రాష్ట్రీయం
Elephant Dies at SV Zoo Park: తిరుపతి ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతి, గంటా వారి పల్లి పంట పొలాలలో విద్యుత్ షాక్‌ తగిలి మరో ఏనుగు మృతి
Hazarath Reddyతిరుపతి ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతిచెందింది. చిత్తూరు జిల్లా మాదమరి మండలంలో పంటపొలాల విధ్వంసంలో ఏనుగుకు గాయాలవ్వగా అటవీశాఖ సిబ్బంది జూపార్క్‌కు తరలించారు. అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టిన ఏనుగుకి గాయాలు కావడంతో జూపార్క్‌లో చికిత్స అందించారు.
Telangana Student Dies in US: అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు మృతి, వరుణ్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు
Hazarath Reddyఅమెరికాలో జిమ్‌లో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్‌ తేజ(24) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అధికారులు సమాచారం అందించారు.. వరుణ్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Ruckus Over Disha App: వీడియో ఇదిగో, ఏపీలో దిశ యాప్ రచ్చ, ఆర్మీ సైనికుడిని చితకబాదిన నలుగురు పోలీసులు, ఈ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని అనుమానం వ్యక్తం చేసిన నారా లోకేష్
Hazarath Reddyసయ్యద్‌ అలీముల్లా ఫోన్‌లోనూ యాప్ డౌన్‌లోడ్‌ చేయించారు. ఈ క్రమంలో వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్‌ రాసుకున్నారు. ఓటీపీతో సైబర్‌ మోసాలు జరిగే అవకాశం ఉందని జవాన్ అన్నారు. అలాగే కానిస్టేబుళ్ల బ్యాడ్జిలపై పేర్లు లేవని.. తనకు అనుమానం కలుగుతోంది అన్నారు.
Wife Killed Husband: కూతురి సాయంతో భర్తను చంపిన భార్య, ఇంట్లోనే వరం పాటు శవాన్ని పెట్టి డ్రామాలు, పెట్రోల్ పోసి కాల్చేందుకు యత్నం, సగమే కాలిపోవడంతో హడావుడిగా అంత్యక్రియలు, సినిమా ట్విస్టులను మించిన క్రైమ్ చిత్రం
VNSమద్యానికి బానిసై, వివాహేతర సంబంధాలకు అలవాటుపడి ఇంట్లో వారిని దుర్భాషలాడటం, కొట్టడంతో విసుగెత్తిపోయిన భార్య.. కూతురు సాయంతో భర్తను దారుణంగా హత్య చేశారు. శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో వారం రోజులు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు.
Hyderabad Rains: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం, భారీగా ట్రాఫిక్ జామ్, తెలంగాణకు నాలుగు రోజుల పాటు వానలు, వాతావ‌ర‌ణ శాఖ కీల‌క అప్డేట్ ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావారణం మారిపోయింది. సిటీలోని పలు చోట్ల చిరుజల్లులతో పాటు పలు చోట్ల వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, గచ్చిబౌలి, పంజాగుట్ట, యూసఫ్ గూడ, మాదాపూర్ చందానగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్ర, కొంపల్లి, చింతల్, షాపూర్ ఏరియాల్లో వర్షం పడుతోంది.
Telangana Assembly Elections 2023: ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన పవన్ కళ్యాణ్, బీసీ ఆత్మగౌరవ సభలో జనసేనాధినేత స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyహైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన నాయకుడు, దేశ ప్రయోజనాలే ముఖ్యం అనుకునే లీడర్ అంటూ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రి, బీజేపీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, ప్రధాని స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు.
Chandra Babu: ఇసుక అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
ahanaఏపీ సీఐడీ ఇసుక అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
Chandrababu Naidu Eye Operation: చంద్రబాబుకు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి..ఫోటోలు వైరల్..
ahanaటీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో మంగళవారం శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు.
Inner Ring Road Case: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు, చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నవంబర్ 22కి వాయిదా, నేడు టీడీపీ అధినేత కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌
Hazarath Reddyఅమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో (Inner Ring Road Case) టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది.
YSR Rythu Bharosa: మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం రాదు, మీ ఇంట్లో మంచి జరిగితేనే సైనికులుగా నిలబడండి, వైఎస్సార్‌ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేశారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల 4వ జాబితా విడుదల, మునుగోడు స్థానం నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ
Hazarath Reddyబీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల నాలుగో జాబితాను విడుదల చేసింది. 12మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. చెన్నూరు స్థానాన్ని దుర్గం అశోక్ కి, ఎల్లారెడ్డి సీటును వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కేటాయించారు. వికారాబాద్ స్థానం పెద్దిరెడ్డి నవీన్ కుమారికి, సిద్దిపేట సీటు దూడి శ్రీకాంత్ రెడ్డికి దక్కాయి. కొడంగల్ నుంచి బంటు రమేష్ కుమార్, గద్వాల నుంచి బోయ శివ, వేములవాడ నుంచి తుల ఉమను బరిలోకి దించుతున్నారు.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, తమ నేతకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ ఆఫీసులో ఫ్లెక్సీలు తగలబెట్టిన కాటా శ్రీనివాస్ గౌడ్‌ అనుచరులు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ మూడో జాబితా అభ్యర్థులను విడుదల చేసింది. అయితే ఇది పటాన్‌చెరు కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. కాటా శ్రీనివాస్ గౌడ్‌కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో అతని అనుచరులు పార్టీ ఆఫీసులో ఫ్లెక్సీలు తగలబెట్టారు. వీడియో ఇదిగో..
Vijayawada Bus Accident CCTV Footage: విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాదం సీసీటీవీ ఫుటేజీ ఇదిగో, ప్లాట్ ఫాం మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చిన బస్సు
Hazarath Reddyవిజయవాడ బస్ స్టేషన్లో నిన్న ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు ప్లాట్ ఫాం మీదకు దూసుకువచ్చిన సీసీ కెమెరా దృశ్యాలను ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లా పెదనందిపాడు మం. రావిపాడుకు చెందిన ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగి వీరయ్య, ఓ మహిళ, 7 నెలల చిన్నారి మృతి చెందారు.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, పటాన్‌చెరు టికెట్ కోట్లకు అమ్ముకున్నారు, మమ్మల్ని నమ్మించి గొంతు కోశారు, కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి కాటా సుధ
Hazarath Reddy18, 20 ఏండ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన మాకు కాంగ్రెస్ పార్టీ మోసం చెసింది, టికెట్ ఇస్తారు అని ఎంతో ఆశతో ఎదురుచూశాం. కానీ నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నీలం మధుకి టికెట్ కేటాయించారు. నీలం మధు దగ్గర ఎమ్మేల్యే జగ్గారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నారు.
YSR Rythu Bharosa: రైతుల అకౌంట్లోకి నేరుగా రూ. 4 వేలు, రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్‌ రైతు భరోసా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత పెట్టుబడి సాయం పంపిణీకి రంగం సిద్ధమైంది. నేడు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నారు.
Traffic Alert in Hyderabad: హైదరాబాద్‌ లో ప్రధాని మోదీ బహిరంగ సభ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు
Rudraహైదరాబాద్‌ లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో (LB Stadium) మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది.
Narendra Modi to Hyderabad: నేడు హైదరాబాద్‌ కు ప్రధాని మోదీ.. సాయంత్రం గం. 5.05 లకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని.. 5.30-6.10 గంటల మధ్య ఎల్బీ స్టేడియంలో బహిరంగసభ.. హాజరవనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!
Rudraతెలంగాణలో ఎన్నికల వేడి మరింత తీవ్రమైంది. పోటాపోటీ సభలు, సమావేశాలతో కదనరంగంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. బీజేపీ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (నేడు) తెలంగాణలో పర్యటించనున్నారు.
Telangana Assembly Elections 2023: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి పోటీకి సిద్దం, కాంగ్రెస్ పార్టీ మూడవ జాబితా విడుదల
ahanaతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. మూడో జాబితాలో పేరున్న ప్రముఖ నాయకులలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై రెడ్డి పోటీ చేస్తున్నారు.
Maharashtra Gram Panchayat Election Results 2023: మహారాష్ట్రలో మూడవసారి విక్టరీ కొట్టిన బీఆర్ఎస్, పంచాయితీ ఎన్నికల్లో 15 స్థానాలను కైవసం చేసుకున్న కేసీఆర్ పార్టీ
Hazarath Reddyమహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడవసారి బోణీ కొట్టింది. గ్రామ పంచాయితీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 గ్రామ పంచాయితీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. భండారా జిల్లాలో 20 గ్రామ పంచాయితీ ఫలితాలు ప్రకటించగా తొమ్మిది గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకుంది.