రాష్ట్రీయం

Nara Lokesh Key Comments: ఏపీలో ఇక‌పై వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్, కేబినెట్ స‌బ్ క‌మిటీలో కీల‌క నిర్ణ‌యం, ప్ర‌తిపాదించిన నారా లోకేష్

VNS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కట్టడికి ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు. గంజాయి(Ganja), డ్రగ్స్ పై (Drugs) ఇక యుద్ధమే అన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్నారు లోకేశ్.

BRS Gurukula Bata: రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ స‌మ‌ర‌శంఖం, గురుకుల బాట‌కు పిలుపునిచ్చిన కేటీఆర్

VNS

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గురుకుల బాట (Gurukula Bata) కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు(KGBVB), మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పరిశీలించనున్నారని తెలిపారు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, నెల్లూరుకు చెందిన హిజ్రా లీడర్ హాసిని దారుణ హత్య, రెండు కార్లలో వచ్చి..

Hazarath Reddy

హిజ్రాల నాయకురాలు హాసిని మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టపాతోపు వద్ద దుండగులు దారికాచి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. హిజ్రా నాయకురాలు హాసినిని చంపేందుకు దుండగులు రెండు కార్లలో వచ్చినట్టు సమాచారం.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, సరోగసి కోసం ఇంటికి పిలిచి లైంగిక వేధింపులు, అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తుపై నుండి దూకి చనిపోయిన మహిళ

Hazarath Reddy

హైదరాబాద్ మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ (25) అనే మహిళ మృతిచెందింది. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగను రాజేష్ బాబు అనే వ్యక్తి తెచ్చుకున్నారు.

Advertisement

Raghu Rama Krishna Raju Harassment Case: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు, సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్

Hazarath Reddy

ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయపాల్ ను నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనను గుంటూరు తరలించి, కోర్టులో హాజరుపరిచారు.

Telangana: మానవత్వమా నువ్వెక్కడా?, కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు..కాలు విరిగి ఎనమిది రోజులుగా స్మశానంలోనే వృద్ధురాలు...వీడియో వైరల్

Arun Charagonda

మానవత్వం మంటగలిసింది. జగిత్యాలలో కన్నతల్లిని స్మశానంలో వదిలేశారు కసాయి కొడుకులు. గత ఎనిమిది రోజులుగా స్మశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ ఉంది. పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చితకబాదాడు కుమారుడు. కాలు విరగడంతో అచేతన స్థితిలో రాజవ్వ ఉండగా నలుగురు కొడుకులు ఉన్నా ఏం ప్రయోజనం లేదని వాపోయింది. అధికారులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తరలించారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రమాదకర బల్లులు కలకలం, థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా భారత్‌‌కు తీసుకువస్తున్న ఇద్దరు అరెస్ట్

Hazarath Reddy

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు(Visakhapatnam Airport)లో ప్రమాదకర బల్లులు స్మగ్లింగ్ కలకలం రేపింది. డీఆర్‌ఐ, అటవీ సర్వీస్‌ అధికారుల(DRI and Forest Service Officers) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ప్రమాదకర బల్లులు తరలిస్తున్నట్లు గుర్తించారు. మూడు నీలి రంగు నాలుక బల్లులు, మూడు విదేశీ బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Telangana: అవమానం భరించలేక మంజీరా నదిలో దూకిన తల్లీకొడుకులు మృతి, ఆటో దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తీవ్ర మనస్థాపం

Hazarath Reddy

దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలంలో చోటు చేసుకుంది.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, కూకట్‌పల్లిలో సోదరిని వేధించినందుకు యువకుడిని హత్య చేసిన అన్న, చపాతీ కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీ తాగేందుకు వచ్చిన తమ సోదరి పై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Student Dies by Suicide: తీవ్ర విషాదం, వనపర్తి గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న 7వ తరగతి విద్యార్థి, దుప్పటితో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని సూసైడ్

Hazarath Reddy

తెలంగాణలో వనపర్తి (Vanaparthy) జిల్లా మదనాపురం మండలం ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని పొన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్‌ గురుకుల పాఠశాలలో లో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు జోవనోపాధి కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

Dilawarpur Protest: రైతుల ఆందోళనతో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ప్రభుత్వ ఆదేశం, లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్

Arun Charagonda

రైతు తిరుగుబాటుతో దిగొచ్చింది కాంగ్రెస్ సర్కార్. దిలావర్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు కలెక్టర్ అభిలాష అభినవ్. వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించారు కలెక్టర్ . అయితే కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చినా రైతులు ఆందోళన విరమించడం లేదు. ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని డిమాండ్ చేశారు.

CCTV Footage: వీహెచ్‌ కారును ఢీకొట్టిన కారు...అర్థరాత్రి ఘటన, వైరల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజ్

Arun Charagonda

కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కారును ఢీకొట్టింది కారు. తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టి ధ్వంసం చేసింది మరొక కారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌గా మారగా పోలీసులకు ఫిర్యాదు చేశారు వి.హనుమంతరావు.

Advertisement

MLC Kavitha: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన ఎమ్మెల్సీ కవిత, అక్రమ అరెస్ట్‌లతో ప్రజా తిరుగుబాటు అణివేయడం మూర్ఖత్వం అని మండిపాటు

Arun Charagonda

బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కవిత...చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోంది. మాగునూరు జెడ్పీ హైస్కూల్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపింది కాంగ్రెస్ సర్కార్ అని మండిపడ్డారు.

Warangal: ఉచిత బస్సు ప్రయాణం కోసం చీర కట్టి దివ్యాంగుల నిరసన, వరంగల్‌లో చీరలు కట్టి దివ్యాంగుల ప్రయాణం...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

చీరలు కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపారు దివ్యాంగులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లల్లో కూడా మహిళలే కూర్చుంటున్నారని.. తమకు ఉచిత ప్రయాణం కల్పించి, 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరలు కట్టుకొని దివ్యాంగులు నిరసన తెలిపారు.

Telangana: ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు..దిలావర్‌పూర్‌లో రైతుల ఆందోళన,ఆర్డీవో కారు ధ్వసం, రైతుల అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

Arun Charagonda

లగచర్ల లొల్లి మరువకముందే దిలావర్‌పూర్‌లో మొదలైంది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని ఆమెను ఆరు గంటలు పైగా రైతులు నిర్బంధించారు.

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి బుధవారం నాటికి 'ఫెంగల్' తుఫానుగా (Cyclone Fengal) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తమిళనాడులోని ప్రాంతాలకు తీవ్ర వర్షపాత హెచ్చరికను ప్రకటించింది.

Advertisement

V Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు కారుపై దాడి, ఇంటి ముందు పార్క్‌ చేసిన కారుపై రాళ్ల దాడి...పోలీసులకు ఫిర్యాదు, వీడియో ఇదిగో

Arun Charagonda

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. తన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై రాళ్ళతో దాడి జరగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Hyderabad: మణికొండలోని అపార్ట్‌మెంట్లో అగ్నిప్రమాదం,ఈఐపీఎల్‌ అపార్ట్‌మెంట్‌ 9వ అంతస్తులో ప్రమాదం...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. మణికొండలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో అపార్ట్‌మెంట్ వాసులు బయటికి పరుగులు తీశారు.

CM Revanth Reddy: తెలంగాణలో మూడు కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి, వరంగల్ మానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన తెలంగాణ సీఎం

Arun Charagonda

తెలంగాణలో రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్ల‌ను భార‌త విమాన‌యాన సంస్థ (AAI)కి అంద‌జేసినట్టు తెలిపారు.

CM Revanth Reddy: కేంద్రమంత్రిని రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం అనుమతి కోరిన తెలంగాణ సీఎం

Arun Charagonda

కేంద్రమంత్రిని రాజ్‌నాథ్ సింగ్‌ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రాజ్‌నాథ్‌ని కలిసిన రేవంత్..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం అనుమతివ్వాలని కోరారు. అలాగే 222 ఎకరాల డిఫెన్స్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement