క్రీడలు
CSK vs RCB Stat Highlights: కోహ్లీ దూకుడుతో నాలుగో విజయాన్ని నమోదు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌, వరుసగా మూడో మ్యాచులో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్
Hazarath Reddyచెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ 37 పరుగుల తేడాతో విజయం (CSK vs RCB Stat Highlights) సాధించింది. చెన్నైను 132 పరుగులకే కట్టడి చేసిన కోహ్లి సేన అదరహో అనిపించింది. సీఎస్‌కే జట్టులో (Chennai Super Kings) అంబటి రాయుడు(42; 40 బంతుల్లో 4 ఫోర్లు), జగదీషన్‌(33;28 బంతుల్లో 4ఫోర్లు)లు మాత్రమే ఆడగా, మిగతా వారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు అద్భుత ప్రదర్శనతో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో ఏ మాత్రం కుదురుకోనివ్వలేదు.
RR vs DC, IPL 2020 Match Result: ఢిల్లీ హ్యట్రిక్ విజయం, రాజస్థాన్‌కు నాలుగో పరాభవం, 46 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్‌పై ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌
Hazarath Reddyఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని (RR vs DC, IPL 2020 Match Result) నమోదు చేసుకుంది. షార్జా పిచ్‌పై లక్ష్యఛేదనలో వెనుకబడిన రాజస్థాన్‌ రాయల్స్‌ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం ఇక్కడ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ( RR vs DC Dream11 IPL 2020) ఢిల్లీ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది.
KKR vs CSK Stat Highlights: బ్యాటింగ్‌లో మరోసారి ఘోరంగా విఫలమైన చెన్నై, 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం, కోల్‌కతాను గెలిపించిన రాహుల్‌ త్రిపాఠి మెరుపులు
Hazarath Reddyబ్యాటింగ్‌ వైఫల్యంతో ధోనీ సేన మరోసారి ఓడింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో (KKR vs CSK Stat Highlights Dream11 IPL 2020) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) చేతిలో పరాజయం పాలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) రాహుల్‌ త్రిపాఠి (51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) అర్ధ శతకం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై(Chennai Super Kings) ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి ఓడింది.
MI vs RR Stat Highlights IPL 2020: మళ్లీ అగ్రస్థానానికి ముంబై, రాజస్థాన్ రాయల్‌పై 57 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
Hazarath Reddyఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరో విజయాన్ని సాధించింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MI vs RR Stat Highlights IPL 2020) ముంబై ఇండియన్స్‌ 57 పరుగుల తేడాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌(70; 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా ఎవరు రాణించకపోవడంతో ఓటమి (Mumbai Indians Beat Rajasthan Royals) తప్పలేదు.
RCB vs DC Highlights IPL 2020: బెంగుళూరును గెలిపించలేకపోయిన కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ, 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం
Hazarath Reddyఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విక్టరీని నమోదు చేసింది. బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ చిత్తుగా ఓడింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో (RCB vs DC Highlights IPL 2020) ఢిల్లీ 59 పరుగుల తేడాతో బెంగళూరును ఢిల్లీ కంగుతినిపించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. స్టొయినిస్‌ (26 బంతుల్లో 53 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించగా... పృథ్వీషా (23 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన హైదరాబాద్‌ బౌలర్‌ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి.
MI vs SRH Stat Highlights IPL 2020: ముంబై చేతిలో చిత్తయిన సన్‌రైజర్స్‌, మూడో విజయాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌, హైదరాబాద్‌ను గెలిపించలేకపోయిన వార్నర్ ఇన్నింగ్స్
Hazarath Reddyబ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌లో (MI vs SRH Stat Highlights IPL 2020) మరో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను రోహిత్‌ శర్మ బృందం 34 పరుగులతో చిత్తుగా ఓడించింది. కాగా ముంబై ఇండియన్స్‌కు ఇది మూడో విజయం కాగా, సన్‌రైజర్స్‌కు (Sunrisers Hyderabad) మూడో ఓటమి.
KXIP vs CSK Stat Highlights IPL 2020: హ్యాట్రిక్ పరాజయాలకు ధోనీ సేన పుల్‌స్టాప్, 10 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం, నాలుగో ఓటమిని చవిచూసిన పంజాబ్
Hazarath Reddyసమిష్టిగా ఆడిన చెన్నై హ్యాట్రిక్ పరాజయాలకు పుల్‌స్టాప్ పెట్టింది. నిన్న పంజాబ్ కింగ్స్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్ లో (KXIP vs CSK Stat Highlights IPL 2020) 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లాడిన పంజాబ్‌కు ఇది నాలుగో ఓటమి కాగా ధోనీ సేన టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.
RCB vs RR Highlights IPL 2020: రాజస్తాన్‌ రాయల్స్‌పై కోహ్లీ సేన ఘన విజయం, చాన్నాళ్ల తరువాత ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ, ముచ్చటగా మూడో విజయాన్ని నమోదు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
Hazarath Reddyఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) లీగ్‌లో మూడో విజయాన్ని సాధించి సత్తా (RCB vs RR Highlights IPL 2020) చాటింది. శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో (Rajasthan Royals) మ్యాచ్‌లో కోహ్లి సేన 8 వికెట్లతో గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది.
DC vs KKR Highlights IPL 2020: ఆడేసుకున్న అయ్యర్, మరోసారి విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌, పోరాడకుండానే ఓడిన కోలకతా నైట్ రైడర్స్, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఢిల్లీ
Hazarath Reddyఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరోసారి సత్తాచాటింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై (DC vs KKR Highlights IPL 2020) ఢిల్లీ క్యాపిటల్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించి.. పాయిట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని అధిష్టించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు చేసింది.
CSK vs SRH Highlights IPL 2020: పోరాడి వరుసగా రెండోసారి గెలిచిన హైదరాబాద్, ముచ్చటగా మూడోసారి పరాజయాన్ని మూటగట్టుకున్న చెన్నై, సీఎస్‌కేని గెలిపించలేకపోయిన జడేజా అర్థ సెంచరీ
Hazarath Reddyసీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చెన్నై సూపర్ కింగ్స్ పై (CSK vs SRH Highlights IPL 2020) పోరాడి గెలిచింది. సన్‌రైజర్స్‌ 164 పరుగుల స్కోరును కాపాడుకుని మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. సీఎస్‌కేపై 7 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ గెలిచి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. సీనియర్‌ ఆటగాళ్లు విఫలమైనా ముగ్గురు కుర్రాళ్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మెచ్చుకోదగ్గ విజయాన్ని అందించారు. ఫలితంగా ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు (SRH Sunrisers) వరుసగా రెండో గెలుపు లభించింది.
KXIP vs MI Highlights: రోహిత్ శర్మ, పొలార్డ్‌ల హార్డ్ హిట్టింగ్‌తో చిత్తైన పంజాబ్ కింగ్స్, 48 పరుగుల తేడాతో ముంబై గెలుపు, ఈరోజు హైదరాబాద్ మరియు చెన్నైల మధ్య ఆసక్తికర పోరు
Team Latestlyశుక్రవారం హైదరాబాద్ మరియు చెన్నై జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఎన్నో అంచనాలు ఉన్న ఈ రెండు జట్లు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం 1 మాత్రమే గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి....
RR vs KKR Stat Highlights Dream11 IPL 2020: మెరుపులు లేని మ్యాచ్, తక్కువ స్కోరును చేధించలేక చతికిల బడ్డ రాజస్థాన్ రాయల్స్, సమష్టిగా రాణించి రెండో విజయాన్ని నమోదు చేసిన కోలకతా
Hazarath Reddyఐపీఎల్13లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (RR vs KKR Stat Highlights Dream11 IPL 2020) అదరగొట్టింది. బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి పోరాడే స్కోరును బోర్డుపై ఉంచిన కేకేఆర్‌.. ఆపై పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. బ్యాటింగ్‌ లైనప్‌లో పటిష్టంగా ఉన్న రాజస్తాన్‌ను (Rajasthan Royals) 137 పరుగులకే కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కేకేఆర్‌ బౌలర్లలో శివం మావి, నాగర్‌కోటి, ప్యాట్‌ కమిన్స్‌, వరుణ్‌ చక్రవర్తిలు రాణించి జట్టుకు మంచి విజయాన్ని అందించారు. మావి, నాగర్‌కోటి, వరుణ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, కమిన్స్‌, కుల్దీప్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌లు తలో వికెట్‌ తీశారు.
DC vs SRH Stat Highlights Dream11 IPL 2020: ఢిల్లీ హ్యాట్రిక్ ఆశలు ఆవిరి, రెండు ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌కు తొలి విజయం, 15 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌
Hazarath Reddyసమష్టి ప్రదర్శనతో ఐపీఎల్‌–2020 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మొదటి విజయం దక్కింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను (DC vs SRH Stat Highlights Dream11 IPL 2020) ఓడించింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ వరుసగా రెండు ఓటములతో తర్వాత విజయాన్ని సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల స్కోరును కాపాడుకుని విజయకేతనం ఎగురవేసింది. సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లో రాణించడంతో సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించినా గెలుపును అందుకుంది. కాగా, హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుందామనుకున్న ఢిల్లీ ఆశలు తీరలేదు.
RCB vs MI Highlights IPL 2020: ఆర్సీబీ ‘సూపర్‌’ విక్టరీ, పోరాడి ఓడిన ముంబై, ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ అయిన ముంబై ఆటగాడు ఇషాన్‌ కిషన్‌, ముంబైని గెలిపించలేకపోయిన పొలార్డ్ మెరుపులు
Hazarath Reddyముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ‘సూపర్‌’ విక్టరీని (Royal Challengers Bangalore Win Super Over After Tied Match) నమోదు చేసింది. సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో (RCB vs MI Highlights IPL 2020) ఆర్సీబీ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ లో సిక్స్‌ల వరద పారింది. క్రికెట్‌ అభిమానుల్ని తెగ అలరించిన ఈ మ్యాచ్‌లో (Royal Challengers Bangalore vs Mumbai Indians) చివరకు సూపర్‌ ఓవర్ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు (ఆర్‌సీబీ) ని విజయతీరాలకు చేర్చింది. ముంబై ఇండియన్స్‌ పోరాటం ఆ ఓవర్‌లోనే ఆవిరైంది.
KKR vs SRH Stat Highlights IPL 2020: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ ఓడింది, ఐపీఎల్‌–2020లో బోణీ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, 70 పరుగులతో చెలరేగిన శుబ్‌మన్‌ గిల్‌
Hazarath Reddyఐపీఎల్‌–2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బోణీ చేసింది. శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై (KKR vs SRH Stat Highlights IPL 2020) ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) మళ్లీ ఓడింది.
CSK vs DC IPL 2020 Match 7 Result: రెండోసారి చతికిల బడ్డ సీఎస్‌కే, మరో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌, బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన పృథ్వీ షా
Hazarath Reddyఐపీఎల్‌ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 44 పరుగుల తేడాతో విజయం (CSK vs DC, IPL 2020 Match 7 Result) సాధించింది. ఫలితంగా వరుసగా రెండో గెలుపును అందుకుంది. సీఎస్‌కే వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది. ఢిల్లీ (Delhi Capitals) నిర్దేశించిన 176 పరుగుల ఛేదనలో సీఎస్‌కే ఏడు వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్‌కేకు (Chennai Super Kings) శుభారంభం లభించలేదు.
KXIP vs RCB Highlights: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఘనవిజయం, 109 పరుగులకే కుప్పకూలిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సెంచరీతో దుమ్ములేపిన కేఎల్ రాహుల్
Team Latestlyదుబాయ్ వేదికగా బెంగళూరు మరియు పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దుమ్ములేపింది. మొదట బ్యాట్ తోనూ, ఆ తర్వాత బాల్ తోనూ రాణించి ఆల్ రౌండ్ ప్రదర్శనతో బెంగళూరు జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది.....
RR vs CSK Stat Highlights IPL 2020: చెన్నైని గెలిపించలేకపోయిన ధోనీ హ్యట్రిక్ సిక్సర్లు, 16 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌
Hazarath Reddyఐపీఎల్‌-13లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (RR vs CSK Stat Highlights IPL 2020) పోరాడి ఓడింది. రాజస్తాన్‌ నిర్దేశించిన 217 పరుగుల టార్గెట్‌లో సీఎస్‌కే 200 పరుగులు వరకూ వచ్చి ఆగిపోయింది. ఫలితంగా రాజస్తాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడినా డుప్లెసిస్‌(72; 37 బంతుల్లో 1 ఫోర్‌ 7 సిక్సర్లు), ఎంఎస్‌ ధోని(29 నాటౌట్‌; 17 బంతుల్లో 3 సిక్సర్లు)లు అలరించారు. టామ్‌ కరాన్‌ వేసిన చివరి ఓవర్‌లో ధోని (MS Dhoni) హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టి ఫ్యాన్స్‌ను అలరించాడు. అయినా ఓటమి నుంచి గట్టెక్కలేకపోయింది.
SRH vs RCB Highlights IPL 2020: తొలి మ్యాచ్‌లో చతికిల పడ్డ సన్‌రైజర్స్‌, బోణీ కొట్టిన బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌
Hazarath Reddyఐపీఎల్‌-13లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దెబ్బకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి పాలయింది. సాధారణ స్కోరును సైతం ఛేదించలేక ఎస్‌ఆర్‌హెచ్‌ చతికిలబడింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (SRH vs RCB) ఒత్తిడిని జయించిన ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఘన విజయం (Royal Challengers Bangalore Beat Sunrisers) సాధించింది. ఆర్సీబీ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ తన మ్యాజిక్‌ బౌలింగ్‌తో అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో బెయిర్‌ స్టో(61) ను బౌల్డ్‌ చేసిన చహల్‌.. ఆ తర్వాత బంతికి విజయ్‌ శంకర్‌(0) బౌల్డ్‌ చేశాడు. 16వ ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్లో చహల్‌ వికెట్లు సాధించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
DC vs KXIP Highlights: రెండో మ్యాచ్‌కే సూపర్ ఓవర్, ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌‌దే గెలుపు, ఢిల్లీ తరపున చెలరేగిన స్టొయినిస్‌, పంజాబ్ తరపున మయాంక్ అగర్వాల్ ఒంటరి పోరాటం
Hazarath Reddyఐపీఎల్ 2020 సీజన్‌లో మెరుపులు మెరుస్తున్నాయి. రెండో మ్యాచ్‌కే సూపర్ ఓవర్ వచ్చేసింది. ఈ సూపర్‌ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విక్టరీ (Delhi Capitals vs Kings XI Punjab) సాధించింది. పంజాబ్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ బౌలర్‌ రబడ మెరుపులు మెరిపించాడు. బౌలింగ్‌ సత్తాతో కింగ్స్‌ను ఓడించాడు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టొయినిస్‌ (21 బంతుల్లో 53; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు.