వైరల్
Accident Video: వీడియో ఇదిగో, రెండు లారీల మధ్యలో దూరి రెప్పపాటులో చావు నుంచి తప్పించుకున్న కపుల్స్, ఆత్రంగా వెళ్లి ప్రమాదాల బారిన పడకండంటూ సజ్జనార్ ట్వీట్
Hazarath Reddyజూలై 4న ఓ వీడియో ట్వీట్ చేశారు.ఇందులో ద్విచక్రవాహనచోదకులారా.. భారీ వాహనాల పక్కన వెళ్ళేటప్పుడు జాగ్రత్త! ఆత్రంగా వెళ్లి ప్రమాదాల బారిన పడకండి. అందరూ ఇలా రెప్పపాటులో మృత్యువు నుంచి బయటపడలేరు.
Video: పెద్ద లారీ కింద పడి తాపీగా లేచి వచ్చిన బుడతడు, ఈ బుడ్డోడు అదృష్టవంతుడు అంటూ సజ్జనార్ ట్వీట్, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన
Hazarath Reddyజూలై 2న ఓ వీడియో ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఈ బుడ్డోడు అదృష్టవంతుడు! భారీ వాహనాలు సంచరించే ప్రాంతాల్లో పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన వారి ప్రాణాలకే ప్రమాదమంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.
Andhra Pradesh Shocker: తోటికోడలు తిట్టిందని సెల్ టవర్ ఎక్కిన మహిళ, ఆందోళనలో గ్రామ ప్రజలు, వీడియో చూస్తే షాక్ తినాల్సిందే...
kanhaప్రకాశం - కంభంలో తోటికొడలు తిట్టిందని జియో సెల్ టవర్ ఎక్కి ఓ మహిళ నిరసనకు దిగింది. తోడికోడలు స్వగ్రామమైన పెద్దారవీడులో లక్ష్మీబాయిపై కేసు పెట్టగా విచారణకు పెద్దారవీడు పోలీసులు పిలిచారు.
Odisha: లోకోపైలట్‌ అప్రమత్తతతో బాలాసోర్‌లో తప్పిన మరో భారీ రైలు ప్రమాదం, వీడియో ఇదిగో..
Hazarath Reddyలోకోపైలట్‌ను అప్రమత్తం చేయడంతో ఒడిశాలోని బాలాసోర్‌లో భారీ రైలు ప్రమాదం తప్పింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రైల్వే ట్రాక్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడి ఉండటం చూడవచ్చు. లోకో ఫైలట్ అప్రమత్తం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Delhi Shocker: భర్త లేని ఒంటరి మహిళపై పదే పదే అత్యాచారం, స్నేహితుడి సాయంతో కత్తితో కసితీరా పొడిచి చంపి కక్ష తీర్చుకున్న మహిళ
Hazarath Reddyఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపినందుకు గాను 20 ఏళ్ల మహిళను, ఆమె సహచరుడిని ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. భర్త చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనే దానికి ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
'Be Ready for 26/11-Like Terrorist Attack': ముంబైలో 26/11 తరహా ఉగ్ర దాడి చేస్తాం, గుర్తు తెలియని వ్యక్తి నుంచి ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు సందేశం
Hazarath Reddyముంబై నగరంలో 26/11 తరహా ఉగ్రవాద దాడి జరుగుతుందని బెదిరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు సందేశం అందింది. వార్తా సంస్థ ANI ప్రకారం , నిందితులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నారని పేర్కొన్నారు
Sudden Heart Attack Death: రెండు డోసుల వ్యాక్సిన్, స్కూల్లో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, కార్డియోమయోపతితో బాధపడుతున్నట్లు తెలిపిన వైద్యులు
Hazarath Reddyఅకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. జూలై 17న గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో 17 ఏళ్ల విద్యార్థి పరీక్షకు ముందు హఠాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మరణించాడు. మృతుడు ముదిత్ నదియాపరాగా గుర్తించారు.
Petition on Vande Bharat in SC: మా ఊరిలో వందేభారత్ ఆగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంలో పిటిషన్, కోర్టును పోస్టాఫీసుగా మార్చొద్దంటూ మండిపడిన సీజేఐ
Hazarath Reddyభారత సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌పై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు అయ్యింది. 39 ఏళ్ల కేరళ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో (Petition on Vande Bharat in SC) వందేభారత్‌ రైలును తమ ఊరి స్టేషన్‌లో ఆగేలా (Kerala Man Wanted Vande Bharat Stop In His Home District) రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరాడు
Accident Video: సీసీటీవీ పుటేజి ఇదిగో, దారికి అడ్డంగా వెళుతున్న బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన బైకర్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో రోడ్డు దాటుతుండగా స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ భయానక ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. బ్లాక్ కలర్ కారు స్కూటర్‌ను ఢీకొట్టడం, అతన్ని గాలిలోకి విసిరి, ఘటనా స్థలం నుంచి వేగంగా పడిపోవడం వీడియోలో ఉంది.
Video: దొంగ మహిళ మెడలో చైన్ ఎంత స్మార్ట్‌గా లాక్కెళ్లాడో చూడండి, దారిన పోయే సమయంలో జాగ్రత్తగా ఉండకుంటే అంతే సంగతులు
Hazarath Reddyదొంగలు ఎక్కడబడితే అక్కడ రెచ్చిపోతున్నారు. దారిన పోతున్న మహిళలను టార్గెట్ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది, ఈ వీడియో యూపీలోని లక్నోలో జరిగిన ఘటనకు సంబంధించినది. వీడియోలో ఓ దొంగ స్మార్ట్ గా మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లాడు. పూలు తెంచి ఇస్తానన్న నెపంతో ఆ అగంతకుడు మహిళ మెడలోని గొలుసును దోచుకెళ్లాడు. వీడియో ఇదిగో..
Tamil Nadu: తాను చనిపోతే పిల్లల చదువుకు ప్రభుత్వం రూ.45 వేలు ఇస్తుందని తల్లి కఠిన నిర్ణయం, వేగంగా వస్తున్న బస్సు కింద పడి ఆత్మహత్య
Hazarath Reddyపిల్లల చదువులకు కావాల్సిన డబ్బులు సమకూర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటే పిల్లలకు రూ. 45 వేలు నష్టపరిహారం వస్తుందని భావించిన ఓ తల్లి బస్సు ముందు పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సేలంలో చోటుచేసుకుంది.
Tamil Nadu Shocker: పిల్లల చదువుకోసం బస్సు కింద పడి తల్లి ఆత్మహత్య, తాను చనిపోతే వారి చదువు కోసం రూ.45 వేలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందంటూ సూసైడ్
Hazarath Reddyతమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. పిల్లల చదువుల కోసం ఓ తల్లి బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పిల్లల చదువులకు కావాల్సిన డబ్బులు సమకూర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటే పిల్లలకు నష్టపరిహారం వస్తుందని భావించిన ఓ తల్లి బస్సు ముందు పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సేలంలో చోటుచేసుకుంది.
Revanth Reddy: వీడియో ఇదిగో, రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ అంటూ నోరు జారిన రేవంత్ రెడ్డి, సెటెర్లు వేస్తున్న బీఆర్ఎస్ నేతలు
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు జారారు. రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులను త్యజించి త్యాగానికి మారు పేరుగా నిలబడిందంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తల్లి అనే సంగతి మరచి భార్య అని సంబోధించడం ఆయనకే చెల్లిందంటూ బీఆర్ఎస్ నేతలు ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.
Shocking Incident at IKEA: స్నాక్స్ తింటుండగా పైనుంచి టేబుల్ పై పడిన చచ్చిన ఎలుక.. ప్రఖ్యాత ఐకియా స్టోర్‌ లో ఘటన.. న్యూస్ వైరల్ కావడంతో క్షమాపణలు చెప్పిన ఫర్నిచర్ సంస్థ
Rudraకర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత ఐకియా స్టోర్‌ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్టార్ లో భోజనం చేయాలనుకున్న శరణ్య అనే మహిళకు భయంకరమైన అనుభవం ఎదురైంది. స్టోర్‌ లోని ఫుడ్‌కోర్టులో భోజనం చేస్తుండగా ఆమె టేబుల్‌ పై పైకప్పు మీద నుంచి చచ్చిన ఎలుక పడింది.
Uttarakhand Landslide: రోడ్డును దాటుతుండగా టెంపో వాహనంపై విరిగిపడిన కొండచరియలు, భారీ లోయలో పడిపోయిన వాహనం, వీడియో ఇదిగో..
Hazarath Reddyకొండచరియలు విరిగిపడటంతో చెత్తాచెదారంతో నిండిన రోడ్డును దాటేందుకు ప్రయత్నిస్తుండగా టెంపో వాహనం బోల్తా పడింది. ఝార్‌గడ్‌ సమీపంలో యమునోత్రి జాతీయ రహదారి నిలిచిపోయింది. హైవేను క్లియర్ చేసేందుకు జేసీబీని అక్కడికక్కడే మోహరించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, గోదావరిలోకి దూకి యువతి ఆత్మహత్య, పోలీసులకు క్లూ అందించిన యజమాని పెంపుడు కుక్క
Hazarath Reddyఏపీలో ఓ యువతి యానాం - ఎదుర్లంక బ్రిడ్జి మీద చెప్పులు వదిలి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె పెంచుకున్న కుక్క యజమాని ఎంతకు తిరిగిరాకపోయేసరికి ఆమె చెప్పుల వద్దే తిరుగుతూ అక్కడే ఎదురు చూస్తూ గడిపింది.
Colors Swathi: విడాకుల దిశగా కలర్స్ స్వాతి..? ఇన్‌స్టా నుంచి భర్త ఫొటోలు తొలగించిన నటి.. విడాకులకు మునుపు సమంత, నిహారిక కూడా తమ భాగస్వాముల ఫొటోలు తొలగింపు.. అభిమానుల్లో ఆందోళన
Rudra‘కలర్స్’ ప్రోగ్రాంలో తన క్యూట్ మాటలతో హోమ్లీ గర్ల్ లుక్స్‌ తో ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న స్వాతి అనంతరం ఆ ప్రోగ్రాంనే ఇంటిపేరుగా మార్చుకొని ‘కలర్స్’ స్వాతిగా మారడం తెలిసిందే.
NITI Aayog Report: గడిచిన 8 ఏండ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.. నీతిఆయోగ్ తాజా నివేదిక లెక్కలు ఇవే!
Rudraనరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో పేదరికం అంతకంతకు తగ్గిపోతున్నది. ఈ మేరకు నీతిఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. 2015 నుంచి ఇప్పటివరకూ దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్టు నివేదిక వివరించింది.
Project-K Deepika Padukone First Look: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' నుంచి దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ విడుదల.. సీరియస్ లుక్ లో ఆసక్తికరంగా దీపిక ఫస్ట్ లుక్
Rudraగ్లోబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ సినిమా 'ప్రాజెక్ట్ కే' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో దీపికా పదుకొనేకు చెందిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.
Mystery Object in Australia: ఆస్ట్రేలియా సముద్ర తీరంలో చంద్రయాన్-3 శకలం? రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న వస్తువు.. మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన సంస్థ..
Rudraపశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ పట్టణ తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు కలకలానికి దారితీసింది. రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న ఆ వస్తువు ఏంటో అర్థంకాక స్థానికులు పెద్దయెత్తున చర్చించుకుంటున్నారు.