Politics

Rahul Gandhi: వీడియో ఇదిగో, బార్బర్ షాపులో గడ్డం చేయించుకున్న రాహుల్ గాంధీ, రోజువారీ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు హైలెట్ చేసిన కాంగ్రెస్ నేత

Vikas M

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్టోబర్ 25, శుక్రవారం నాడు స్థానిక బార్బర్ షాప్‌లో తన గడ్డం చేయించుకుంటూ భారతదేశంలోని పేద మరియు మధ్యతరగతి ప్రజల దుస్థితిని నొక్కి చెబుతూ ఒక పదునైన సందేశాన్ని పంచుకున్నారు. X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసిన వీడియోలో, అతను స్థానిక మంగలి అజిత్‌ను ఉటంకిస్తూ, “కుచ్ నహీ బచ్తా హై!”,అంటూ రోజువారీ కార్మికులు ఎదుర్కొంటున్నకష్టాలను హైలైట్ చేశాడు.

Rachamallu on Sharmila: జగన్‌ తన చెల్లిపై ప్రేమతోనే ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పొద్దుటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్‌ తన చెల్లిపై ప్రేమతో ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారన్నారు.

TDP vs Janasena: వీడియో ఇదిగో, కోమాలోకి పోయిన టీడీపీ పార్టీని బతికించింది జనసేన పార్టీ, గుర్తు పెట్టుకోవాలంటూ టీడీపీకి జనసేన నేతలు మాస్ వార్నింగ్

Hazarath Reddy

చింతలపూడిలో టీడీపీ-జనసేన పార్టీలో ముసలం పుట్టింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపించిన టీడీపీని తామే ఓడిస్తామంటూ మాజీ డీసీసీబి చైర్మన్ కరాటం రాంబాబు హెచ్చరించారు.

Union Cabinet Meeting Highlights: అమరావతికి హైదరాబాద్, చెన్నై, కోల్ కతాతో కనెక్టివిటీ, రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, కేంద్ర కేబినెట్ మీటింగ్ పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) మొత్తం రూ.6,798 కోట్ల అంచనా వ్యయంతో (సుమారుగా) రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

Advertisement

YS Jagan Slams AP Govt: డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన జగన్, అక్రమాలు బయటపెడుతున్నందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపాటు

Hazarath Reddy

చంద్రబాబు కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని మండిపడ్డారు వైఎస్‌ జగన్‌. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్‌ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

APPSC New Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్‏గా మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

చంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీ ఛైర్మన్‏ను బుధవారం నియమించింది. మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో అనురాధను నియమిస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు

Guntur Nurse Murder Case: జగన్‌కు ఇంకా తగ్గని క్రేజ్, వైసీపీ అధినేత వస్తున్నాడని జనసంద్రమైన గుంటూరు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రౌడీషీటర్‌ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబస­భ్యులను పరామర్శిందుకు వైఎస్‌ జగన్‌ జీజీహెచ్‌కు వెళ్లారు. వైఎస్‌ జగన్‌ జీజీహెచ్‌కు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

Andhra Pradesh: వచ్చేది మన ప్రభుత్వమే, నిందితులను వెంటాడి జైల్లో పెడతాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో మహిళల భద్రతలను కూటమి నేతలు ప్రశ్నార్థకంగా మార్చేశారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. అన్ని వర్గాల మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Jagan Slams Nara Lokesh: దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా? నారా లోకేష్‌ని పప్పు అనడంలో తప్పే లేదంటూ మండిపడిన జగన్

Hazarath Reddy

రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్‌ను పప్పు అనడంలో అసలు తప్పే లేదన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా దిశా చట్టం, ప్రతులను కాల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని దారుణాలు జరుగుతున్నా పవన్‌ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదన్నారు.

Priyanka Gandhi: వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ, హాజరైన సోనియా - రాహుల్ గాంధీ...భారీగా తరలివచ్చిన ప్రజలు

Arun Charagonda

కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రియాంక గాంధీ. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలిరాగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఆ తర్వాత రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రిజైన్ చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

KTR on Ganga Reddy Murder Case: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంటున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. జగిత్యాలలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.

Ganga Reddy Murder Case: నీకో దండం నీ పార్టీకో దండం, కాంగ్రెస్ పార్టీపై మండిపడిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలకే భరోసా లేదని ఆవేదన

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

Advertisement

TMC Leader Kalyan Banerjee: వ‌క్ఫ్ బిల్లుపై టీఎంసీ, బీజేపీ ఎంపీల మ‌ధ్య వాగ్వాదం, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ చేతికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఈ రోజు వ‌క్ఫ్ బిల్లుపై దేశ రాజధాని ఢిల్లీలో సంయుక్త పార్ల‌మెంట‌రీ సంఘం మీటింగ్ జ‌రిగింది. బీజేపీ ఎంపీ జ‌గ‌దాంబికా పాల్ నేతృత్వంలో జేపీసీ మీటింగ్ జ‌రిగింది.రిటైర్డ్ జ‌డ్జీలు, లాయ‌ర్లు ప్యాన‌ల్ ఇచ్చిన అభిప్రాయాల‌ను ఆ స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ(TMC MP Kalyan Banerjee) గాయ‌ప‌డ్డారు.

Bihar: పోలీస్‌ నియామకాలు త్వరగా చేపట్టండి, డీజేపీకి చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం నితీష్ కుమార్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) పోలీస్‌ రిక్రూమ్‌మెంట్‌ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Kashmir Will Never Become Pakistan: కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారబోదు,టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించిన ఫరూక్ అబ్దుల్లా

Hazarath Reddy

జమ్మూకశ్మీర్ లోని Ganderbalలో జరిగిన టెర్రరిస్టుల దాడిలో ఒక డాక్టర్ తో పాటు ఆరుగురు నిర్మాణ రంగ కార్మికులు చనిపోయారు. ఈ ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ నేతలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు

Navya Haridas: వయనాడ్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక వాద్రాతో తలపడనున్న నవ్య హరిదాస్

Arun Charagonda

వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌ని ప్రకటించింది బీజేపీ. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోరాఉ నవ్య. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2007లో బీటెక్ పూర్తి చేసి మెకానికల్ ఇంజనీర్ గా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు.

Advertisement

Chandrababu Slam Jagan: మోదీ నుంచి మనం చాలా నేర్చుకోవాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని వెల్లడి

Hazarath Reddy

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు.

Jagan Slams Chandrababu: 5 నెలలు దాటినా సూపర్ సిక్స్ లేదు, దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే చంద్రబాబు పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఏపీలో ఇసుక పాలసీపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ శుక్రవారం మాట్లాడారు. చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత ధ్వజమెత్తారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్న చందంగా మారిందని మండిపడ్డారు.

Case Against Harish Rao Relatives: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావు బంధువులపై పోలీసు కేసు నమోదు.. ఎందుకంటే??

Rudra

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు బంధువులపై పోలీసు కేసు నమోదైంది. తన ఐదంతస్తుల భవనంలో హరీశ్‌ రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్‌ కుమార్‌ గౌడ్, గారపడి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు అనే వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Sajjala Ramakrishna Reddy: టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను, మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

టీడీపీ కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Advertisement
Advertisement