క్రికెట్
MI vs RCB Highlights: ఉత్కంఠ పోరులో శుభారంభం చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, బాల్‌తో పడగొట్టిన హర్షల్ పటేల్, బ్యాట్‌తో నిలబెట్టిన ఏబి డివిలియర్స్
Team Latestlyఇక్కడ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడూ తన బౌలింగ్ లో మార్పులు చేసుకుంటూ 4 ఓవర్లలో ఏకంగా 5 కీలక వికెట్లు తీసి ముంబై నడ్డి విరిచాడు. ముంబై జట్టులో ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పొలార్డ్ మరియు క్రునాల్ పాండ్యా లాంటి మేటి ఆటగాళ్లను తక్కువ స్కోర్లకే హర్షల్ పటేల్ ఔట్ చేశాడు. అందులోనూ ఒక్క చివరి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టాడు....
IPL 2021 Schedule: నేటి నుంచి ఐపీఎల్ సీజన్-14, కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి వేడుకలు లేకుండానే ప్రారంభం కానున్న క్రికెట్ ఉత్సవం, ముంబై- బెంగళూరు మధ్య తొలి మ్యాచ్, పూర్తి షెడ్యూల్ చూడండి
Team Latestlyపీఎల్ 14 ఎడిషన్ ప్రారంభానికి మాత్రం అంతా సిద్ధమైంది. శుక్రవారం చెన్నై వేదికగా తొలి మ్యాచ్ సాయంత్రం 7:30 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ విజేతగా నిలిచి, హ్యాట్రిక్ పై కన్నేసిన ముంబై ఇండియన్స్ మరియు ఇంతవరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలుచుకోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి....
Daniel Sams Covid: రెండు రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్, ఆర్సీబీకి షాక్, ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌కు కరోనా, అసింప్టమాటిక్ కరోనా అని తేల్చిన బెంగళూరు వైద్య బృందం, 10రోజుల పాటు ఐసోలేషన్‌లో..
Hazarath Reddyమరో రెండు రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌కు (Daniel Sams Covid) బుధవారం కరోనా సోకింది.
IPL 2021: ఐపీఎల్ 2021ని వణికిస్తున్న కరోనా, వాంఖడే స్టేడియంలో 8 మందికి కోవిడ్, నితీష్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, సీఎస్‌కే సిబ్బందిలో ఒకరికి కరోనా, సందిగ్ధంలో ఏప్రిల్‌10 తేదీ ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే మధ్య మ్యాచ్
Hazarath Reddyఐపీఎల్‌ 14వ సీజన్‌ 2021 ఆరంభానికి ముందే కరోనావైరస్ కలకలం రేపింది. తాజాగా ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా (Eight groundsmen at Wankhede Stadium test positive) నిర్థారణ అయింది. కరోనా పాజటివ్‌గా సోకిన వారందరిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.
West Bengal: మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, మొయినా బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ దిండా
Hazarath Reddyమాజీ క్రికెటర్, మొయినాకు బిజెపి అభ్యర్థి అశోక్ దిండాపై మొయినాలో గుర్తు తెలియని వ్యక్తులపై దాడి చేశారు. ఎవరు దాడి చేశారనే దానిపై ఇంకా సమాచారం లేదు పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య వ్యక్తిగత దూషణలు, దాడులు తారా స్థాయికి చేరాయి.
ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్న ఇండియా, అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్, మూడవ స్థానంలో న్యూజీలాండ్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా జట్లు
Hazarath Reddyఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న కోహ్లీ టీం.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) నంబర్ త్రి నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌తో టెస్టు(3-1), టీ20(3-2) సిరీస్‌లను సైతం కైవసం టీమిండియా టెస్టుల్లో అగ్రస్థానంలో, టీ20ల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది.
India vs England- Highlights: ఉత్కంఠభరితమైన చివరి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా, 2-1 తేడాతో వన్డే సిరీస్ కూడా కైవసం, భారత పర్యటనలో ఒక్క సిరీస్ కూడా నెగ్గకుండా ఇంగ్లండ్ వైట్ వాష్; ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ ఎడిషన్ ప్రారంభం
Team Latestlyరో గ్రాండ్ క్రికెట్ ఫెస్టివల్ ఇండియాలో ప్రారంభం కాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) యొక్క 14వ ఎడిషన్, ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. గతేడాది చివర్లో కరోనా కారణంగా దుబాయిలో నిర్వహించిన ఐపీఎల్ ఈసారి అనుకున్న షెడ్యూలుకే ఇండియాలోనే తటస్థ వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ ముంబై - బెంగళూరు మధ్య జరగనుంది.....
Sachin COVID-19 Positive: సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా, స్వీయ నిర్భంధంలోకి లిటిల్ మాస్టర్, ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ టోర్నీలో కరోనా కలకలం, ముగ్గురు షూటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ
Hazarath Reddyఇటీవలే రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెట‌ర్ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా (Sachin COVID-19 Positive) సోకింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు. కొవిడ్ టెస్టు చేయించుకోగా త‌న‌కు స్వల్ప లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, త‌న‌ కుటుంబంలోని మిగిలిన వారికి క‌రోనా నెగటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని ఆయ‌న తెలిపారు.
India vs England, 5th T20I: భారత్ రికార్డుల మోత, ఎనిమిది సిరీస్‌ల తర్వాత తొలిసారి ఓటమిని చవి చూసిన ఇంగ్లండ్, ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో గెలుచుకున్న భారత్, అంతర్జాతీయ టీ20ల్లో టాప్-2లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ
Hazarath Reddyఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–2తో గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను (India vs England, 5th T20I Match Result) ఓడించింది.
IND vs ENG 3rd T20I 2021: భారత్ బౌలర్లను బాదేసిన బట్లర్, ఇండియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం, కెప్టెన్ మోర్గాన్‌ 100 టి20 మ్యాచ్‌లో విజయాన్ని కానుకగా అందించిన సహచరులు
Hazarath Reddyమంగళవారం ఇక్కడ జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ తన 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో (IND vs ENG 3rd T20I 2021) బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాకుండానే అతని సహచరులు విజయాన్ని కానుకగా అందించారు.
India vs England 2nd T20I: కోహ్లీ రికార్డుల వరద, టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం, సిరీస్‌ 1-1తో సమం, ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
Hazarath Reddyభారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం (India vs England 2nd T20I) సాధించింది. తొలి టీ20లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్‌ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది
Sachin Tendulkar 'Prank': 200 టెస్టులు..277 సార్లు కోవిడ్‌ టెస్టులు, వైద్య సిబ్బందిని ప్రాంక్‌ వీడియో ద్వారా హడలెత్తించిన సచిన్, రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్ కోసం‌ రాయ్‌పూర్‌కు చేరుకున్న లిటిల్ మాస్టర్
Hazarath Reddyకరోనావైరస్ కల్లోలంలో ఆటగాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ప్రతి సీరిస్ కు ముందు వారు కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే. ఈ క్రమంలో కరోనా టెస్ట్‌ చేస్తుండగా.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చేసిన ప్రాంక్‌ వీడియో (Sachin Tendulkar Pulls Out Prank) వైరలవుతోంది.
IPL 2021 Schedule Announced: హైదరాబాద్‌లో నో మ్యాచ్, ఏప్రిల్ 9న చెన్నైలో తొలి మ్యాచ్, మొత్తం 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లు, మే 30న నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్, ఐసీఎల్ 14 షెడ్యూల్ మీకోసం
Hazarath Reddyక్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజ‌న్ షెడ్యూల్‌ను (IPL 2021 Schedule Announced) ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఆదివారం విడుద‌ల చేసింది. దేశంలోని ఆరు వేదిక‌ల్లో (అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా) ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది.
IND vs ENG 4th Test 2021: స్పిన్‌ మ్యాజిక్‌ దెబ్బ, ఇంగ్లండ్ పని మూడు రోజుల్లోనే ఫినిష్, నాలుగో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ విజయం, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా
Hazarath Reddyస్పిన్‌ మ్యాజిక్‌కు దెబ్బకు మూడో రోజు ముగియకుండానే ఇంగ్లండ్ రెండోసారి చేతులెత్తేసింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించిన తరహాలోనే ఇంగ్లండ్‌ సొంతగడ్డపై ఇంగ్లీష్ టీంను కూడా ఇండియా చిత్తుగా ఓడించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన చివరి మ్యాచ్‌లో భారత్‌... ఇన్నింగ్స్, 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది.
AP Ex-Ranji Cricketer Held: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పుకుంటూ రూ. 40 లక్షలకు టోకరా, ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
Team Latestlyవివిధ కంపెనీలు మరియు కార్పోరేట్ ఆసుపత్రులకు సంబంధించిన వెబ్‌సైట్లలో ఇవ్వబడిన కాంటాక్ట్ నంబర్ల ఆధారంగా వారి కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించి ప్రభుత్వ టెండర్లకు ప్రతిపాదనలు చేస్తున్నాడు. ఇలా ఎల్‌బి స్టేడియంలో కంపెనీలకు సంబంధించిన హోర్డింగ్‌లు పెట్టడానికి మంత్రి నుంచి ప్రపోజల్...
Suraj Randiv: నాడు సెహ్వాగ్ సెంచరీకి అడ్డుపడిన శ్రీలంక క్రికెటర్, నేడు ఉపాధి కోసం ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్‌గా జీవనం, అతనితో పాటు మరికొందరు ఆటగాళ్లు సంపాదన కోసం డ్రైవర్ల అవతారం
Hazarath Reddyశ్రీలంక మాజీ ప్లేయర్ సూరజ్‌ రణ్‌దీవ్‌ (Former Sri Lanka cricketer Suraj Randiv) గుర్తున్నాడా... ఈ ఆఫ్ స్పిన్నర్ మనకు గుర్తు ఉండకపోవచ్చు కాని డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వగ్ కు అయితే తప్పక గుర్తుంటాడు. సెహ్వాగ్‌ (Virender Sehwag) సెంచరీ పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా ‘నోబాల్‌’ వేసిన బౌలర్‌గానే భారత అభిమానులందరికీ గుర్తు ఉండిపోతాడు.
IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్, మూడో టెస్టులో తొలి సెషన్‌‌లోనే ఆరు వికెట్లు లాస్, 28 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసిన ఇంగ్లండ్
Hazarath Reddyపింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్‌ జట్టుకు టీమిండియా బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు స్కోర్ 2 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఆటగాడు సిబ్లే డకౌట్ అయ్యాడు.
Motera Stadium Inauguration: మొతేరా స్టేడియం ఇకపై నరేంద్ర మోదీ స్టేడియం,పేరును మార్చి స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, నేడు ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్, స్టేడియం ప్రత్యేకతలపై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyగుజ‌రాత్‌లోని అహ్మదాబాద్ లో నిర్మించిన సర్దార్ పటేల్ (మొతేరా) స్టేడియంను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ బుధవారం వర్చువల్ ద్వారా (Motera Stadium Inauguration) ప్రారంభించారు. మోటెరా స్టేడియంను నరేంద్ర మోడీ స్టేడియం గా (Motera stadium, renames it Narendra Modi stadium) మార్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు.
IPL 2021 Auction: ఐపీఎల్ 14లో తలపడే ఎనిమిది జట్ల ప్లేయర్ల పూర్తి లిస్టు ఇదే, మొత్తం 57 మంది ఆటగాళ్లు వేలం, అందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు, మొత్తం లిస్టుపై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyక్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం నిన్న ముగిసింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో (IPL 2021 Auction) దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా రూ.16.25 కోట్లు ధరకు కొనుగోలు చేసింది.
IPL 2021: ఐపీఎల్ వేలంలో నలుగురు తెలుగు ప్లేయర్లు, తెలంగాణ నుంచి ఇద్దరు..ఏపీ నుంచి ఇద్దరు.. మరి ఈ యువ సంచలనాల గురించి మీకెవరికైనా తెలుసా.. ?
Hazarath Reddyఐపీఎల్ 2021 వేలంలో న‌లుగురు తెలుగు క్రికెట‌ర్ల‌ను ఫ్రాంచైజీలు త‌మ టీమ్‌ల‌లోకి ( 4 cricketers picked up in IPL auction) తీసుకున్నాయి. వారిలో ఇద్ద‌రు తెలంగాణ‌కు చెందిన వారు కాగా.. మ‌రో ఇద్ద‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందినవారు. వీళ్ల‌లో ముగ్గురు క్రికెట‌ర్లు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు..