండిపడ్డ విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీ (AP Assembly) నుంచి టీడీపీ (TDP)వాకౌట్ చేసింది. పేదల గృహ నిర్మాణంలో ప్రభుత్వం సరిగా సమాధానం లేదంటూ సభ నుంచి వాకౌట్ చేసింది.
JMI Standoff: దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం సెగలు, జామియా వర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకం, వర్శిటీలోకి ప్రవేశించి విద్యార్థులపై పోలీసుల దాడి, అరెస్ట్‌కు నిరసనగా విద్యార్థుల ఆందోళనలతో 50 మంది విద్యార్థులను విడుదల చేసిన పోలీసులు
Vikas Mandaఅయితే అనుమతి లేకుండానే పోలీసులు వర్శిటీలోకి ప్రవేశించి 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిరసనల్లో పాల్గొనని వారిపై కూడా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల చర్యను యూనివర్శిటీ వీసీ నజ్మా అఖ్తర్ ఖండించారు.
Biryani Seller: బిర్యాని అమ్మాడని చావబాదారు, కుల జాడ్యంలో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ నోయిడా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం
Hazarath Reddyప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా కుల జాడ్యం(Casteism) మాత్రం వీడటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మళ్లీ ఈ కుల జాడ్యం పడగవిప్పింది. అక్కడ ఓ దారుణం చోటు చేసుకుంది.దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్‌ నోయిడా(Greater Noida)లోని రబుపురాలో ఈ దాడి జరిగింది.
CAA Stir: రైల్వే స్టేషన్లకు నిప్పు, పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ బిల్లును నిరసిస్తూ మిన్నంటిన ఆందోళనలు, కఠిన చర్యలు తప్పవన్న మమతా బెనర్జీ, ఆందోళనకారుల ధాటికి పలు రైళ్లు రద్దు
Hazarath Reddyఅధికార పార్టీ బీజేపీ(BJP) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (amended Citizenship Act) కొన్ని రాష్ట్రాల్లో నిప్పు రాజేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఆందోళనలు హింసాత్మకరూపంగా మారుతున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో నిరసనలు మిన్నంటాయి.
BJP MP Car Attacked: బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి, క్షేమంగా బయటపడిన బరాక్ పూర్ ఎంపీ అర్జున్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే దాడికి పాల్పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyపశ్చిమబెంగాల్(West Bengal)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ బిల్లుకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీపై(BJP MP) దాడి జరగడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులను రాజేస్తోంది. బరాక్ పూర్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ (Barrackpore MP Arjun Singh) కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు. ఆ తర్వాత కారుకి సమీపంలో బాంబు విసిరారు.
Prashant Kishor: కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్, 2020లో ఆప్ విజయకోసం వ్యూహాలకు పదును, స్వాగతం పలికిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పని చేసిన చోటల్లా గెలుపు బావుటా ఎగురవేస్తున్న పీకే టీం
Hazarath Reddyప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఈ పేరు రాజకీయాల్లో తెలియని వారు ఉండరేమో.. 2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. మోడీ ప్రచారం కోసం అనేక వ్యూహాలు రచించి బీజేపీ(BJP) పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు.
Sanjay Raut Warns Ally Congress: వీర సావర్కర్ గురించి తక్కువగా మాట్లాడితే సహించేది లేదు, ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, గాంధీ, నెహ్రూలాగే సావర్కర్ కూడా మహనీయుడే అన్న శివసేన
Hazarath Reddyకాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) ‘రేప్ ఇన్ ఇండియా’ (Rape In India) వ్యాఖ్యలపై దేశంలో తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశాన్ని, మహిళల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ బీజేపీ (BJP) డిమాండ్ చేస్తోంది. మహిళలపై అకృత్యాల్ని పెంచేదిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ ఫైర్ అవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు.
PM Modi Falls Down At Ganga Ghat: ప్రధాని మోడీకి తప్పిన ప్రమాదం, గంగానది మెట్లు ఎక్కుతూ జారి పడిన ప్రధాని, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, గంగా అటల్ ఘాట్ వద్ద ఘటన
Hazarath Reddyకాన్పూర్ (Kanpur) పర్యటనలో ప్రధాని మోడీకి (PM Modi) పెను ప్రమాదం తప్పింది. గంగానది (Ganga River) మెట్లు ఎక్కుతూ ప్రధాని జారీ పడ్డారు. అటల్ ఘాట్ వద్ద ఒక అడుగు తప్పి మెట్లపై పడిపోయారు అదృష్టవశాత్తు ఆయనకు గాయాలేం కాలేదు. వెంట ఉన్న సెక్యూరిటీ త‌క్ష‌ణ‌మే ఆయన్ను పైకి లేపారు.
'Bharat Bachao' Rally: దేశం తగలబడిపోతోంది, అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు, ఇవేమి మోడీ-అమిత్‌షాలకు పట్టడం లేదు, ఇష్టమొచ్చినట్లుగా పాలన సాగిస్తున్నారు, భారత్ బచావో ర్యాలీలో సోనియా గాంధీ ఘాటు విమర్శలు
Hazarath Reddyపౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు(Modi-Shah) పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)ఘాటుగా విమర్శించారు.దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే నిదర్శనమని ఆమె తెలిపారు.
Narendra Modi: పవిత్ర గంగానదిలో ప్రధాని మోడీ బోటు షికారు, గంగానది ప్రక్షాళన కోసం నమామి గంగ ప్రాజెక్టు చేపట్టిన మోడీ సర్కారు, చంద్రశేఖర్ ఆజాద్‌కు నివాళి అర్పించిన భారత ప్రధాని
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని అటల్ ఘాట్(Atal ghat) వద్ద ప్రధాని వద్ద మోడీ సరదాగా షికారు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ(NDA) మిత్రపక్ష నేతలు మోడీ వెంట ఉన్నారు.
RGV vs Janasena Activists: వర్మను చంపేసిన జనసేన కార్యకర్తలు, దెయ్యమై మీ నేతను పట్టుకోవడానికి వస్తున్నా అంటున్న ఆర్జీవి, మీ మీద ఒట్టేసి చెబుతున్నా...ఆ ముగ్గురిని నేను ప్రేమిస్తున్నా, తనదైన స్టైల్లో కౌంటర్లు వేసిన రాంగోపాల్ వర్మ
Hazarath Reddyనిత్యం వివాదాలు, వరుస సినిమాలతో వార్తల్లో నిలిచే క్రేజీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(Ramgopal varma) జనసేన కార్యకర్తలకు తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు. ఈ మధ్య విడుదలైన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కొందరి నేతలను టార్గెట్ చేసినట్లుగా ఉందని ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు సైతం కొన్ని సీన్లను తీసివేసింది. అయితే ఈ సినిమాపై ఆగ్రహం చెందిన జనసేన కార్యకర్తలు వర్మను చంపేశారు.
'Bharat Bachao' Rally: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, రాహుల్ గాంధీ, రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై సారీ చెప్పే ప్రసక్తే లేదు, వాళ్లే క్షమాపణ చెప్పే రోజు వస్తుంది, భారత్ బచావో ర్యాలీలో బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Hazarath Reddyభారత్ బచావో ర్యాలీలో(Bharat Bachao Rally) కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు. బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. 'రేప్ ఇన్ ఇండియా (Rape in India) వ్యాఖ్యలపై నేను క్షమాపణ చెప్పాలని నిన్న పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది.
'Bharat Bachao' Rally: భారత్ బచావో ర్యాలీ, ప్రధాని మోడీపై సమరభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలకు భద్రత లేకుండా పోయింది, బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంకా గాంధీ వాద్రా, ఢిల్లీలో భారీ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు
Hazarath Reddyబీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ (Congress) పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీకి(Bharat Bachao Rally) వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఢిల్లీ(Delhi)లోని రామ్‌లీలా గ్రౌండ్స్‌( Ramlila Maidan) వేదికగా ఈ ర్యాలీ జరుగుతోంది. కాగా మోడీ (PM Modi) ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ భారత్ బచావో ర్యాలీకి పిలుపునిచ్చింది.
Supreme Court: 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు, ఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీస్, 349 లోక్‌సభ నియోజకవర్గాల్లో భారీ వ్యత్యాసం అంటూ పిటిషన్, దాఖలు చేసిన ఏడీఆర్‌,కామన్‌ కాజ్‌ స్వచ్ఛంద సంస్థలు
Hazarath Reddy2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (17th Lok Sabha Election)బీజేపీ(BJP) అఖండ మెజార్టీ సాధించి రెండో సారి అధికారం చేపట్టిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(Election Commission)కి నోటీసులు జారీ చేసింది.
Amaravathi Capital Change Issue: ఏపీ రాజధాని అమరావతే, రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రసక్తే లేదు, అసెంబ్లీలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ
Hazarath Reddyగత కొద్ది రోజులుగా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra pradesh Captial) అంశంపై జగన్ సర్కార్ (YS Jagan GOVT) క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతి (Amaravathi) ఉంటుందని దానిని ఎక్కడికి తరలించబోమని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతిని మారుస్తున్నారా ? అని మండలిలో టీడీపీ (TDP) సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యానారాయణ (Minister Botsa Satyanarayana) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
Arvind Kejriwal: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం,'బాలికలతో అసభ్యంగా ప్రవర్తించం', ప్రతి రోజూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలురతో ప్రతిజ్ఞ చేయించాలంటున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
Hazarath Reddyదేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi) ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు మానవత్వంతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.