రాష్ట్రీయం
Ram Gopal Varma: పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు, మరో బాంబు పేల్చిన వర్మ, ఎక్స్‌లో ప్రశ్నలు సంధించిన వివాదాస్పద దర్శకుడు
Hazarath Reddyవిచారణకు హాజరు కావాలంటూ రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా దీనిపై వర్మ ఎక్స్ వేదిగా ఓ స్టోరిని వదిలాడు ఆ స్టోరీలో వర్మ.. అన్ని న్యూస్ ఛానళ్లను ట్యాగ్ చేశారు. పాయింట్ల వారీగా అందులో రాసుకొచ్చారు.
Jagan on Power Agreements: విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో లక్ష కోట్లు ప్రజల మీద భారం పడకుండా చేశాం, నేను హిస్టరీ క్రియాట్ చేసినందుకు నాపై బురద చల్లుతారా..
Hazarath Reddyవిద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని స్పష్టం చేశారు.
Allu Arjun: డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం అంటూ వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని పిలుపు
Hazarath Reddyడ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం అంటూ ఎక్స్ వేదికగా అల్లుఅర్జున్ వీడియో షేర్ చేశారు. ఇందులో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. ఆయన ఎక్స్ వేదికగా ఈ స్పెషల్ వీడియో షేర్ చేశారు.
Jagan Slams Chandrababu Govt: విద్యుత్ కొనుగోలు ఒప్పందం చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం, బురద జల్లుతూ రాతలు రాయడంపై మండిపడిన జగన్, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఈ రోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. హామీల అమలు లేకపోగా.. స్కాంల పాలన నడుస్తోందని అన్నారు.
Khammam: హాస్టల్‌లో సీనియర్ వర్సెస్ జూనియర్‌ల మధ్య ఘర్షణ..మద్యం తాగి వచ్చాడని జూనియర్‌ను అనుమతించని సీనియర్లు..గొడవ పెరిగి కర్రలతో దాడి..వీడియో ఇదిగో
Arun Charagondaగురుకుల హాస్టల్ లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఖమ్మం నగరంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ లో సీనియర్, జూనియర్ల మధ్య ఘర్షణ జరిగింది. నిన్న రాత్రి మద్యం తాగి వచ్చాడని జూనియర్ వేణును హాస్టల్ లోకి అనుమతించలేదు సీనియర్లు. దీంతో వేణు, సీనియర్ల మధ్య వాగ్వాదం జరుగగా వేణుపై కర్రలతో దాడి చేశారు సీనియర్లు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
YouTuber Arrest: ఉడుమును చంపి వండుకుని తిన్న వీడియోని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరెస్ట్, పోలీసులకు ఫిర్యాదు చేసిన యానిమల్ పరిరక్షణ సభ్యుల కంప్లైంట్
Hazarath Reddyలైక్‌ల కోసం ఉడుమును వండిన వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. యానిమల్ ఆక్ట్ కింద అరెస్ట్ చేశారు పోలీసులు. మన్యం పార్వతీపురం మండలంలో ఉడుమును వండుకుని, తిని ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్లు చీమల నాగేశ్వరరావు, నాని బాబు
Telangana: ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫుడ్ సేఫ్టిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.. కమిటీ సభ్యులు తిన్నాకే పిల్లలకు ఆహారం పెట్టాలని ఆదేశం
Arun Charagondaతెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టల్, గురుకులాలు, అంగన్ వాడీ కేంద్రాలు, హాస్పటల్స్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రిన్సిపాల్ / వార్డెన్, మరో ఇద్దరు సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసింది.
MLC Jeevan Reddy: గురుకుల సిబ్బందిపై ఎమ్మెల్సీ జీవన్ ఫైర్..అల్లీపూర్ గురుకులాన్ని తనిఖీ చేసిన జీవన్ రెడ్డి..నాసిరకం భోజనం పెడతారా అని సిబ్బందిపై మండిపాటు
Arun Charagondaగురుకుల సిబ్బందికి చివాట్లు పెట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు జీవన్ రెడ్డి. ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటున్నారు. పిల్లలకు సరిపడా భోజనం పెట్టడానికి ఏంటి కష్టం అని ప్రశ్నించారు.అన్నం ఉడకలేదు... నీళ్ల పప్పు, నీళ్ల చారు పిల్లలకు ఎందుకు వడ్డిస్తున్నారు? అని మండిపడ్డారు. మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా, నెలలో ఒకే రోజు నాన్ వెజ్ పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy: సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేయాలని సూచించిన తెలంగాణ సీఎం
Arun Charagondaయావత్ దేశానికి మార్గాన్ని నిర్దేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు.
Hyderabad: వామ్మో..చికెన్ కబాబ్‌లో ఎలుక మలం, లక్డికపూల్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు
Hazarath Reddyలక్డికాపూల్‌లో ఆహార భద్రత దాడుల్లో ఎలుకల మలం, సజీవ బొద్దింకలు కనుగొనబడ్డాయి. ప్రసిద్ధ బడేమియా కబాబ్ కూడా నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించబడింది. పేలవమైన పరిశుభ్రత, భద్రతా ప్రమాణాల గురించి దిగ్భ్రాంతికరమైన వెల్లడిలో, ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ లక్డికాపూల్‌లోని మూడు ప్రముఖ తినుబండారాలపై దాడులు నిర్వహించింది
Andhra Pradesh: వీడియో ఇదిగో, డ్రోన్లతో పోలీసుల నిఘా పెట్టడంతో పరుగులు పెట్టిన జూదగాళ్లు, మందుబాబులపై నాలుగు కేసులు
Hazarath Reddyఅనంతపురం శివారు కాలనీలు, పరిసర ప్రదేశాలలో కొనసాగిన డ్రోన్ల నిఘా... ఓపెన్ డ్రింకింగ్ కేసు నమోదు. అనంతపురం వన్, ఫోర్త్ మరియు రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిల్లోని శివారు కాలనీలు, పరిసర ప్రదేశాలలో ఆయా పోలీసులు ఈరోజు కూడా డ్రోన్లతో నిఘా పెట్టారు.
Cyclone Fengal: నెల్లూరు, తిరుపతి జిల్లాలను వణికిస్తున్న ఫెంగల్ తుఫాను, సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Hazarath Reddyకోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు.
Cyclone Fengal Alert: ఫెంగల్ తుఫాను ముప్పు, సహాయక చర్యల కోసం అప్రమత్తమైన భారత నౌకాదళం, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలను వణికించనున్న సైక్లోన్
Hazarath Reddyహిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది
CM Revanth Reddy: వసతి గృహాల ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం, తప్పుడు ప్రచారం చేస్తే శిక్షిస్తామని హెచ్చరిక
Arun Charagondaవసతిగృహాల్లో తరచూ ఘటనలు చోటుచేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలి కలెక్టర్‌లను ఆదేశించారు. ఆదేశం. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలన్నారు.
Telangana: అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు..మహబూబాబాద్ బస్ డిపో సిబ్బందిపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం...వీడియో ఇదిగో
Arun Charagondaఅయ్యప్ప దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపో సెక్యూరిటీ సిబ్బందిపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల ధరించిన వారికి పరీక్షలు ఏంటని ప్రశ్నించినవారిపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించారని ...ఈ రోజు డిపో ముట్టడికి పిలుపునిచ్చారు.
Andhra Pradesh: పలాసలోని షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం, రిమోట్ కంట్రోల్ సిస్టమ్ కాలిపోవడంతో మంటలు వ్యాప్తి..రూ. 3 కోట్ల ఆస్తి నష్టం!
Arun Charagondaశ్రీకాకుళం జిల్లా పలాసలోని జాస్మిన్ బట్టల షాపులో అగ్నిప్రమాదం జరిగింది. షాపు నుంచి దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు స్థానికులు. రిమోట్ కంట్రోల్ సిస్టం కాలిపోడంతో షట్టర్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుంది ఫైర్ సిబ్బంది. సుమారు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం.
Andhra Pradesh: మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ ఇంట్లో ఏసీబీ రైడ్స్, ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో దాడులు..
Arun Charagondaవైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణదాస్ గతంలో ప్రభుత్వ పీఏగా పనిచేసిన మురళి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. మురళికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు నేపథ్యంలో ఈ దాడులు జరుపుతున్నారు.
Andhra Pradesh: నిద్రలేకుండా చేస్తున్న నాగుపాము...కొంతకాలంగా ఇళ్ల మధ్య సంచరిస్తున్న పాము..ఎట్టకేలకు పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్..వీడియో
Arun Charagondaఏపీలోని మహానంది మండలం తమ్మడపల్లెలో గ్రామస్తులకు నిద్రలేకుండా చేసింది నాగుపాము. కొంతకాలంగా ఇళ్ల మధ్య సంచరిస్తుండగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నిన్న అర్ధరాత్రి చాకచక్యంగా పామును బంధించారు స్నేక్ స్నాచర్ మోహన్. నాగుపాము పట్టుబడటంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్థులు.
Telangana: సాంబారు,చట్నీలో బొద్దింక..మహబూబ్ నగర్ ఎస్సీ బాలికల హాస్టల్‌లో కలకలం...విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థులకు బెదిరింపులు
Arun Charagondaమహబూబ్ నగర్ - పాలమూరులోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో సాంబారు, చట్నీలో బొద్దింక రావడం కలంకలం రేపింది. ఈ విషయమై వంట సిబ్బందిని అడిగితే ఇంట్లో బొద్దింక వస్తే తీసేసి తినమా అంటూ విద్యార్థులను బెదిరించారు వంట సిబ్బంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంబారులో బొద్దింక వచ్చిందంటే ప్లేట్లోంచి పడేసి తినాలని సిబ్బంది చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శమని మండి పడ్డారు.
Harish Rao On Rythu Bharosa: రైతు భరోసా భోగస్..కనీస మద్దతు ధర ఏది?, రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Arun Charagondaప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు రైతుపండగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది.కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.