రాష్ట్రీయం
Nagarkurnool: మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత, తిమ్మాజీపేట స్కూల్‌లో ఘటన..వెంటనే డాక్టర్లను పిలిచి చికిత్స చేయించిన టీచర్లు
Arun Charagondaమధ్యాహ్న భోజనం తిని నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గోరిట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. టమాటో రైస్, గుడ్డు తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోగా.. వెంటనే ఉపాధ్యాయులు వైద్యులను పిలిపించి పాఠశాలలోనే చికిత్స చేయించారు.
Lagacharla: లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్న ప్రభుత్వం, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaకాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషనన్ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషనన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
Robbery In Wine Shop: ఘరానా దొంగలు..ఏకంగా వైన్స్ షాప్ గోడకే కన్నం వేసి దొంగతనం, శంషాబాద్ మండలం పాలమాకుల వైన్స్‌లో ఘటన
Arun Charagondaవైన్స్ షాప్ గోడకు కన్నం పెట్టి మద్యం బాటిళ్లు చోరీ చేశారు దొంగలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని SVB లక్ష్మీనరసింహ వైన్స్ షాప్ గోడకు తెల్లవారుజామున దొంగలు కన్నం పెట్టి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. మాస్కులు ధరించి లోపలికి వెళ్లి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు.
Asifabad: ఆసిఫాబాద్‌లో పులి సంచారం, మహిళపై దాడి..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా..వీడియో
Arun Charagondaపులి దాడిలో మహిళ మృతి చెందింది. పత్తి చేనులో పత్తి ఏరుతుండగా లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేయగా ఈ దాడిలో మహిళ మృతి చెందింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఘటన చోటు చేసుకోగా ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.
Telangana: గురుకులంలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..షాక్ తిన్న వైనం, రోజు వారి కూలీలతో వంట..కుళ్లిన గుడ్లు,నీళ్ల సాంబార్...వీడియో ఇదిగో
Arun Charagondaగురుకులంలో తనిఖీకి వెళ్లి ఖంగుతిన్నారు ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీకి వెళ్లారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ. వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్నారు. స్టోర్ రూంలో కుళ్లి బూజు పట్టిన ఆలుగడ్డలు, ఐఎస్ఐ మార్క్ లేని ఉప్పు ప్యాకెట్లు దర్శనం ఇచ్చాయి.
Andhra Pradesh Shocker: మడకశిరలో బాలుడి అదృశ్యం..దారుణ హత్య, కర్ణాటకలో శవమై కనిపించిన 8వ తరగతి విద్యార్థి
Arun Charagondaసత్య సాయి జిల్లా మడకశిరలో దారుణం చోటు చేసుకుంది. ఆమిదాలగొంది గ్రామ ప్రభుత్వ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో నిన్నటి దినం 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ అదృశ్యం అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇవాళ మడకశిర సరిహద్దున ఉన్న కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో బాలుడి హత్య చేయబడి శవంగా కనిపించారు విద్యార్థి చేతన్. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Naga Babu On Rajya Sabha Seat: రాజ్యసభ పదవిపై ఆసక్తి లేదు.. స్వార్థం తెలియని ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్, ఏపీ ప్రయోజనాల కోసమే ఢిల్లీకి పవన్ అని తెలిపిన నాగబాబు
Arun Charagondaరాజ్యసభకు తాను వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు మెగాబ్రదర్ నాగబాబు.నాకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు, ఆశయాలు లేవు అని తెలిపారు. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే,వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు .
Child Heart Attack: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి.. మంచిర్యాల జిల్లాలో ఘోరం
Rudraడెబ్బై, ఎనభై ఏండ్ల వయసులో రావాల్సిన గుండెపోటు ఇప్పుడు చిన్నరుల్లోనూ కనిపిస్తున్నది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలోనూ ఇదే జరిగింది.
Telangana Diksha Divas: తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.. దీక్షా దివస్, కేసీఆర్ చచ్చుడో - తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ఆమరణ దీక్ష..రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌లో బీఆర్ఎస్ శ్రేణులు
Arun Charagondaతెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ నవంబర్ 29, 2009న చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.
12 Feet Snake: అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్.. చాకచక్యంగా పట్టుకుని బంధించిన స్నేక్ క్యాచర్ (వీడియో వైరల్)
Rudraఅనకాపల్లి జిల్లా మాడుగుల శివారులోని ఓ రైతు పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు.
Nagachaitanya-Sobhita Haldi Function: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్
Rudraఅక్కినేని హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎంతో అంగరంగ వైభోగంగా మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
AP Cabinet Meeting: డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
Rudraఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.
AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)
Rudraఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు.
BRS Deeksha Diwas: నేడు తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’.. కరీంనగర్ లో పాల్గొననున్న కేటీఆర్
Rudraతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది.
AP Rain Alert: ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా
Rudraఏపీకి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదు. నేడు సాయంత్రానికి ఆ వాయుగుండం బలహీన పడుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్ , మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది.
Class 10 Exam Pattern Revised: పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు, తెలంగాణ సర్కారు తెచ్చిన కొత్త రూల్ ఇదే
VNSపదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై టెన్త్ ఎగ్జామ్స్ లో (Tenth Exams) ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. మొత్తం 100 శాతం మార్కులతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ పేర్కొంది.
Court Summons To Konda Surekha: మంత్రి కొండా సురేఖకు ఎదురుదెబ్బ, నాగార్జున పిటీషన్ పై సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు
VNSదేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు (Konda Surekha) నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున (Nagarjuna) వేసిన పరువునష్టం కేసులో మంత్రి సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణను నాంపల్లి కోర్టు Nampally Court( డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరు కావాలని మంత్రి సురేఖను కోర్టు ఆదేశించింది.
Cyclone Fengal Alert: మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్, ఏపీలో మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడు తీర ప్రాంతాలకు పెను ముప్పు
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో దాదాపు స్థిరంగా ఉందని, ఇది మరో 12 గంటల్లో ఫెంగల్ తుఫానుగా మారుతుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది
Telangana: సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలని ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్, ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని ఆందోళన
Hazarath Reddyమాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ ఆరోపణలు సరికాదంటూ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ఖండించింది.
Telangana Fire: వీడియో ఇదిగో, వాంటో సుట్‌కేస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బోర్లగూడెం గ్రామంలో ఉన్న వంటో సూట్‌కేస్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.