ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అవుటయ్యాడు. షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయి 73 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో 96 బంతుల్లో అతను 73 రన్స్ చేసి నిష్క్రమించాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. రవీంద్ర జడేజా బౌలింగ్ జోష్ ఇంగ్లిస్ విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఫలితంగా ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 బంతులు ఎదుర్కొన్న ఇంగ్లిస్ 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆసీస్ బిగ్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను అనూహ్య రీతిలో అక్షర్ బౌల్డ్ చేశాడు. ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి మాక్సీ నిష్క్రమించాడు.
Josh Inglis Wicket Video:
𝙅𝘼𝘿𝙀𝙅𝘼 𝙏𝘼𝙆𝙀𝙎 𝙃𝙄𝙎 2𝙣𝙙 🤪
Josh Inglis graciously gives Jadeja a return gift, his own wicket! 👀#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳🆚🇦🇺 LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!
📺📱 Start Watching FREE on JioHotstar:… pic.twitter.com/FDSutQsBuf
— Star Sports (@StarSportsIndia) March 4, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)