Cricket

Rahul Dravid: వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా ఓట‌మిపై రాహుల్ ద్ర‌విడ్, రోహిత్ శ‌ర్మ‌ల‌ను వివ‌ర‌ణ కోరిన బీసీసీఐ, అప‌జ‌యానికి గ‌ల కార‌ణాల‌పై బోర్డుకు ద్ర‌విడ్ సుదీర్ఘ వివ‌ర‌ణ‌

VNS

అటు బ్యాట‌ర్ల‌కు గానీ, ఇటు బౌల‌ర్ల‌కు గానీ ఏ మాత్రం స‌హ‌కారం ల‌భించ‌లేద‌న్నాడు. రోహిత్ శ‌ర్మ కూడా ఇదే విష‌యం చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. లీగ్ ద‌శ‌లో పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌కు ఉప‌యోగించిన పిచ్ పైనే భారత జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌డం గ‌మ‌నార్హం. పాకిస్తాన్‌తో మ్యాచులో భార‌త జ‌ట్టు ఈజీగానే విజ‌యం సాధించింది.

IND vs AUS 4th T20I:టీ-20 సిరీస్ భార‌త్ కైవ‌సం, మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ చేజిక్కింకున్న టీమిండియా, చెల‌రేగిన రింకూ సింగ్, ఆసిస్ న‌డ్డివిరిచిన అక్ష‌ర్ ప‌టేల్

VNS

రాయ్‌పుర్‌ లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో (IND Vs AUS) జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచులో 20 ప‌రుగుల తేడాతో భార‌త్ (India Win) విజ‌యం సాధించింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భార‌త్ 3-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

Ruturaj Gaikwad: అరుదైన రికార్డు సృష్టించిన టీమిండియా యువ ఓపెన‌ర్, టీ-20ల్లో 4వేల క్ల‌బ్ లోకి రుతురాజ్ గైక్వాడ్

VNS

భార‌త యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) మ‌రో మైలురాయికి చేరువ‌య్యాడు. టీ20ల్లో వేగంగా 4 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరాడు. పొట్టి ఫార్మాట్‌లో వేగంగా 4 వేల ర‌న్స్ కొట్టిన ఐదో క్రికెట‌ర్‌గా గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. రాయ్‌చూర్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టీ20లో గైక్వాడ్ ఈ ఫీట్ సాధించాడు

Mitchell Marsh Controversy: అందులో త‌ప్పేముంది! వ‌ర‌ల్డ్ క‌ప్ పై కాళ్లు పెట్ట‌డాన్ని స‌మ‌ర్ధించుకున్న ఆస్ట్రేలియా క్రికెట‌ర్, మ‌రోసారి వార్త‌ల్లోకి మిచెల్ మార్ష్

VNS

నేను సోషల్ మీడియాను ఎక్కువ‌గా చూడ‌ను. ప్ర‌పంచ‌క‌ప్ పై నేను కాళ్లు పెట్టి దిగిన ఫోటో వైర‌ల్ అయ్యింది. దీని గురించి నా స్నేహితులు చెప్పారు. అయితే.. అందులో నాకు ఎలాంటి అగౌర‌వం క‌నిపించ‌లేదు.’ అని మార్ష్ వెల్ల‌డించాడు. మార్ష్ చేసిన ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు.

Advertisement

India Tour of SA: డిసెంబర్‌ 10 నుంచి టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభం...సఫారీ పర్యటన జట్టు ఖరారు

ahana

భారత క్రికెట్ జట్టు డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. అక్కడ భారత క్రికెట్ జట్టు 3 టీ20, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్‌లో తొలి టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టీ20 మ్యాచ్‌ డిసెంబర్‌ 10న డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరగనుంది.

Telangana Assembly Election 2023: ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ భారత కెప్టెన్ ముహమ్మద్ అజహరుద్దీన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి , మాజీ ఇండియన్ క్రికెటర్ ముహమ్మద్ అజహరుద్దీన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

BCCI: టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పొడిగిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం, సహాయక సిబ్బంది కాంట్రాక్ట్ కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, టీం ఇండియా (సీనియర్ మెన్) సహాయక సిబ్బందికి కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మరియు ODI ప్రపంచ కప్ రెండింటిలోనూ భారతదేశం రన్నరప్‌గా నిలిచిన ద్రావిడ్, అతని కోచింగ్‌లో, గత రెండేళ్లలో మంచి రికార్డును కలిగి ఉన్నాడు.

IND VS AUS 3rd T20I : భారత్ చేతుల్లోంచి చివరి ఓవర్లో మ్యాచ్ లాగేసుకున్న మాక్స్ వెల్...3వ టీ20 మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం..

ahana

టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది.

Advertisement

T20 World Cup 2024: వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు అర్హత పొందిన జట్లు ఇవిగో, తొలిసారిగా బరిలోకి అమెరికా జట్టు, చివరి నిమిషంలో క్వాలిఫై అయిన నమీబియా

Hazarath Reddy

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ఇప్పటివరకు 19 జట్లు అర్హత పొందాయి. 2022 టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో రెండు గ్రూపుల్లో టాప్-4లో నిలిచిన మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి.బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీలో ఆడేందుకు బెర్తులు దక్కించుకున్నాయి.

Gujarat Titans New Captain: గుజరాత్‌ టైటాన్స్‌ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు బదిలీ

Hazarath Reddy

2024 ఐపీఎల్‌ సీజన్‌ కోసం గుజరాత్‌ టైటాన్స్‌ తమ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ను ప్రకటించింది. గత రెండు సీజన్లలో గిల్‌ తమ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడని, బ్యాటర్‌గానే కాకుండా అన్ని విషయాల్లో పరిణతి సాధించాడని ఫ్రాంచైజీ డైరెక్టర్‌ విక్రమ్‌ సోలంకీ అన్నాడు.

Yashasvi Jaiswal: ఆసిస్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన య‌శ‌స్వి జైస్వాల్, టీ-20ల్లో అరుదైన రికార్డు సృష్టించిన భార‌త ఆట‌గాడు

VNS

భార‌త యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) చ‌రిత్ర సృష్టించాడు. టీ20ల్లో ప‌వర్ ప్లేలో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన భార‌త ఆట‌గాళ్ల‌లో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఆదివారం తిరువ‌నంత‌పురంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 (T-20) మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది.

Mohammed Shami : కారు ప్రమాదం జరిగి లోయలో పడిపోయిన వ్యక్తిని కాపాడిన క్రికెటర్ మహ్మద్ షమీ..శభాష్ అంటున్న నెటిజన్లు..

ahana

క్రికెటర్ మహ్మద్ షమీ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. షమీ తన కారులో నైనిటాల్ హిల్ స్టేషన్‌కు వెళుతుండగా, కొండపై నుండి కారు పడిపోవడం చూశాడు. ప్రమాదానికి గురైన ప్రాంతానికి వెంటనే వెళ్లి.. 33 ఏళ్ల వ్యక్తిని కారు నుంచి బయటకు తీసుకుని.. అక్కడి నుంచి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

IND Vs AUS T20: నేడు భారత్‌, ఆస్ట్రేలియా రెండో టీ20.. సాయంత్రం 7.00 నుంచి మ్యాచ్.. ఆటకు వరణుడి ముప్పు??

Rudra

వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమి అనంతరం ఆడిన తొలి టీ20లో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. వైజాగ్‌ లో రికార్డు స్కోరు చేజ్‌ చేసిన యువభారత జట్టు.. నేడు తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది.

Rahul Dravid As LSG Mentor: టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి రాహుల్ ద్రవిడ్ గుడ్ బై చెప్పిన‌ట్లేనా? ల‌క్నో టీమ్ మెంట‌ర్ గా వెళ్లేందుకే ద్ర‌విడ్ ఆస‌క్తి, హెడ్ కోచ్ గా హైద‌రాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మెన్

VNS

టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వి కాలం ముగిసింది. అయితే.. భార‌త క్రికెట్ కోచ్‌గా అత‌డు మ‌ళ్లీ కొన‌సాగుతాడా..? లేదా అన్న అంశం పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

IND Vs AUS 2nd T20i: ఆసిస్ తో రెండో టీ-20 మ్యాచ్ కు వ‌రుణ‌గండం, ప్రాక్టీస్ కూడా చేయ‌లేక‌పోయిన ఇరు జ‌ట్లు

VNS

క్రికెట్ అభిమానుల‌కు ఓ బ్యాడ్‌న్యూస్ ఇది. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. మ్యాచ్ జ‌ర‌గ‌నున్న గ్రీన్ ఫీల్డ్ మైదానంలో గ‌త కొద్ది రోజులుగా వ‌ర్షాలు (Pitch Report) కురుస్తున్నాయి. దీంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. దీంతో శ‌నివారం ఇరు జ‌ట్లు ప్రాక్టీస్ కూడా చేయ‌లేక‌పోయాయి.

Complainant on Mitchell Marsh : వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీపై కాళ్లు పెట్టినందుకు ఆస్ట్రేలియా క్రికెట‌ర్ పై కేసు న‌మోదు, 140 కోట్ల‌మంది భార‌తీయులను అవ‌మానించారంటూ ఫిర్యాదు

VNS

ఉత్తరప్రదేశ్‌ (UP)కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్‌ పండిట్‌ కేశవ్ ( RTI activist Pandit Keshav)‌.. మార్ష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ట్రోఫీని అవమానించడమే కాక.. 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేశవ్‌ ఫిర్యాదును స్వీకరించిన ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌ (Aligarh) పోలీసులు మార్ష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Advertisement

IND vs AUS 1st T20I: చివరి బంతికి సిక్స్ కొట్టి వైజాగ్‌లో తొలి టీ 20 మ్యాచ్ గెలిపించిన రింకూసింగ్..ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా..

ahana

T20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 2 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా అభిమానులకు ఉపశమనం కలిగించింది.

Shami on Rahul's Remarks on PM Modi: రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై స్పందించిన మొహమ్మద్ షమీ, ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూం సమావేశం జట్టుకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందని వెల్లడి

Hazarath Reddy

ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఈరోజు అమ్రోహాలోని తన గ్రామం సహస్‌పూర్ అలీనగర్‌కు చేరుకుని అక్కడ విలేకరులతో మాట్లాడారు.

Sreesanth Booked in Cheating Case: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌పై ఛీటింగ్ కేసు నమోదు, స్పోర్ట్స్ అకాడమీ పేరుతో రూ.18.70 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు

Hazarath Reddy

టీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ పై ఓ చీటింగ్ కేసు నమోదైంది. శ్రీశాంత్ తో పాటు రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ అనే వ్యక్తులపై ఉత్తర కేరళ జిల్లాలో చీటింగ్ కేసు నమోదు చేశారు. సురేశ్ గోపాలన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

IND Vs AUS: వరల్డ్ కప్‌ ఫైనల్‌ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా? నేటి నుంచి ఆసిస్‌తో టీ-20 సిరీస్‌, ఫస్ట్ మ్యాచ్‌ కోసం సర్వం సిద్ధం

VNS

ఇటీవల సిరీస్‌లో సెలెక్టర్లు సీనియర్లను తప్పిస్తూ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యువకులకు జాతీయజట్టులో చోటు కల్పిస్తున్నారు. మెగాటోర్నీ నాటికి టీమ్‌ఇండియా 11 టీ20 మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముంది. ముఖ్యంగా వన్డే జట్టుకు భిన్నంగా ప్రస్తుత టీ20 టీమ్‌లో ఎడమచేతి వాటం ప్లేయర్లు బాగా ఉన్నారు.

Advertisement
Advertisement