Politics

Delhi CM Rekha Gupta Oath: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే

Arun Charagonda

ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేఖా గుప్తా . మధ్యాహ్నం 12:35కి రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం జరగనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.

Telangana Assembly Sessions: మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు..5 రోజుల పాటు జరిగే అవకాశం, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనున్న ప్రభుత్వం!

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది(Telangana Assembly Sessions). 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉండగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనుంది ప్రభుత్వం.

Yogi Adityanath On 'Mohammed Shami': మొహమ్మద్ షమీ త్రివేణి సంగమంలో పవిత్రస్నానం చేశారని తెలిపిన సీఎం యోగీ, క్రికెటర్ పేరు కూడా మార్చారా? అంటూ అఖిలేష్ యాదవ్ సైటైర్లు. వీడియో ఇదిగో..

Hazarath Reddy

యూపీ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ మహా కుంభమేళాలో ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు కౌంటర్ విసిరాయి. క్రికెటర్‌ పేరును కూడా యోగి ఆదిత్యనాథ్‌ మార్చినట్లు అఖిలేష్ యాదవ్ విమర్శించారు

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Hazarath Reddy

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను ప్రకటించింది, ఇది 27 సంవత్సరాల తర్వాత రాజధానిలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడాన్ని సూచిస్తుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె షాలిమార్ బాగ్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి బందన కుమారిని 29,595 ఓట్ల తేడాతో ఓడించి, ఆ ప్రాంతంలో ఆప్ దశాబ్ద కాలంగా ఉన్న ఆధిపత్యాన్ని ముగించారు

Advertisement

Rekha Gupta: ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే ముఖ్యమంత్రి పదవి, జాక్ పాట్ కొట్టేసిన రేఖా గుప్తా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి విక్టరీ

Hazarath Reddy

ముఖ్యమంత్రిగా పలువురి పేర్లు వినిపించినప్పటికీ సామాజిక సమీకరణల మధ్య బినోయ్‌ సామాజిక వర్గానికి చెందిన రేఖ గుప్తాను బీజేపీ పెద్దలు సీఎంగా ప్రకటించారు. రేఖాగుప్తా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం గెలుపొందారు. రేఖాగుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

Rekha Gupta To be Next Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన శాసనసభాపక్షం సమావేశంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎల్పీ లీడర్‌గా ఆమెను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆమె గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Komatireddy Venkatreddy: రాజకీయాల్లో కేటీఆర్‌ బచ్చా..ఓడిపోయాకే కవితకు దురాజ్ పల్లి గుర్తొచ్చిందా?, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్,వారిద్దరూ లెక్కలోకే రారని ఫైర్

Arun Charagonda

రాజకీయాల్లో కేటీఆర్ బచ్చా గాడు అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి . ఓడిపోయాకే కల్వకుంట్ల కవితకు దురాజ్ పల్లి గుర్తొచ్చిందా? చెప్పాలన్నారు.

Atchannaidu Slams Jagan: జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పచ్చి అబద్దాలు చెబుతున్నారు, మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు

Hazarath Reddy

మాజీ సీఎం జగన్‌ మిర్చి యార్డు వద్ద చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు

Advertisement

Bandi Sanjay Slams Congress: అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Hazarath Reddy

రంజాన్‌ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు గంటపాటు వెసులుబాటు ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బీజేపీ మండిపడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? అంటూ సంచలన వ్యాఖ్యలు (Bandi Sanjay Slams Congress) చేశారు.

Congress Meeting In Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశం.. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Arun Charagonda

ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశం జరుగుతోంది. ఇందిరా భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.

Jagan on Police Security Negligence: వీడియో ఇదిగో, రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీకు పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో, చంద్రబాబుకు జగన్ వార్నింగ్

Hazarath Reddy

ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?.

Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు

Hazarath Reddy

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

YS Jagan Support Mirchi Farmers: వీడియో ఇదిగో, గుంటూరు మిర్చి యార్డు రైతులతో మాట్లాడిన జగన్, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరిక

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

MP Kiran Kumar Reddy: బీజేపీ ఎంపీ డీకే అరుణకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, రేషన్ కార్డులలో మోదీ పోటో పెట్టాలంటే ఆ పని చేయాలని డిమాండ్

Arun Charagonda

బీజేపీ ఎంపీ డీకే అరుణకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు . రేషన్ కార్డులలో మోదీ ఫోటో పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న 90 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వాలన్నారు.

Kodali Nani on Vamsi Arrest: చచ్చేదాకా జగన్ వెంటే నడుస్తా, ఆ పకోడి గాళ్ళకు నేను భయపడను, పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేష్ బెదిరించి అతని చేత కేసు రీ ఓపెన్ చేయించారని మండిపడ్డారు. ఇలాంటి పకోడి గాళ్ళకు నేను భయపడేది లేదని స్పష్టం చేశారు. చచ్చేదాకా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు.

Gyanesh Kumar: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌గా జ్ఞానేష్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌ జోషి, జ్ఞానేష్‌కుమార్‌ పూర్తి బయోడేటా ఇదే..

Hazarath Reddy

ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌.. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా.. ప్రస్తుతం హరియాణా సీఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్‌ జోషి (1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి) నియమితులయ్యారు

Advertisement

Tuni Municipal Vice-Chairman Election: తుని మున్సిపల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ ఎన్నిక నాలుగోసారి వాయిదా, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై దాడి వీడియోలు వైరల్

Hazarath Reddy

తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక (Tuni Municipal Vice Chairman Election) మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో నాలుగోసారి ఎన్నికను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికను రద్దు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు.

YS Jagan on Vamsi Arrest: పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి, వల్లభనేని వంశీ అరెస్ట్ అంతా ఓ కుట్ర అంటూ మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్.... విమానాశ్రయం నుంచి జైలుకు వెళ్లి ములాఖత్ ద్వారా వంశీని కలిసి పరామర్శించారు.

YS Jagan Press Meet: వీడియో ఇదిగో, అధికారంలోకి వచ్చాక అందరి బట్టలు ఊడదీసి కొడతాం, కూటమికి వత్తాసు పలికే అధికారులకు వైఎస్ జగన్ మాస్ వార్నింగ్

Hazarath Reddy

వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్‌ చెప్పారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు

Kodali Nani: వీడియో ఇదిగో, మీడియాకి కొడాలి నాని సైటైర్, అప్పుడు అంటే గవర్నమెంట్ లో ఉన్నాము యాక్టివ్‌గా ఉన్నాము. మా ఉద్యోగం పీకేశారు యాక్టివ్‌గా ఇప్పుడు ఏం చేయాలని ప్రశ్న

Hazarath Reddy

తాజాగా మీడియా కి కొడాలి నాని సెటైరికల్ సమాధానాలు ఇచ్చారు. అప్పుడు అంటే గవర్నమెంట్ లో ఉన్నాము యాక్టివ్‌గా ఉన్నాము. మా ఉద్యోగం పీకేశారు యాక్టివ్‌గా ఇప్పుడు ఏం చేయాలని కొడాలి నాని అన్నారు.

Advertisement
Advertisement