రాష్ట్రీయం
Telangana Election Results 2023: తెలంగాణలో 8 సీట్లను కైవసం చేసుకుని పుంజుకున్న బీజేపీ, కమలం గెలిచిన స్థానాలు ఇవే..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. మొత్తం 111 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ మొత్తం 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ఎంపీల్లో సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌ ఓటమి పాలయ్యారు
Telangana Election Results 2023: ఓటమి ఎరుగని ఎర్రబెల్లి దయాకర్‌రావును మట్టికరిపించిన కాంగ్రెస్‌ అభ్యర్థి య‌శ‌స్విని రెడ్డి, కొండా సురేఖ చేతిలో ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌రావు ఓటమి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సోదరుడు ఓటమి పాలయ్యారు. ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్‌ఎస్‌ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యేగా మరోసారి బరిలోకి దిగారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్‌ రావు వరంగల్‌ ఈస్ట్‌ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు.
Telangana Election Results 2023: మళ్లీ ఎంపీగా పోటీ చేస్తా, బర్రెలక్క సంచలన నిర్ణయం, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు విజయం
Hazarath Reddyతెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అత్యధిక సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతుంది. అయితే కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.
Telangana Election Results 2023: రేవంత్‌రెడ్డితో భేటీ అయిన కొద్ది సేపటికే డీజీపీ అంజనీకుమార్‌ సస్పెండ్‌, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే కలవడంపై ఈసీ సీరియస్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేసినట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే అధికారికంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు జరపడమే అంజనీకుమార్‌ సస్పెన్షన్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Telangana Election Results 2023: రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఈ రోజు రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి.
Telangana Election Results 2023: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా, OSD ద్వారా రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసైకి పంపించిన బీఆర్ఎస్ అధినేత
Hazarath Reddyముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కేవలం రెండు వాహనాల్లోనే రాజ్‌భవన్‌కు చేరుకుని కేసీఆర్ రిజైన్ లెటర్‌ను అందించారు.తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
PM Modi on Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ, తెలంగాణతో మా బంధం విడదీయరానిదంటూ ట్వీట్
Hazarath Reddyనా ప్రియమైన తెలంగాణా సోదరులారా..తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా, ఈ మద్దతు పెరుగుతోంది మరియు రాబోయే కాలంలో కూడా ఈ ధోరణి కొనసాగుతుంది.తెలంగాణతో మా బంధం విడదీయరానిదని, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం.ప్రతి బీజేపీ కార్యకర్త చేస్తున్న కృషిని కూడా నేను అభినందిస్తున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు.
Telangana Election Results 2023: కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమి, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం
Hazarath Reddyకామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉండగా కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు.
Telangana Elections Winning Candidates List: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మొత్తం లిస్టు ఇదిగో, హైదరాబాద్‌లో మెజార్టీ సీట్లు ఏ పార్టీ కైవసం చేసుకున్నదంటే..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని అధికార ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో ఉంది.
Telangana Election Results 2023: ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్, విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అంటూ..
Hazarath Reddyమంత్రి కేటీఆర్ ఫలితాలపై ట్వీట్ చేశారు. వరుసగా రెండు పర్యాయాలు గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందాను. కానీ మేము దీన్ని ఒక అభ్యాసంగా తీసుకుంటాము. తిరిగి పుంజుకుంటాము. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Telangana Election Results 2023: గోషామహల్‌లో రాజాసింగ్ ఘన విజయం, వరుసగా హ్యట్రిక్ కొట్టిన బీజేపీ నేత, అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ లో తన ఖాతాను తెరిచింది. గోషా మహల్ నుంచి రాజా సింగ్ ఘన విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఘన విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు.
Telangana Election Results 2023: ఆర్మూరు నుంచి బీజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఘన విజయం, మూడవస్థానానికి పడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి
Hazarath Reddyనిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆర్మూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు బరిలో నిలిచారు.
Telangana Election Results 2023: అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టనున్న ఎమ్మెల్యేలు వీళ్లే, ఎర్రబెల్లి దయాకర్‌రావుపై 8 వేల ఓట్ల మెజారిటీతో యశస్వినిరెడ్డి ఘన విజయం
Hazarath Reddyతెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.ఈ ఎన్నికల ద్వారా వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వాళ్లు, ఈ ఎన్నికల్లోనే తొలిసారి పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు దీవించారు.
Telangana Election Results 2023: వీడియో ఇదిగో, డికె శివకుమార్‌తో కలిసి సంబరాలు జరుపుకున్న రేవంత్ రెడ్డి, తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకోనుందని వెల్లడవుతున్న ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు డీకే శివకుమార్‌ తదితరులతో కలిసి రాష్ట్ర ఎన్నికల్లో ఆధిక్యం సాధించినందుకు సంబరాలు జరుపుకున్నారు.
Telangana Election Results 2023: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు షాక్, అనూహ్యంగా లీడింగ్‌లోకి వచ్చిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి
Hazarath Reddyకామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ మూడో స్థానానికి కేసీఆర్ పడిపోయారు.కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ మూడో స్థానానికి పడిపోయారు
Telangana Election Results 2023: కొడంగల్‌లో 32,800 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి ఘన విజయం, దుబ్బాకలో రఘునందన్ రావు ఓటమి, ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీరే..
Hazarath Reddyతెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. ఇక దుబ్బాకలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.
Telangana Election Results 2023: ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీళ్లే, మూడుకు చేరిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సంఖ్య, చార్మినార్‌లో ఎంఐఎం అభ్యర్థి ఘన విజయం, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyచార్మినార్‌లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్‌ జుల్ఫికర్‌ అలీ గెలిచారు. మలక్ పేట, చాంద్రాయణగుట్ట, బహుదూర్ పురా నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 88 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ, పోటీ చేసిన 8 చోట్ల జనసేనకు ఘోర పరాభవం
Hazarath Reddyతెలంగాణలో తొలిసారి పోటీచేసిన పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన (Janasena) ఘోర పరాభవం చవిచూసింది. పోటీచేసిన అన్నిస్థానాల్లోనూ గ్లాస్‌ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు.
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో జనసేన బిగ్‌ షాక్‌, పోటీ చేసిన 8 స్థానాల్లో కనపడని ప్రభావం, దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyపవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తుతో మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కౌంటింగ్‌ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు.
Telangana Election Results 2023: ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్, శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అంటూ..
Hazarath Reddyటీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది’’ అంటూ రేవంత్‌ ట్వీట్‌ చేశారు.