ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా ఫ‌స్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ కూప‌ర్ కొన‌ల్లీ తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు.షమీ బౌలింగ్‌లో కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చిన కూపర్‌ డకౌట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక రెండో వికెట్ గా హార్డ్‌ హిట్టర్‌, ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ అవుటయ్యాడు.వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో ఆసీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మార్నస్‌ లబుషేన్‌ క్రీజులోకి వచ్చాడు.

వీడియో ఇదిగో, ఫస్ట్ బాల్‌కే ట్రావిస్ హెడ్‌ డకౌట్ అయ్యే క్యాచ్ వదిలేసిన మొహమ్మద్ షమీ, ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా బ్యాటర్

భారత్‌

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి, మహ్మద్‌ షమీ, కుల్దీప్ యాదవ్.

ఆస్ట్రేలియా

కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.

Travis Head Wicket Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)