ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 10.35 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో మూడు రోజుల నుంచి వరుసగా భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
ముందు రోజు శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. ప్రకంపనలు రాగానే ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకొచ్చారు. తాళ్లూరు మండలంలో కూడా స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.
Earthquake again in
ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 10.35 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో మూడు రోజుల నుంచి వరుసగా భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. pic.twitter.com/6eCmHRulUG
— ChotaNews (@ChotaNewsTelugu) December 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)