వైరల్
Telangana Floods: అర్థరాత్రి గ్రామాన్ని ముంచెత్తిన వరద, 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, జలదిగ్భంధంలో చిక్కుకుపోయిన మోరంచపల్లి గ్రామం, రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మోరంచపల్లి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఇళ్లు, భవనాలు మునిగిపోవడంతో మేడలపైకి వెళ్లి.. వర్షాల్లో తడుస్తూ మమ్మల్ని కాపాడండి ప్లీజ్ అంటూ.. సెల్ఫీవీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి
Mulugu District Shocker: ములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది టూరిస్టులు..
kanhaములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది పర్యాటకులు.
Yeh Modi ki Guarantee Hai: నా 3వ టర్మ్‌లో భారత్‌ను ప్రపంచంలోనే మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుపుతా, యే మోడీ కి గ్యారెంటీ హై అని తెలిపిన ప్రధాని
Hazarath Reddyతన మూడో టర్మ్‌లో భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం హామీ ఇచ్చారు. 2024 తర్వాత ఎన్‌డిఎ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వేగం చాలా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా అని ప్రధాని మోదీ అన్నారు.
Telangana: రూ. 28 లక్షల క్యాష్ బ్యాగ్ బస్సులో పెట్టి టిఫెన్ కోసం దిగిన ప్రయాణికుడు, తీరా వచ్చి చూసేసరికి షాక్, లబోదిబోమంటూ స్టేషన్‌కి పరుగులు
Hazarath Reddyనల్గొండ జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. టిఫిన్ చేద్దామని బస్సు దిగిన ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను దొంగలు కొట్టేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు బాధితుడు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆరెంజ్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు నార్కెట్ పల్లిలో టిఫిన్ కోసం ఆగడంతో ఆయన బస్సు దిగారు.
Andhra Pradesh Rains: భారీ వర్షాలకు విశాఖలో ఇళ్లలోకి చేరిన వరద నీరు, పూర్తిగా నీట మునిగిన జ్ఞానాపురం, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారగా మరికాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.
Andhra Pradesh: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ. 20 వేలు కాదు రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా, క్లారిటీ ఇచ్చిన ఏపీ రవాణా శాఖ కమిషనర్
Hazarath Reddyమోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్‌‌ ఫోన్‌ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. పదేపదే ఇదే నేరం చేస్తే రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు.
Peacock Dance Video: నెమలి డ్యాన్స్ వేయడం మీరు ఎప్పుడైనా చూశారా, చూడకుంటే ఈ వీడియోలో నాట్య మయూరిని చూడండి
Hazarath Reddyమెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ వ్యవసాయ పొలాల వద్ద ఓ నెమలి తన నృత్యంతో రైతులను కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని చూసిన రైతులు తమ సెల్ ఫోన్లలో ఆ నాట్య మయూరిని వీడియో తీసి బంధించారు.
Bihar Teachers' Fight Video: విద్యార్థుల ముందే తన్నుకున్న టీచర్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీహార్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం ఘర్షణకు దిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గోపాల్‌గంజ్‌లోని అహియాపూర్‌ మిడిల్‌ స్కూల్‌లో చోటుచేసుకుంది. అయితే విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయులపై విస్మయం వ్యక్తం చేశారు. ఇలా మా ముందే తన్నుకోవడం ఏంటని ఆశ్చర్యపోయారు.
Hyderabad Woman Starves on US Street: ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ యువతి, కేంద్ర మంత్రిని సాయం కోరిన యువతి తల్లి
Hazarath Reddyమాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ మహిళ తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తూ చికాగో రోడ్లపై కనిపించింది. సయ్యదా లులు మిన్హాజ్ జైదీ తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాస్తూ జోక్యం చేసుకుని తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని కోరారు.
Machilipatnam Doctor Murder: మచిలీపట్నంలో మహిళా డాక్టర్ దారుణ హత్య, గొంతు కోసి అతి కిరాతకంగా చంపిన దుండగులు, బంగారు నగలు అపహరణ
Hazarath Reddyకృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిల్లల వైద్య నిపుణురాలైన డాక్టర్‌ రాధ దారుణ హత్యకు గురయ్యారు. గత రాత్రి వారి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. రాధ గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు.
MS Dhoni Drives Rolls Royce: పాతకాలపు 1980 రోల్స్ రాయిస్‌ కారు నడిపిన ధోనీ, రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో ఇదిగో,,
Hazarath ReddyMS ధోని తన రాంచీ ఫామ్‌హౌస్‌లో షికారు చేస్తూ కనిపించాడు, భారత మాజీ కెప్టెన్ కి సంబంధించి మరొక వీడియో ఇటీవల వైరల్‌గా మారింది, ఇందులో ధోని రాంచీ వీధుల్లో అరుదైన పాతకాలపు 1980 రోల్స్ రాయిస్‌ను నడుపుతున్నట్లు చూడవచ్చు. వీడియోలో, CSK వికెట్ కీపర్ కారుపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు చూడవచ్చు.
Delhi Shocker: వైద్యుడిపై కత్తితో దాడి చేసిన పేషెంట్, ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఘటన, వీడియో ఇదిగో..
Hazarath Reddyఢిల్లీలోని గంగారాం ఆస్పత్రి వైద్యుడిపై ఓ రోగి కత్తితో దాడి చేశాడు. చికిత్స కోసం వచ్చిన పేషెంట్ ఒక్కసారిగా డాక్టర్ మీదకు కత్తితో విరుచుకుపడ్డాడు. వైద్యునికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదే..
Uttar Pradesh Horror: నిద్రిస్తున్న శిశువును పైకప్పు నుండి కిందకు తోసేసిన అడవి పిల్లి, నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ గ్రామంలో మరో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఒక అడవి పిల్లి నిద్రిస్తున్న శిశువును పైకప్పు నుండి కిందకు తోసేసింది. పశ్చిమ యూపీలో నెల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ పాప వయసు కేవలం ఒక నెల మాత్రమే.
Indrakiladri Ghat Road Closed: భారీ వర్షాలకు విజయవాడ దుర్గ గుడి వద్ద విరిగిపడిన కొండ చరియలు, ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు మూసివేత
Hazarath Reddyవిజయవాడ ( Vijayawada ) లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై కొండరాళ్లు ( Landslides) బుధవారం జారి ఘాట్‌రోడ్‌ మీద పడ్డాయి . ముందు జాగ్రత్త చర్యగా ఇంద్రకీలాద్రి ఘట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.
Srivari Pushkarini to be Closed: శ్రీవారి భక్తులకు అలర్ట్, నెలరోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత, భారీ వర్షాలకు తగ్గిన భక్తుల రద్దీ
Hazarath Reddyతిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్కరిణిని నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని తెలిపారు.
Uttar Pradesh: కొడుకును కనలేదని కోడలిని వంట రూంలో పడేసి దారుణంగా కొట్టిన అత్త, వీడియో ఇదిగో..
Hazarath Reddyయూపీలో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కొడుకును కనలేదని కోడలిని అత్తగారు వంట రూంలో పడేసి దారుణంగా కొట్టింది. ఈ ఘటన అలీఘర్‌లో గాంధీపార్క్ ఏరియాలోని డోరీనగర్‌లో చోటు చేసుకుంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక కోడలితో అత్తగారు గొడవ పడింది. కొడుకును కనలేదు ఎందుకంటూ దారుణంగా హింసించిన వీడియో ఇదే..
Viral Video: భారీ వర్షాలకు ఇంట్లోకి పాము, అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకోవడంతో జీహెచ్ఎంసీ ఆఫీసుకి పాముని పట్టుకుపోయిన యువకుడు
Hazarath Reddyహైదరాబాద్ - భారీ వర్షాలకు అల్వాల్ ప్రాంతంలో సంపత్ కుమార్ అనే యువకుడి ఇంట్లోకి వరద నీరుతో పాటు పాము వచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఓపిక నశించి అల్వాల్ జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చి టేబుల్ మీద పామును పెట్టి నిరసన తెలిపాడు.
Telangana Shocker: సోషల్ మీడియాలో రీల్స్‌తో పాపులర్ అవుతుందని చెల్లిని రోకలి బండతో కొట్టి చంపేసిన అన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన అన్న ఆమెను రోకలిబండతో మోది హత్య చేశాడు. అనంతరం రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.
Video: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కృష్ణానదిలోకి భారీగా కొట్టుకువచ్చిన మొసళ్లు, నది దగ్గరకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి జన జీవనం స్థంభించి పోయింది. భారీ వర్షాలకు మొసళ్లు సైతం వాగులో కొట్టుకుంటూ వచ్చాయి. తాజాగా నారాయణపేట - మక్తల్ మండలం పసుపుల గ్రామ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షానికి వాగులో మొసళ్ళు కొట్టుకొచ్చాయి. వీడియో ఇదిగో.