Viral
Robbery Caught on Camera: దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
Hazarath Reddyపటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిపోయారు. రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వచ్చి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు, సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Suicide Attempt Caught on Camera: వీడియో ఇదిగో, అటల్ సేతు వంతెన పైనుంచి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్, ఆర్థిక ఇబ్బందులే కారణం..
Hazarath Reddyఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒత్తిడికి లోనైన 38 ఏళ్ల ఇంజనీర్ బుధవారం మధ్యాహ్నం ముంబైలోని అటల్ సేతు ట్రాన్స్‌హౌబర్ వంతెనపై నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం వెతుకులాట కొనసాగుతోందని సాయంత్రం ఓ అధికారి తెలిపారు.
Sleep Divorce: షాకింగ్...కొత్త ట్రెండ్, ప్రశాంతమైన నిద్ర 'గుడ్ నైట్' కోసం 'విడాకులు', ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం!
Arun Charagondaతాజాగా ప్రశాంతమైన నిద్ర కోసం విడాకులు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈ విడాకులతో భయపడాల్సిన పనేమిలేదు. ఎందుకంటే ఈ చర్య వల్ల దంపతుల మధ్య బంధం మరింత బలపడుతుందని వెల్లడైంది. ఎందుకంటే సాధారణంగా భార్యాభర్తలు ఒకే రూమ్‌లో ఒక బెడ్‌పై కలిసి నిద్రపోతారు.
World's Most Powerful Passports 2024: అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్‌దే అగ్రస్థానం, 8వ స్థానానికి పడిపోయిన అమెరికా, 82వ స్థానంలో భారత పాస్‌పోర్ట్
Vikas Mప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల(Most Powerful Passports) జాబితాను హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ర్యాంక్‌లను రూపొందించారు.అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో ఉన్నది. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 195 దేశాల్లో వీసా లేకుండానే ఎంట్రీ ఇవ్వవచ్చు.
Kapil Dev Emotional Video: నువ్వో పోరాట యోధుడివి, ధైర్యంగా ఉండు, క్యాన్సర్‌తో పోరాడుతున్న అంశుమన్ గైక్వాడ్‌పై కపిల్‌దేవ్ ఎమోషనల్ పోస్టు ఇదిగో..
Vikas Mటీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ అంశుమన్ గైక్వాడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి విదితమే. అతడు త్వరగా కోలుకోవాలని మాజీ దిగ్గజం కపిల్‌దేవ్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. మైదానంలో ఆడిన రోజులను గుర్తు చేసుకుంటూ కపిల్ దేవ్ వీడియో ఎమోషనల్ వీడియో సందేశం పెట్టాడు
Jayasuriya Disciplines Sri Lanka Cricketers: జుట్టు కత్తిరించుకుని నీట్‌గా ఉండండి, శ్రీలంక క్రికెటర్లకు జయసూర్య క్రమశిక్షణ క్లాసులు
Vikas Mశ్రీలంక క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్, బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య శ్రీలంక క్రికెటర్లకు క్లాస్ తీసుకున్నాడు. క్రికెట్ అనేది జెంటిల్మన్ క్రీడ అని, యువ ఆటగాళ్లకు క్రమశిక్షణ అవసరమని జయసూర్య అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లందరూ జుట్టు కత్తిరించుకుని, సాధారణ హెయిర్ స్టయిల్ ను అనుసరించాలని సూచించాడు.
Fake Facebook Accounts: 63 వేల నైజీరియన్ల ఖాతాలను తొలగించిన ఫేస్‌బుక్, న్యూడ్ ఫోటోలతో వీరంతా సెక్స్ స్కాంకు పాల్పడుతున్నట్లు గుర్తించిన మెటా
Vikas Mఆర్థిక దోపిడీ మోసాలకు పాల్పడుతున్న వేలాది నైజీరియన్ ఫేస్‌బుక్ ఖాతాలను మెటా తొలగించింది. మార్క్ జుకర్‌బర్గ్ నడుపుతున్న మెటా, కొత్త స్కామర్‌లను రిక్రూట్ చేయడంతో సహా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన ఫేస్‌బుక్ నుండి స్కామర్‌ల యొక్క 63,000 ఖాతాలను తొలగించింది.
‘Spiderman’ Fined in Delhi: ఢిల్లీలో స్పైడర్ మ్యాన్’ అరెస్ట్, కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేసినందుకు భారీగా ఫైన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రమాదకర స్టంట్‌తో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. స్పైడర్ మ్యాన్ వేషం ధరించిన ఆదిత్య అనే వ్యక్తి కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేశాడు.ద్వారక ప్రాంతంలో గౌరవ్ సింగ్ (19) డ్రైవింగ్ చేస్తుండగా అతను ఈ స్టంట్లు చేశాడు. దీనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో అనేక మంది ఫిర్యాదు చేశారు.
Viral Video: వీడియో ఇదిగో, కిటికీ నుండి బస్సు ఎక్కుతూ అద్దంతో సహా ఊడి కింద పడిన యువకుడు
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు బస్సు కిటికీ నుండి ఎక్కుదామని ప్రయత్నించి కింద పడ్డాడు. బస్సు కిటికీలోనుంచి లోపలకి ఎక్కుతుండగా బస్సు అద్దంతో సహా ఊడి కింద పడిపోయాడు ఆ యువకుడు. పక్క బస్సులో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలుస్తోంది.
Hyderabad Shocker: దారుణం, సుత్తితో సూపర్‌వైజర్ తలపై మోది దారుణ హత్య, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని సుత్తితో తలపై మోది హత్య చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజి ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ ( 44) నగరానికి వలసవచ్చి పెయింటింగ్ కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Murder Caught on Camera: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద జిమ్ ఓనర్‌ని 21 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రత్యర్థి
Hazarath Reddyఢిల్లీలో 28 ఏళ్ల జిమ్ యజమాని సుమిత్ చౌదరి అలియాస్ ప్రేమ్‌ను దారుణంగా హత్య చేసిన దృశ్యం సిసిటివి ఫుటేజీలో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జూలై 10న భజన్‌పురాలోని గమ్రీ ఎక్స్‌టెన్షన్‌లోని అతని ఇంటి వెలుపల జరిగింది.
Madhya Pradesh Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, మలవిసర్జన చేస్తుండగా యువకుడిని మింగేయబోయిన కొండ చిలువ, ఒక్కసారిగా కేకలు వేసిన బాధితుడు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ గ్రామస్థుడు సోమవారం మలవిసర్జన కోసం అడవికి వెళ్లిన సమయంలో 13 అడుగుల కొండచిలువ దాడి చేసింది. కొండచిలువ తన తోకను ఆ వ్యక్తి మెడకు చుట్టి మింగేందుకు ప్రయత్నించింది
Tax Benefits: బిగ్ కన్ఫ్యూజన్, పాత పన్ను విధానం? కొత్త పన్ను విధానం...ఏది బెటర్? ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే?
Arun Charagondaవరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇక మోడీ కేబినెట్‌లో మూడోసారి చోటు దక్కించుకుని అరుదైన ఘనతను నిర్మలా సొంతం చేసుకున్నారు. ఇక బడ్జెట్ అనగానే అందరి కళ్లు ఉండేది ఐటీ రిటర్న్స్ అదే ట్యాక్స్ విధానంపైనే. ఎప్పుడెప్పుడు ట్యాక్స్‌పై కేంద్రమంత్రి ప్రకటన చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు.
108 Names of Lord Ganesha: వినాయకుని ఈ 108 నామ మంత్రాల గురించి మీకు తెలుసా ? గణేశుడి 108 పేర్లు గురించి తప్పనిసరిగా తెలుసుకోండి
Vikas Mమత విశ్వాసాల ప్రకారం, ప్రతిరోజూ వినాయకుడిని పూజించే వ్యక్తి ఆనందం, శ్రేయస్సు మరియు సంపదను పొందుతాడు. విద్యార్థులు వినాయకుడిని పూజించడం ద్వారా విశేష ప్రయోజనాలు పొందుతారని నమ్ముతారు.
Maruti Grand Vitara: అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ సేల్స్
Vikas M2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా..కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది.
Bajaj Chetak Electric Scooter: అమ్మకాల్లో దుమ్మురేపిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఏడాదిలో రికార్డు స్థాయిలో 2 లక్షల యూనిట్ల అమ్మకాలు
Vikas Mబజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్‌లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్‌వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా భారీ ఫైల్స్‌ను షేర్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం
Vikas Mమెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ సహాయంతో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే భారీ ఫైల్స్‌ను షేర్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉండనుంది.
Amy Jones – Piepa Cleary Engagement: పెళ్లికి రెడీ అంటున్న ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు, ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్
Vikas Mప్రపంచ క్రికెట్‌లో మరో ప్రేమ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్ (Amy Jones) తన గర్ల్‌ఫ్రెండ్ ఆస్ట్రేలియా మాజీ పేసర్ పీపా క్లియరీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ క్రికెట్ జోడీ తమ అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Kanguva 'Fire' Song: సూర్య కంగువా మూవీ నుంచి ఫైర్ సాంగ్ వచ్చేసింది, అక్టోబర్ 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల
Vikas Mసూర్య తాజా చిత్రం కంగువ నుంచి సాంగ్ విడుదలైంది. సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి 'ఫైర్ సాంగ్'ను రిలీజ్ చేశారు. 'ఆది జ్వాలా .. అనంత జ్వాలా' అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.
Mumbai: వీడియో ఇదిగో, రైలులో ట్రాన్స్‌జెండర్లు సరికొత్త దందా, UPI ద్వారా డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్, వీడియోపై రైల్వే శాఖ స్పందన ఏమిటంటే..
Vikas Mముంబై లోకల్ ట్రైన్‌లో క్యూఆర్ స్కానర్‌ని ఉపయోగించి ట్రాన్స్‌జెండర్ వ్యక్తి డబ్బును స్వీకరించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ట్రాన్స్‌పర్సన్ UPI ద్వారా రైలులో అందర్నీ డబ్బులు అడుగుతున్న వీడియోని @mumbairailusers అనే X హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది. వీడియోలో లింగమార్పిడి బిచ్చగాడు డబ్బులు అడుగుతున్నాడని వెల్లడించింది