క్రికెట్

T2o World Cup 2021, Afghanistan vs Namibia : సెమీస్ రేసులో ఆఫ్ఘనిస్తాన్, కీలక మ్యాచులో నమీబియా చిత్తు...

sajaya

T2o World Cup 2021, Afghanistan vs Namibia : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా 27వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 62 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది.

T20 World Cup India vs New Zealand : కివీస్‌తో పోరుకు కోహ్లీ సేన సిద్ధం, చావో రేవో తేల్చుకునే మ్యాచులో కీలక సలహాలు అందించిన భజ్జీ, కోహ్లీ సేనకు ఈ సారైనా కలిసి వస్తుందా..

sajaya

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై తొలి విజయం కోసం భారత్ కూడా కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్‌పై 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన ఈ మ్యాచ్‌పై క్రికెట్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

T20 World Cup: పాకిస్థాన్ క్రికెటర్ ఆసిఫ్ చేసిన పనికి, ఆఫ్ఘనిస్థాన్ రాయబారి షాక్, ఆసిఫ్ నీకు బుద్ధి ఉందా..?

Krishna

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లో, ఆసిఫ్ తన బ్యాటును గన్ లాగా మార్చి గాల్లో కాల్పులు జరుపుతున్నట్లు చేసి సెలబ్రేషన్ చేసాడు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

T20 WC: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగేది ఆ రెండు జట్ల మధ్యనే, ముందే జోస్యం చెప్పిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, ఎవరో తెలిస్తే షాక్ తింటారు...

Krishna

ఇంగ్లండ్‌ విజయం తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ఈ టీ20 ప్రపంచకప్‌పై భారీ అంచనాలు వేశాడు. దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ భారత్-పాకిస్థాన్ లేదా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరగవచ్చని వార్న్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

T20 World Cup 2021, AUS Vs ENG: ఇంగ్లాండ్ దూకుడు, ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌ ఘనవిజయం, సెమీస్‌‌లోకి బెర్త్ కన్ఫార్మ్..

Krishna

టీ-20 వరల్డ్ కప్ 2021లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా విధించిన 125 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ కేవలం 11.4 ఓవర్లలోనే ఫినిష్ చేసింది.

T20 World Cup 2021: ఆఖరి ఓవర్‌లో సిక్సర్లతో విరుచుకుపడిన మిల్లర్, రెండో విజయాన్ని నమోదు చేసిన దక్షిణాఫ్రికా, రెండో పరాజయంతో శ్రీలంకకు క్లిష్టంగా మారిన సెమీస్ ఆశలు

Hazarath Reddy

శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో (SA vs SL Highlights of T20 World Cup 2021) దక్షిణాఫ్రికానే విజయం వరించింది. శ్రీలంకకు విజయం అందినట్టే అంది చేజారింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ వరుస సిక్సర్లు బాది (David Miller Snatches Win For South Africa) జట్టుకు సూపర్ విక్టరీ అందించాడు.

Virat Kohli Slams Trolls: మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఎన్ని మ్యాచ్‌లు గెలిపించాడో వారికి తెలుసా, ట్రోలర్స్‌పై విరుచుకుపడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆటగాడిపై మ‌తం ఆధారంగా వివ‌క్ష చూప‌డంపై ఆవేదన

Hazarath Reddy

IND vs PAK, T20 ప్రపంచ కప్ మ్యాచ్ తర్వాత మహ్మద్ షమీని (Mohammad Shami After IND vs PAK) లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా (Virat Kohli Slams Trolls) స్పందించాడు. ఈ ట్రోల్స్ చాలా దయనీయమైనవి' అని అన్నాడు. ష‌మీపై జ‌రుగుతున్న ట్రోలింగ్‌ను ఖండిస్తూ.. అతడికి అండ‌గా టీమ్ లోని ఆటగాళ్లందరూ ఉన్నారన్నాడు.

T20 World Cup 2021 PAK Vs AFG: టెన్షన్ మ్యాచులో పాకిస్థాన్ విజయం, పోరాడి ఓడిన అఫ్గనిస్తాన్, సిక్సులతో గట్టెక్కించిన ఆసిఫ్‌ అలీ

Krishna

టి20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్‌ విజయపరంపర కొనసాగుతుంది. నేడు దుబాయిలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

Advertisement

WI vs BAN Highlights: రేసులో నిలబడిన వెస్టిండీస్‌, ఇంటిదారి పట్టిన బంగ్లాదేశ్, ఉత్కంఠ పోరులో బంగ్లాపై విజయం సాధించిన వెస్టిండీస్‌

Hazarath Reddy

చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌నే విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-1లో భాగంగా బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ (T20 West Indies vs Bangladesh) ముగిసింది. చివరి బంతి వరకూ విజయం ఎవరిదో తేల్చలేని స్థితిలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి వెస్టిండీస్‌ విజయం (West Indies Secure First Win) సాధించింది

T20 WC 2021 AUS Vs SL: లంకను చిత్తు చేసిన ఆస్ట్రేలియా, వార్నర్ దూకుడుతో చేతులెత్తేసి శ్రీలంక

Krishna

Australias win over Sri Lanka | టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌ 12 నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన T20 లీగ్ మ్యాచులో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.

T20 World Cup 2021: టి20 ప్రపంచ కప్ సాధించేది ఇండియానే, అభిమాని ప్రశ్నకు అదిరిపోయే రిప్లయి ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్, అక్టోబర్ 31 న న్యూజీలాండ్‌తో తలపడనున్న భారత్

Hazarath Reddy

టి20 ప్రపంచకప్‌ 2021 వేట మొదలై అప్పుడే 10 రోజులు దాటిపోయింది. ఈ పది రోజుల్లోమొత్తం 19 మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటివరకు నాలుగు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వాటిలో పపువా న్యూ గినియా, ఒమన్‌, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌ ఉన్నాయి.

T20 World Cup 2021: వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లండ్, 8 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు, సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడిన జేసన్ రాయ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు

Hazarath Reddy

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (T20 World Cup 2021) ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు బంపర్ విక్టరీ నమోదు చేసింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాను (England Register Consecutive Wins) మట్టికరిపించింది.

Advertisement

T20 World Cup 2021: టీ-20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్‌పై నమీబియా ఘనవిజయం, 4 వికెట్ల తేడాతో గెలుపొందిన నమీబియా

V. Naresh

టీ-20 వరల్డ్‌ కప్(T-20 World Cup)లో సంచలన విజయాన్ని నమోదు చేసింది నమీబియా. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై నమీబియా విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 109 ప‌రుగుల‌ స్వల్ప ల‌క్ష్యాన్ని 5 బంతులు మిగిలి ఉండ‌గానే చేధించింది.

T20 World Cup 2021: భారత్ సెమీస్‌కు చేరాలంటే దారి ఇదే, అక్టోబర్ 31 న్యూజిలాండ్‌‌తో చావో రేవో తేల్చుకోనున్న కోహ్లీ సేన, గెలిచిన జట్టుకు సెమీ ఫైనల్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే..

Hazarath Reddy

ఈనెల 31న జరిగే మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌పై (India vs New Zealand) తప్పక గెలవాలి. అప్పుడు భారత్‌ 8, పాక్‌ 10 పాయింట్లతో సెమీస్ కు చేరుతాయి. కివీస్‌ 6 పాయింట్లతో ఇంటికి వెళ్తుంది. ఒకవేళ భారత జట్టు కివీస్‌ చేతిలో ఓడితే.. పాక్‌ 10, కివీస్‌ 8 పాయింట్లతో సెమీస్ కు చేరుతాయి.

T20 World Cup 2021: పాకిస్తాన్ సెమీస్‌ బెర్త్ దాదాపు ఖాయం, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం, కివీస్ బ్యాట్స్‌మన్లను ముప్పతిప్పలు పెట్టిన హారిస్‌ రవూఫ్‌

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్ టి20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. షార్జాలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో (T20 World Cup 2021) బాబర్‌ ఆజమ్‌ బృందం ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఇక సెమిస్ కు చాలా దగ్గరగా వెళ్లింది.

T20 Worldcup 2021: South Africa Vs West Indies మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం, ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన విండీస్

Krishna

T20 Worldcup 2021లో వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచు ఎలాంటి మెరుపులు లేకుండా సాదాసీదాగా ముగిసింది. ఉత్కంఠ భరితంగా జరగాల్సిన టీ 20 సిరీస్ పోరులో ఇప్పటి వరకూ సరైన వేడి అందుకోలేదు. తాజాగా నేడు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

Advertisement

IND vs PAK Stat Highlights: టీ20 ప్రపంచకప్‌ను ఓటమితో ఆరంభించిన కోహ్లీ‌సేన, వికెట్ పడకుండానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకున్న పాక్, ప్రపంచకప్‌ చరిత్రలో దాయాది దేశానికి భారత్‌పై 10 వికెట్ల తేడాతో తొలి విజయం

Hazarath Reddy

టీ20 ప్రపంచక్‌పను టీమిండియా ఓటమితో ఆరంభించింది. తొలి పోరు పాకిస్థాన్‌తో కావడంతో (IND vs PAK Stat Highlights) ఈ మ్యాచ్‌కు ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడింది. ఆ అంచనాలను కోహ్లీ సేన ఏమాత్రం అందుకోలేకపోయింది. అటు ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఎదురైన ఐదు ఓటములకు పాక్‌ పది వికెట్ల తేడాతో గెలిచి (Pakistan Register First Win Over India At Twenty-20 WC) ప్రతీకారం తీర్చుకుంది.

Tamil Nadu: దర్శకుడు శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు, రోహిత్‌తో పాటు మరో 5 మందిని అరెస్ట్ చేసిన పుదుచ్చేరి పోలీసులు

Hazarath Reddy

ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ అల్లుడు, క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌పై లైంగిక వేధింపుల కేసు (Director Shankar's son-in-law booked under POCSO) నమోదైంది. అత‌నితోపాటు మ‌రో ఐదుగురిని మంగ‌ళ‌వారం పుదుచ్చెరిలో అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల అమ్మాయిని (sexually harassing 16-year-old girl) లైంగికంగా వేధించార‌న్న ఆరోప‌ణ‌లు వీళ్ల‌పై ఉన్నాయి.

ICC T20 World Cup 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో విజయంతో ప్రస్థానం ప్రారంభించిన ఐర్లాండ్, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపు

Hazarath Reddy

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ విజయంతో ప్రస్థానం ప్రారంభించింది. ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. 107 పరుగుల విజయలక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ఛేదించింది.

T20 World Cup 2021: ఉగ్రవాదుల కాల్పుల్లో మనోళ్లు చస్తుంటే వారితో మ్యాచ్‌లా, భారత్, పాక్ మధ్య టీ 20 మ్యాచ్‌పై మరోసారి ఆలోచన చేయాలని కోరిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌

Hazarath Reddy

దేశ సరిహద్దులో ఉద్రిక్తతలు రేగుతున్న నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య ఈ నెల 24న దుబాయ్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌ కప్ మ్యాచ్‌పై (India-Pak T20 World Cup Match) పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ కోరారు.

Advertisement
Advertisement