రాష్ట్రీయం

Andhra Pradesh: వీడియో ఇదిగో, టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని స్థానికులను చితకబాదిన టోల్ ప్లాజా సిబ్బంది

Hazarath Reddy

సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రోళ్ళ మండలం టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని స్థానికులను టోల్ ప్లాజా సిబ్బంది చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వీడియోలో టోల్ ప్లాజా సిబ్బంది ఇద్దరు ముగ్గురిపై దాడి చేయడం చూడవచ్చు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Vijayawada Floods: హ్యాట్సాఫ్‌..వరదల్లో నలుగురిని కాపాడి చనిపోయిన వ్యక్తి, భార్య 8 నెలల గర్భవతి, విజయవాడ వరదల్లో పెను విషాదం

Arun Charagonda

విజయవాడ వరదల్లో పెను విషాదం చోటు చేసుకుంది. నలుగురిని కాపాడి.. వరదల్లో కొట్టుకుపోయి చనిపోయాడు ఓ వ్యక్తి. విజయవాడకు చెందిన చంద్రశేఖర్(32) సింగ్ నగర్‌లో డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు.

Budameru River Flood: బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, నీట మునిగిన పలు కాలనీలు, ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న ప్రజలు

Hazarath Reddy

విజయవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి.

TDP Suspends MLA Koneti Adimulam: రాసలీలల ఎఫెక్ట్, టీడీపీ నుండి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్, ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు!

Arun Charagonda

రాసలీలల ఎఫెక్ట్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నేత కోనేటి ఆదిమూలం. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లైంగిక ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Advertisement

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోవా లిక్కర్ స్వాధీనం, 12 లక్షల విలువ చేసే 415 బాటిళ్లు సీజ్

Arun Charagonda

గోవా నుంచి విమానం ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్న నాన్ డ్యూటీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు. 12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.నాన్ డ్యూటీ మద్యాన్ని తరిలిస్తున్న12 మందిపై కేసు నమోదు చేశారు.

Communal Tensions Erupt in Asifabad: ఆదివాసీ యువతిపై అత్యాచారయత్నం, ఆసిఫాబాద్ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీలు, 144వ సెక్షన్ విధింపు

Hazarath Reddy

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్ధూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆదివాసీ యువతిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ జైనూర్ పట్టణంలో ఈరోజు ఆదివాసీలు బంద్‌కు పిలుపునిచ్చారు.

Andhra pradesh: ఫార్చునర్ కారులో వచ్చి చోరి, బంగారం షాపులో 38 కిలోల వెండి ఆబరణలు అపహరణ, దొంగల్లో ఒకరిని పట్టుకున్న స్థానికులు..వీడియో

Arun Charagonda

ఖరీదైన కారులో వచ్చి చోరీ చేసి దొరికిపోయిన సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. ఫార్చునర్ కారులో వచ్చి బంగారం షాపులో 38 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశారు. పారిపోతున్న దొంగల్లో ఒకడిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితులది రాజస్థాన్‌గా భావిస్తున్నారు పోలీసులు.

TDP MLA Koneti Adimulam Episode: టీడీపీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా..ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై బాధితురాలు, పలు న్యూడ్ వీడియోలు రిలీజ్

Arun Charagonda

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఉన్న న్యూడ్ వీడియో వైరల్‌గా మారగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బాధితురాలు పలు న్యూడ్ వీడియోలను రిలీజ్ చేసింది. ఈ అంశాన్ని గతంలో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించింది.

Advertisement

TDP MLA Koneti Adimulam: అది మార్ఫింగ్ వీడియో, టీడీపీ నేతలే తనపై కుట్ర చేశారని వెల్లడించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటన

Arun Charagonda

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓ మహిళతో రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు రాగా దీనిపై స్పందించారు ఆదిమూలం. సొంతపార్టీ నేతలే తనపై కుట్రచేశారని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

TDP MLA Koneti Adimulam: ఓ వైపు వర్షం..మరోవైపు రాసలీలల్లో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదు చేసిన మహిళా..వీడియో ఇదిగో

Arun Charagonda

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదంలో చిక్కుకున్నారు. సత్యవేడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆదిమూలం. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా రాసలీలకు సంబంధించిన వీడియో లీక్ అయింది.

CM Revanth Reddy On Global AI Summit: హైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సదస్సు, ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఏఐ సదస్సు

Arun Charagonda

హైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సదస్సును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుండగా దేశ చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఏఐ సదస్సు జరుగుతోంది. సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఈ సదస్సు జరగనుంది.

Basara IIIT Students Protest: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన, సమస్యలను పరిష్కరించాలని 2 వేల మంది విద్యార్థుల నిరసన

Arun Charagonda

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై 2 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేదంటే శాంతి యుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.

Advertisement

Money Fraud In Hyderabad: హైదరాబాద్‌లో రూ.500 కోట్ల భారీ మోసం, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి, అధిక వడ్డీ ఆశతో డబ్బులు వసూలు, బోర్డు తిప్పేసిన కంపెనీ

Arun Charagonda

హైదరాబాద్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్వె‌స్ట్‌మెంట్ పేరుతో ప్రజలను ముంచేసింది డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ. ఏకంగా రూ.500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుండి డబ్బులు వసూలు చేశారు కంపెనీ నిర్వాహకులు. రెండు నెలలుగా వడ్డీ డబ్బులు చెల్లించలేదు. ఒత్తిడి ఎక్కువ కావడంతో మాదాపూర్‌లోని ఆఫీసుకి తాళం వేసి.. పరారయ్యారు . హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు చేశారు

YS Sharmila On Rainy Season: వర్షాకాలానికి సరికొత్త అర్ధం చెప్పిన వైఎస్ షర్మిల, రైనీ సీజన్ అంటే షర్మిల ఏం చెప్పిందో తెలుసా?, అందుకే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారా!

Arun Charagonda

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మరోసారి ట్రోలింగ్‌గా మారారు. గతంలో పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి నవ్వుల పాలైన షర్మిల తాజాగా వర్షాకాలనికి అలాంటి సమాధానమే చెప్పింది. విజయవాడలో పర్యటించిన షర్మిల...మీడియాతో మాట్లాడుతూ రైనీ సీజన్ అంటే రైన్స్ వచ్చే సీజన్‌ అని చెప్పేశారు. అంతే నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు

Vijayawada Floods: కన్నీరు తెప్పిస్తున్న వీడియో, వరద నీటిలో శవమై తేలిన 14 ఏళ్ల బాలుడు,విజయవాడలో కన్నీటి దృశ్యాలు

Arun Charagonda

వరద నుండి ఇప్పుడిప్పుడే విజయవాడ బయటపడుతోంది. ఇక సహాయక చర్యల్లో భాగంగా హృదయ విదారక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుములోతు నీటిలో మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్తుండగా కొడుకుని తలుచుకుని రోదిస్తున్న ఆ తల్లి బాధ మాటల్లో చెప్పలేదని. ఈ దృశ్యాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

Nandigam Suresh Arrest: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, టీడీపీ కార్యాలయంపై దాడి ఎఫెక్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

వైసీపీ నేత, మాజీ ఎంపి నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో హైదరాబాద్‌లో ఉన్న సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం మంగళగిరికి ఆయన తరలించారు.

Advertisement

Central Govt Committee: ఏపీలో వ‌ర‌ద‌ల‌పై సాయానికి సిద్ధ‌మైన కేంద్ర ప్ర‌భుత్వం, రేపు వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్న కేంద్ర క‌మిటీ, అమిత్ షా ట్వీట్

VNS

విజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amith Shah) తెలిపారు.

YS Jagan Comments on Chandrababu: క‌ర‌కట్ట ద‌గ్గ‌ర‌ ఇళ్లు మునిగింది కాబ‌ట్టే..చంద్ర‌బాబు క‌లెక్ట‌రేట్ లో ఉంటున్నారు! సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన వైఎస్ జ‌గ‌న్

VNS

విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు (Chandra Babu) ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఆరోపించారు. బుధవారం విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

Telangana: కేసీఆర్ కనబడుట లేదు, ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత ఎక్కడంటూ పోస్టర్లు వైరల్

Hazarath Reddy

కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. రెండు సార్లు అధికారం ఇచ్చినా... ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే బయటకు రాని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లు.రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Godavari Water Level Rises: వీడియో ఇదిగో, గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద ఉధృతి

Hazarath Reddy

తుఫాను ప్రభావం వలన ఎగువ రాష్ట్రాల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం బుధవారం సాయంత్రానికి పెరుగుతూ వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువన 31.770 మీటర్ల నీటిమట్టం, స్పిల్ వే దిగువన 23.100 మీటర్ల నీటిమట్టం నమోదయింది.

Advertisement
Advertisement