క్రికెట్
RCB vs CSK Stat Highlights: వరుస ఓటముల తర్వాత చెన్నై విజయం, రాయల్ ఛాలెంజర్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచిన ధోనీ సేన, బ్యాటింగ్‌లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్
Hazarath Reddyవరుస ఓటములతో ఢీలా పడ్డ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎట్టకేలకు (RCB vs CSK Stat Highlights) మరో విజయాన్ని సాధించింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
RR vs MI Stat Highlights: ముంబైని ఉతికేసిన రాజస్థాన్, బెన్ స్టోక్ మెరుపు శతకంతో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, ఆకట్టుకున్న హార్థిక్ ఇన్నింగ్స్
Hazarath Reddyఐపీఎల్‌-13లో పటిష్ఠ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో అడపా దడపా విజయాలతో ఢీలా పడ్డ రాజస్తాన్‌ రాయల్స్‌ (RR vs MI Stat Highlights Dream11 IPL 2020) ఎట్టకేలకు భారీ విజయాన్ని సాధించింది. ముంబై (Mumbai Indians) నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్‌ సునాయాసంగా ఛేదించింది.
KXIP vs SRH Stat Highlights: ఒత్తిడితో చిత్తయిన హైదరాబాద్, 12 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపు, ఐపీఎల్‌లో వంద వికెట్ల క్లబ్ లోకి చేరిన సందీప్ శర్మ
Hazarath Reddyఐపీఎల్‌–2020లో మరో గేమ్ ఆసక్తికర సాగింది. గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా హైదరాబాద్‌ జట్టు చేజేతులా ఓటమితో మ్యాచ్ ని ముగించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో (KXIP vs SRH Stat Highlights) కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ఛేజింగ్ చేయాల్సిన మ్యాచ్ లో (IPL 2020) బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. కింగ్స్‌ పంజాబ్‌ 126 పరుగుల స్కోరును కాపాడుకుని భళా అనిపించింది. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో హైదరాబాద్ ఆరెంజ్‌ ఆర్మీ తేలిపోయింది.
CSK vs MI Stat Highlights: ఘోర పరాభవంతో ఐపీఎల్ నుంచి చెన్నై ఔట్! ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చతికిల పడిన ధోనీ సేన, 10 వికెట్ల తేడాతో ముంబై జయకేతనం
Hazarath Reddyఐపీఎల్‌లో ప్రతి ఏడాది ఎదురులేకుండా దూసుకువెళ్తున్న చెన్నై ఈ ఏడాది తడబడింది. ఐపీఎల్ ( IPL) చరిత్రలో కని వీని ఎరుగని పరాభవాన్ని మూటగట్టుకుంది. మూడుసార్లు విజేతగా, ఐదుసార్లు రన్నరప్, బరిలోకి దిగిన పది సీజన్లలో ప్రతీసారి కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరిన ఘనత కలిగిన ధోనీ సేన (Chennai Super Kings) ఈ ఏడాది ( Indian Premier League 2020) ఒక్కసారిగా చతికిలపడింది.
Kapil Dev Suffers Heart Attack: కపిల్‌దేవ్‌కు గుండెపోటు, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించిన వైద్యులు, భారత్‌కు తొలి వరల్డ్ కప్ అందించిన హర్యానా హరికేన్
Hazarath Reddyభారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు, హర్యానా హరికేన్ కపిల్‌దేవ్‌కు గుండెపోటు (Kapil Dev Suffers Heart Attack) వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు గుండె ఆపరేషన్‌ చేశారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు ప్రకటించారు.
RR vs SRH Match Highlights: ఆర్ డై మ్యాచ్‌లో దుమ్మురేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్ ఆశలు ఇంకా సజీవం, హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన మనీష్ పాండే, విజయ్ శంకర్
Team Latestlyస్కోర్ల వివరాలు: రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 154/6; సన్ రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 156/2; ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- మనీశ్ పాండే...
RCB vs KKR Match Highlights: అదరగొట్టిన హైదరాబాదీ బౌలర్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలవోక విజయం, ప్లేఆఫ్‌కు మరింత చేరువలో కోహ్లీ సేన
Team Latestlyసిరాజ్ వేసిన 4 ఓవర్లలో మొదటి రెండు మేయిడెన్ ఓవర్లు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒక బౌలర్ వరుసగా 2 మేయిడెన్ ఓవర్లు సాధించడం ఇదే తొలిసారి....
CSK vs RR Stat Highlights: ఇంటి దారికి మ్యాప్ సిద్ధం చేసుకుంటున్న చెన్నై, ఏడో పరాజయంతో ప్లే ఆఫ్‌ అవకాశాలు ఇక దాదాపు దూరమే, 7 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్
Hazarath Reddyఐపీఎల్‌లో ఆడిన 10 సార్లూ ప్లే ఆఫ్‌ చేసిన అరుదైన రికార్డు ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సారి ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో (CSK vs RR Stat Highlights IPL 2020) చెన్నై సూపర్‌కింగ్స్‌ చతికిలబడింది.
MI vs KXIP Stat Highlights: రెండు సూపర్ ఓవర్లతో సండే బ్లాక్ బాస్టర్ మ్యాచ్, ముంబైపై విజయం సాధించిన పంజాబ్, కింగ్స్ లెవన్‌ను గెలిపించిన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్
Hazarath Reddyసూపర్‌ ఓవర్‌ మీద సూపర్‌ ఓవర్‌ జరిగిన సండే మ్యాచ్‌లో (MI vs KXIP Stat Highlights IPL 2020)చివరకు పంజాబ్‌దే పైచేయి అయింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమాన స్కోర్లు చేయగా.. ఫలితం తేలేందుకు నిర్వహించిన సూపర్‌ ఓవర్‌ కూడా ‘టై’ అయింది.
RR vs RCB Stat Highlights: రాజస్థాన్‌ బౌలర్లను ఊచకోత కోసిన ఏబీ డివిలియర్స్‌, 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని బెంగుళూరు ఘన విజయం, ఆరో ఓటమితో సంక్లిష్టంగా మారిన రాయల్స్‌ ఆశలు
Hazarath Reddyగెలుపుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో సిక్సర్లతో తన మార్క్‌ విధ్వంసం సృష్టించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును (Royal Challengers Bangalore) ఏబీ డివిలియర్స్‌ విజేతగా నిలిపాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 22 బంతుల్లో ఆరు భారీ సిక్సర్లతో ఆర్‌సీబీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.
DC vs CSK Highlights: ప్లేఅఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న చెన్నై, 5 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం, అజేయ శతకంతో చెలరేగిన శిఖర్‌ ధవన్‌, మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌
Hazarath Reddyఐపీఎల్‌లో తమ జోరును కొనసాగిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో (Delhi Capitals Beat Chennai Super Kings by Five Wickets) చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో (DC vs CSK Highlights Dream11 IPL 2020) ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగాడు. ఇక ఆరు ఓటములతో చెన్నై తమ ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది.
MI vs KKR Stat Highlights: కేకెఆర్‌పై వరుసగా 11 సార్లు గెలిచిన ముంబై, తాజాగా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం, ముంబై తరపున బ్యాటింగ్‌లో దుమ్మురేపిన డికాక్
Hazarath Reddyకోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియ‌న్స్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని (MI vs KKR Stat Highlights IPL 2020) ప్రదర్శించింది. బౌలర్లు.. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో రోహిత్‌ సేన 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా 5 విజయాలు తన ఖాతాలో వేసుకుంది. కేకేఆర్‌పై చివరి 12 మ్యాచ్‌ల్లో ముంబైకిది 11వ గెలుపు కావడం విశేషం. అలాగే ఈ విజయంతో తిరిగి ముంబై 12 పాయింట్లతో టాప్‌కు చేరింది.
RCB vs KKR Stat Highlights: అదేం బాదుడయ్యా డివిలియర్స్, కోలకతాను ఉతికేసిన బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, 82 పరుగుల తేడాతో భారీ విజయం, మూడో ఓటమితో నిలిచిన కేకేఆర్‌
Hazarath Reddyకోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (RCB vs KKR Stat Highlights IPL 2020) రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ను 112 పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers) కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడిన పడగా, విరాట్‌ కోహ్లీ (Virat Kohli) నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌కే పరిమితమై సహచరుడికి పూర్తి సహకారం అందించండం.. ఇక బౌలర్లు సమిష్టిగా కదం తొక్కడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB) అద్భుత విక్టరీ నమోదు చేసింది.
IPL betting Racket Busted in Hyd: రూ. 16 కోట్ల‌ ఐపీఎల్ బెట్టింగ్, హైద‌రాబాద్ న‌గ‌రంలో ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, క్రికెట్‌ మజా11 మొబైల్‌ యాప్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌
Hazarath Reddyఐపీఎల్ మ్యాచ్‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను సిటీ పోలీసులు అరెస్టు (IPL betting Racket Busted in Hyd) చేశారు. బెట్టింగ్ ముఠా నుంచి రూ. 16 కోట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ‌, ఢిల్లీ, ముంబై, రాజ‌స్థాన్ కేంద్రంగా ఈ ముఠా బెట్టింగ్ దందా నిర్వ‌హిస్తోంది. దేశ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు పోలీసులు తేల్చారు. బెట్టింగ్ రాకెట్ న‌డుపుతున్న గ‌ణేష్‌, సురేశ్‌, పంక‌జ్, స‌త్త‌య్య‌తో పాటు మ‌రో ముగ్గురు అరెస్టు (Police Arrested Cricket Betting Gangs) చేశారు.
SRH vs RR Stat Highlights: తెవాటియా దూకుడు, సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ రాయల్స్‌ ఘన విజయం, హైదరాబాద్‌ను గట్టెక్కించలేకపోయిన వార్నర్, మనీశ్‌ల అద్బుత బ్యాటింగ్
Hazarath Reddyఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో (SRH vs RR Stat Highlights Dream11 IPL 2020) రాయల్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (Sunrisers Hyderabad vs Rajasthan Royals) తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మనీష్ పాండే (44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 54), కెప్టెన్ వార్నర్ (38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. బెయిర్‌స్టో 16, విలియమ్సన్ 22, ప్రియంగార్గ్ 15 పరుగులు చేశారు.
MI vs DC Stat Highlights: వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన ముంబై, మూడు మ్యాచుల తరువాత పరాజయాన్ని చవిచూసిన ఢిల్లీ, ఒంటరి పోరాటంతో ఢిల్లీని గెలిపించలేకపోయిన శిఖర్ ధావన్
Hazarath Reddyఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MI vs DC Stat Highlights Dream11 IPL 2020) ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే (Mumbai Indians Win by Five Wickets) ఛేదించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ మూడు మ్యాచుల తరువాత పరాజయం చవి చూసింది. అయితే ముంబై మాత్రం వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల టేబుల్లో అగ్రస్థానానికి చేరింది.
KXIP vs KKR Stat Highlights: ఐపీఎల్‌లో ఉత్కంఠ రేపిన మ్యాచ్ ఇదే, పంజాబ్‌పై అనుకోని రీతిలో విజయం సాధించిన కోల్‌కతా, బంతితో మాయ చేసిన నైట్ రైడర్స్ బౌలర్లు
Hazarath Reddyవరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ లక్ష్యాన్ని (KXIP vs KKR Stat Highlights) కాపాడుకుంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సత్తా చాటింది. శనివారం పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో (KXIP vs KKR Stat Highlights Dream11 IPL 2020) కోల్‌కతా 2 పరుగులతో విజయం సాధించింది.కాగా కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయలేక అభిమానులు అయోమయంలో పడిపోయారు.
CSK vs RCB Stat Highlights: కోహ్లీ దూకుడుతో నాలుగో విజయాన్ని నమోదు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌, వరుసగా మూడో మ్యాచులో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్
Hazarath Reddyచెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ 37 పరుగుల తేడాతో విజయం (CSK vs RCB Stat Highlights) సాధించింది. చెన్నైను 132 పరుగులకే కట్టడి చేసిన కోహ్లి సేన అదరహో అనిపించింది. సీఎస్‌కే జట్టులో (Chennai Super Kings) అంబటి రాయుడు(42; 40 బంతుల్లో 4 ఫోర్లు), జగదీషన్‌(33;28 బంతుల్లో 4ఫోర్లు)లు మాత్రమే ఆడగా, మిగతా వారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు అద్భుత ప్రదర్శనతో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో ఏ మాత్రం కుదురుకోనివ్వలేదు.
RR vs DC, IPL 2020 Match Result: ఢిల్లీ హ్యట్రిక్ విజయం, రాజస్థాన్‌కు నాలుగో పరాభవం, 46 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్‌పై ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌
Hazarath Reddyఢిల్లీ క్యాపిటల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని (RR vs DC, IPL 2020 Match Result) నమోదు చేసుకుంది. షార్జా పిచ్‌పై లక్ష్యఛేదనలో వెనుకబడిన రాజస్థాన్‌ రాయల్స్‌ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం ఇక్కడ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ( RR vs DC Dream11 IPL 2020) ఢిల్లీ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది.
KKR vs CSK Stat Highlights: బ్యాటింగ్‌లో మరోసారి ఘోరంగా విఫలమైన చెన్నై, 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘన విజయం, కోల్‌కతాను గెలిపించిన రాహుల్‌ త్రిపాఠి మెరుపులు
Hazarath Reddyబ్యాటింగ్‌ వైఫల్యంతో ధోనీ సేన మరోసారి ఓడింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో (KKR vs CSK Stat Highlights Dream11 IPL 2020) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) చేతిలో పరాజయం పాలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) రాహుల్‌ త్రిపాఠి (51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) అర్ధ శతకం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై(Chennai Super Kings) ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి ఓడింది.