Viral

Delhi Petrol Pump Loot Video: వీడియో ఇదిగో, తుఫాకీ చూపించి పెట్రోల్ పంపులో దొంగతనం, అర డజను మంది ఒక్కసారిగా ఉద్యోగిపై పడి..

Hazarath Reddy

న్యూఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ముసుగు ధరించిన దుండగులు పెట్రోల్‌ పంపులో తుపాకీతో డబ్బులు దోచుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు నిర్ధారించిన సీసీటీవీ ఫుటేజీలో దాదాపు అరడజను మంది దుండగులు ఈ నేరానికి పాల్పడ్డారు.

Cobra on Auto-Rickshaw: ఆటోవెనుకనే వచ్చిన నాగు పాము వీడియో ఇదిగో, బుసలు కొడుతూ డ్రైవర్ మీదకు రావడంతో ఆటో వదలి పరార్

Hazarath Reddy

బద్లాపూర్‌లోని టికెట్‌ కౌంటర్‌ సమీపంలోని రిక్షా స్టాండ్‌లో నాగుపాము కనిపించింది. దీంతో కొంత సేపు ఆటో డ్రైవర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటో రిక్షా వెనుక ఓ నాగుపాము ఉండగా.. స్థానికులు ఈ ఘటనను వీడియో తీశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

Delhi Fire Video : ఢిల్లీలో షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం, సంఘటనా స్థలంలో 30కిపైగా ఫైర్‌టెండర్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో 30కిపైగా ఫైర్‌టెండర్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు

HC on Paternity: సొంత బిడ్డకు తండ్రిని కాదనడాన్ని మించిన క్రూరత్వం మరొకటి ఉండదు, భార్యాభర్తల విడాకుల కేసులో కీలక వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు

Hazarath Reddy

సొంత బిడ్డకు పితృత్వాన్ని నిరాకరించడం కంటే క్రూరమైనది మరొకటి లేదని, పదేళ్లకు పైగా విడివిడిగా నివసిస్తున్న జంటకు విడాకులు మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది.

Advertisement

Heart Touching Video: హృదయాన్ని హత్తుకునే వీడియో ఇదిగో, స్వర్ణ పతకం గెలిచిన కూతురును ఎయిర్ పోర్టులో చూడగానే భావోద్వేగానికి గురైన తండ్రి

Hazarath Reddy

ఏషియన్ గేమ్స్ లో స్వర్ణ పతకం సాధించిన కబడ్డీ క్రీడాకారిణి స్నేహల్ షిండేను.. ఆమె తండ్రి ప్రదీప్ షిండే పూణె విమానాశ్రయంలో కుటుంబ సభ్యులతో కలిసి రిసీవ్ చేసుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. కూతురును చూడగానే ఒక్కసారిగా గుండెలకు హత్తుకుని కంటతడి పెట్టారు.

Rohit Sharma Breaks Sachin Record: సచిన్‌ సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ, కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే అరుదైన ఘనత సాధించిన టీమిండియా కెప్టెన్

Hazarath Reddy

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత సారథి రోహిత్‌ శర్మ.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.24 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్‌ 6 ప్రపంచకప్‌లు ఆడి.. ఆరు శతకాలు తన పేరిట లిఖించుకోగా.. రోహిత్‌ కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు బద్దలు కొట్టి అగ్రస్థానానికి చేరాడు.

World Cup 2023 : వీడియో ఇదిగో, నవీన్-ఉల్-హక్‌ను ఎగతాళి చేయడం మానేయండి, అభిమానులకు కోహ్లీ రిక్వెస్ట్, ఇద్దరూ కరచాలనం చేస్తూ నవ్వులు చిందిస్తున్న క్లిప్ ఇదిగో..

Hazarath Reddy

భారత బ్యాటర్ విరాట్ కోహ్లి ముందుకొచ్చి, నవీన్-ఉల్-హక్‌ను ఎగతాళి చేయడం మానేయాలని ప్రేక్షకులను అభ్యర్థించాడు. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ సందర్భంగా, ప్రేక్షకులు ఏ అవకాశం దొరికినా 'కోహ్లీ, కోహ్లీ' అని నినాదాలు చేస్తూ నవీన్‌ను ఎగతాళి చేయడం కనిపించింది

Hashmatullah Shahidi: ఆఫ్గానిస్తాన్‌ నుంచి వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు, సరికొత్త రికార్డు సృష్టించిన కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ 

Hazarath Reddy

ఆఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆఫ్గాన్‌ క్రికెటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో​ భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన హష్మతుల్లా షాహిదీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

Advertisement

World Cup 2023: నవీన్ ఉల్ హక్‌ రనౌట్‌ మిస్ వీడియో ఇదిగో, టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌పై సీరియస్ అయిన విరాట్‌ కోహ్లి

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌-ఆఫ్గానిస్తాన్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌పై స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి సీరియస్‌ అయ్యాడు.

Most Sixes in International Cricket: క్రిస్‌ గేల్‌ అత్యధిక సిక్స్‌లు రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ, అంతర్జాతీయ క్రికెట్‌లో 554 సిక్స్‌లు బాదిన టీమిండియా కెప్టెన్

Hazarath Reddy

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ ఈ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన నవీన్‌ ఉల్‌ బౌలింగ్‌లో ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Mahesh Babu Latest Pic: లైకులతో పిచ్చెక్కిస్తున్న మహేశ్ ‌బాబు లేటెస్ట్ సూటు పిక్, సూట్ చెక్ ట్వీట్ చేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

Israel-Palestine War: ఇజ్రాయెల్‌‌పై మూడు దేశాలు ముప్పేట దాడి, హమాస్‌కు తోడైన లెబనాన్ సిరియా దేశాలు, హమాస్ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ సైన్యం

Hazarath Reddy

ఇజ్రాయెల్‌ మూడు దేశాల నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది. పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ దాడులు చేస్తుండగా మరోవైపు లెబనాన్‌, సిరియా నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి.

Advertisement

Maharashtra Shocker: విమానంలో మహిళ ముందే ఫ్యాంట్ జిప్పు విప్పి హస్త ప్రయోగం, ఆమె అది చూడటం లేదని ఏం చేశాడో తెలుసా..చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

మహారాష్ట్రలో ప్రైవేటు ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ విమానంలో ఓ ప్రయాణికుడు సాటి ప్రయాణికురాలిపై వేధింపులకు పాల్పడ్డాడు. నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ ప్రయాణికుడు తన పక్కన కూర్చున్న మహిళా ప్రయాణికురాలి ఎదుట హస్త ప్రయోగం చేసుకున్నాడు.

Students Fight Video: వీడియోలు ఇవిగో, అమలాపురంఎస్‌కేబీఆర్‌ కాలేజీలో తన్నుకున్న బీఏ, బీకామ్‌ విద్యార్థులు

Hazarath Reddy

BR అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కళాశాల విద్యార్థుల రెండు గ్రూపులు రోడ్డుపై దారుణంగా ఘర్షణకు దిగారు. అమలాపురంలో చిన్నపాటి వివాదంపై ఎస్‌కేబీఆర్‌ కళాశాల బీఏ, బీకామ్‌ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీడియో ఇదిగో..

ICC World Cup 2023: నవీన్-ఉల్-హక్ vs విరాట్ కోహ్లీ, రసవత్తరంగా మారిన మ్యాచ్, అందరి కళ్లు వారిద్దరూ ఎదురుపడటం దాని పైనే..

Hazarath Reddy

2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడుతోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ అటాక్‌కు, భారత్ బ్యాటింగ్ పరాక్రమానికి మధ్య మ్యాచ్ జరగనుంది.

PKL Auction 2023: ప్రో కబడ్డీ లీగ్ వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి లిస్ట్ ఇదిగో, రూ. 2.6 కోట్లకు పవన్ కుమార్ సెహ్రావత్‌ను దక్కించుకున్న తెలుగు టైటాన్స్‌

Hazarath Reddy

అక్టోబర్ 10, మంగళవారం నాడు ప్రో కబడ్డీ లీగ్ (PKL) వేలం 2023 యొక్క 2వ రోజు తర్వాత వేలం ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు డిసెంబర్ 2న ప్రారంభమయ్యే PKL యొక్క 10వ సీజన్‌లో యాక్షన్ పార్ట్‌లోకి వెళుతుంది.

Advertisement

Delhi Horror: దారుణమైన వీడియో ఇదిగో, కారుతో 200 మీటర్ల దూరం ఓ వ్యక్తిని ఈడ్చుకువెళ్లిన డ్రైవర్, చికిత్స పొందుతూ బాధితుడు మృతి

Hazarath Reddy

ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో ఓ వ్యక్తిని..కారు డ్రైవర్ తన కారుతో దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కెమెరాలో చిక్కుకోగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నివేదికల ప్రకారం, లాగబడిన వ్యక్తి క్యాబ్ యజమాని, డ్రైవర్.

Terrorist Rashid Latif Shot Dead: పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి రషీద్ లతీఫ్ దారుణ హత్య, సియాల్‌కోట్‌లో కాల్చి చంపిన గుర్తు తెలియని దుండగులు

Hazarath Reddy

పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రషీత్ లతీఫ్ హత్యకు గురైన వార్త వెలుగులోకి వచ్చింది. ఆధారాల ప్రకారం పాకిస్థాన్‌లో ఉగ్రవాది రషీత్ లతీఫ్ హత్యకు గురయ్యాడు. సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపినట్లు సమాచారం

Daughters Increase Longevity of Fathers: కొడుకులకు ఇది నిజంగా చేదు వార్తే, ఆడపిల్ల ఉంటే తండ్రి ఆయుష్షు ఇంకో ఆరేళ్ళు పెరుగుతుందని తేల్చి చెప్పిన సరికొత్త అధ్యయనం

Hazarath Reddy

ఆడపిల్ల పుట్టిందంటే అయ్యకు ఆయువు సగం పోయినట్లేననే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆడపిల్ల ఉన్న ఇంట్లో తండ్రి ఆయువు పెరుగుతున్నదని (Daughters Increase Longevity of Fathers) తాజా అధ్యయనంలో వెల్లడైంది.

'Hamas-like attack' on India: వీడియో ఇదిగో, భారత్‌పై ‘హమాస్‌’ తరహా దాడి చేస్తామంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది పన్నున్‌ బెదిరింపు, హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడి

Hazarath Reddy

భారత్‌పై ‘హమాస్‌’ తరహా దాడి చేపడతామంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) చీఫ్‌ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ బెదిరింపులకు దిగాడు. ‘పంజాబ్‌పై భారత్‌ ఆక్రమణకు పాల్పడితే, తగిన విధంగా స్పందిస్తాం. హమాస్‌ తరహా దాడికి పాల్పడతాం’ అంటూ ఆన్‌లైన్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు

Advertisement
Advertisement