బిర్యానీలో స్కబ్బర్ వచ్చిందని ప్రశ్నించిన కస్టమర్లపై లాఠీలతో దాడి చేశారు. నక్షత్ర హోటల్ నిర్వాహకులు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిట్టెంపల్లి గేటు దగ్గర నక్షత్ర హోటల్‌లో బిర్యానీలో స్కబ్బర్ వచ్చిందని ప్రశ్నించిన కస్టమర్లు. మీరు హోటల్‌కు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య చూపిస్తున్నారు అంటూ వెంటపడి లాఠీలతో కొట్టారు హోటల్ నిర్వాహకులు.

ఇక ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఏకంగా బిర్యానీలో బ్లేడ్‌ వచ్చింది.యాదాద్రి జిల్లా, బీబీనగర్‌ మండలం, మక్త అనంతారంనకు చెందిన బింగి అయిలయ్యయాదవ్‌ ముగ్గురు స్నేహితులతో కలిసి ఘట్‌కేసర్‌ బైపాస్‌లోని ఆదర్శ్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేయగా.. వెయిటర్‌ బిర్యానీ తీసుకొచ్చాడు. అనంతరం బిర్యానీ తింటుండగా.. అందులో బ్లేడ్‌ ప్రత్యక్షమైంది. బార్‌ యాజమాన్యాన్ని పిలిచి బిర్యానీలో బ్లేడ్‌ వచ్చిందని నిలదీయగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో అయిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, బిర్యానీలో బ్లేడ్‌ వచ్చిందని కావాలనే క్రియేట్‌ చేశారని ఆదర్శ్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం తెలిపింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రెస్టారెంట్‌ నిర్వాహకులు తెలిపారు.

వీడియో ఇదిగో, ఏ పాము కరిచిందో తెలీక 2 పాములని చంపి ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, తీరా చూస్తే

Nakshatra hotel managers attacked customers with sticks

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)