రాష్ట్రీయం

Bathukamma 2023: వీడియో ఇదిగో, బతుకమ్మ పాటకు డాన్స్ వేసిన అమెరికాలోని కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్

Hazarath Reddy

అమెరికాలో సైతం బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా బతుకమ్మ పాటకు అమెరికాలో కొలరాడో రాష్ట్ర ప్రజా ప్రతినిధి కెన్ బక్ డాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Ponnala Lakshmaiah Joins BRS: బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న పొన్నాల లక్ష్మయ్య, సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరిన మాజీ కాంగ్రెస్ సీనియర్‌ నేత

Hazarath Reddy

సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పొన్నాలకు కండువా కప్పి సీఎం కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మయ్యతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు.

TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గమనిక, జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులు, ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని #TSRTC నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది.

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న బంగారం, మియాపూర్‌లో రూ. 15 కోట్ల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్న అధికారులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌ మియాపూర్‌లో రూ. 15 కోట్ల విలువైన బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని పోలీసులు సీజ్‌ చేశారు.

Advertisement

Andhra Pradesh Shocker: మార్కాపురంలో దారుణం, పెళ్లి చేయడం లేదని కన్నతండ్రి గొంతు కోసి చంపిన కొడుకు, అనంతరం అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య

Hazarath Reddy

ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పెళ్లికాకుండా అడ్డుకుంటున్నాడనీ, పెళ్లి చేయడం లేదని ఆగ్రహించి ఓ కొడుకు కన్నతండ్రిని కత్తితో గొంతుకోసి దారుణంగా చంపేశాడు.

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, భారీగా పట్టుబడుతున్న నగదు, కవాడీగూడలో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్త్రృత తనిఖీలు చేపడుతున్నారు. ఎలాంటి రసీదులు లేని నగదును జప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ గాంధీనగర్‌ పరిధిలోని కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

CM Jagan Visakhapatnam Tour: త్వరలోనే నేను విశాఖకు షిప్ట్‌ అవుతున్నా, సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోందని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన కొనసాగుతోంది. విశాఖలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు చేశారు. ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 4160 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Global Companies Line-up to Hyderabad: భారత్‌ లో గ్లోబల్‌ కంపెనీల అడ్డాగా హైదరాబాద్‌.. సీబీఆర్‌ఈ ఇండియా నివేదిక

Rudra

భారత్‌ లో గ్లోబల్‌ కంపెనీల కార్యాలయాలకు హైదరాబాద్‌, బెంగళూరు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి.

Advertisement

Fire Accident: వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన బ్యాగుల దుకాణం

Rudra

హైదరాబాద్‌ వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ (Ganesh Temple) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Kunja Satyavathi Passed Away: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత.. అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస

Rudra

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు.

Rahul and Priyanka: తెలంగాణలో మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటన.. ఈ నెల 18 నుంచి 20 వరకు రాహుల్, ప్రియాంక పర్యటన

Rudra

కాంగ్రెస్ అభ్యర్థులకు దన్నుగా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణకు వస్తున్నారు.

Telangana Rain Forecast: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు, రెండు రోజుల పాటూ వానలు పడే అవకాశముందన్న ఐంఎడీ, రాబోయే రెండు రోజులపాటూ అక్కడక్కడా వానలు పడే ఛాన్స్

VNS

తెలంగాణ గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం (Weather) నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చలికాలంలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉక్కపోతతో జనం ఇబ్బందులుపడుతున్నారు. నైరుతి రుతుపవనాల తిరుగమనం (Southwest Monsoon) చివరి దశకు చేరడంతో వర్షాలు ముఖం చాటేశాయి. ఈ క్రమంలో వాతావరశాఖ కీలక సమాచారం అందించింది.

Advertisement

Atchannaidu Sensational Comments: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది! అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

VNS

స్కిల్ కేసులో (Skill Scam) ఒక్క రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారు. కనీసం ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆఖరికి ప్రాణాహాని కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ (CBN Arrest) ను ఖండిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి మొత్తం దేశాన్ని చీకట్లోకి నెట్టారు.

Ponguleti Video Viral: పొంగులేటి కొత్తగూడెం నుండి పోటీ చేయాలని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన పొంగులేటి అభిమాని, వీడియో వైరల్

ahana

కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీసు ఎదుట ఆయన అనుచరుడు ఒకరు ఆత్మహత్యాయత్నం చేయడంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచే పొంగులేటి పోటీచేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమాని ఒకరు పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఈ గొడవ మొదలైంది.

Singireddy Somasekhar Reddy : రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయా, రేవంత్ BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడు, రేవంత్ ప్రధాన అనుచరుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆరోపణ

ahana

రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు .. ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో అలిగిన ఆయన రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయాను అని రేవంత్ BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడని ఆరోపణలు చేశారు.

Viral Video: కారు టాపు పైకెక్కి..నడిరోడ్డుపై హద్దులు దాటి ముద్దులు పెట్టుకున్న కపుల్...హైదరాబాద్ రోడ్లపై రొమాన్స్...ఇదెక్కడి ఖర్మరా అంటున్న జనం..

ahana

హైదరాబాద్‌లో కదులుతున్న కారు పైకప్పుపై యువ జంట కూర్చుని ముద్దులు పెట్టుకున్న వీడియో నెటిజన్ల స్పందనను రేకెత్తిస్తోంది. ట్విట్టర్లో X షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా యూజర్ల నుండి మిశ్రమ స్పందనలకు దారితీసింది.

Advertisement

BRS Manifesto: ఆసరా పెన్షన్ రూ. 5000కు పెంపు, గ్యాస్ సిలిండర్ రూ. 400, రైతు బంధు రూ. 16 వేలకు పెంపు.. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ మానిఫెస్టో..

ahana

రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బిసిలు, మైనార్టీలకు పెద్ద పీట వేస్తూ సీఎం కేసీఆర్ హామీలు అందించారు. ఇందులో ఆసరా ఫించన్లు, రైతుబంధు సాయం పెంపు, 5 లక్షల బీమా పథకం లాంటి అనేక ఆకర్షించే పలు హామీలు ఉన్నాయి.

CM KCR Press Meet: ఎన్నికల వేళ కోపతాపాలు ఉంటాయి.. సహజమే: ప్రగతి భవన్ లో అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం..

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల స్థానాల్లో కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

BRS Chariot: ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రచార రథం ఫోటోలు వైరల్..

Rudra

తెలంగాణలో ఎన్నికల సమరం షురూ అయ్యింది. ఈ కథనరంగంలో అడుగు ముందే ఉన్న గులాబీ దళపతి కేసీఆర్.. నేడు ప్రచార పర్వం ప్రారంభించనున్నారు.

Deccan Journalist Housing Society: మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలం పెట్టండి.. కేటీఆర్ కు డీజేహెచ్ఎస్ సభ్యుల వినతి.. సానుకూలంగా స్పందించిన మంత్రి

Rudra

జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపుల అంశాన్ని మ్యానిఫెస్టోలో పొందుపరచాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) వినతి పత్రం అందజేసింది.

Advertisement
Advertisement