రాష్ట్రీయం
Independence Day 2023: వీడియో ఇదిగో, రెండు జాతీయ జెండాలతో వీధులన్నీ చుట్టేసిన అసదుద్దీన్ ఒవైసీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న హైదరాబాద్ ఎంపీ
Hazarath ReddyAIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని తన స్టైల్లో ప్రత్యేకంగా జరుపుకున్నారు. వీధుల్లో తన మోటర్‌బైక్‌పై తిరుగుతూ తనదైన శైలిలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.
Chandrababu on Hyderabad: నా పోరాటం వల్లే ఈరోజు హైదరాబాద్ ఇలా ఉంది, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ 1995లో ప్రారంభమైంది..నా పోరాటం వల్లే హైదరాబాద్‌ ఇలా ఉంది. తెలంగాణ ప్రజలందరూ నేడు లబ్ధిపొందుతున్నారు. అది ఆరోజు ఇచ్చిన భిక్ష’’ అంటూ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వాసుల నుండి వ్యతిరేకత ఎదురవుతోంది. ట్విట్టర్లో నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
Andhra Pradesh: బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాకు అవమానం, తలకిందులుగా ఎగరేసిన జెండాకే వందనం చేసిన నేతలు, మండిపడుతున్న దేశభక్తులు
Hazarath Reddyకాకినాడలో రాజాం పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని నేడు ఆవిష్కరించారు. అయితే.. తలకిందులుగా ఎగరేసిన జెండాకే వందనం చేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బీజేపీ నాయకుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
YS Sharmila Padayatra: 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు
Hazarath Reddyతెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిల గారిని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.
'Made in India' AirPods: హైదరాబాద్ యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ, ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఉత్పత్తి
Hazarath Reddyహైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఫాక్సాకాన్ కంపెనీ ప్లాంట్లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఐఫోన్ ఎయిర్ పాడ్స్ తయారీ చేయనుంది. డిసెంబరు 2024 నుంచి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Chandrababu on Study: వీడియో ఇదిగో, ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలని తెలిపిన చంద్రబాబు, వైరల్ అవుతున్న క్లిప్
Hazarath Reddyఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి.. అంటూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Chandrababu: విశాఖలో 2047 విజన్ డాక్యుమెంట్‌ విడుదల, ఏపీని మరలా గాడిలో పెడతానని ప్రకటన..
kanhaతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం చేరుకుని ‘విజన్ 2047’ డాక్యుమెంట్ విడుదల చేశారు.
Andhra Pradesh:వీడియో ఇదిగో, పోలీస్ శాల్యూట్ చేస్తుండగా కింద పడిన మెడల్, స్వయంగా కిందకు వంగి దాన్ని తీసి మళ్లీ ప్రదానం చేసిన సీఎం జగన్
Hazarath Reddyగ్రేహౌండ్స్ కు చెందిన గౌరునాయుడికి జగన్ మెడల్ ప్రదానం చేశారు. అనంతరం గౌరునాయుడు శాల్యూట్ చేస్తుండగా మెడల్ కిందపడింది. దీన్ని గుర్తించిన జగన్ మెడల్ తీసి మళ్లీ గౌరునాయుడికి ప్రదానం చేశారు. మరోవైపు, ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాము అందిస్తున్న నవరత్నాల పాలన ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థమని అన్నారు.
Independence Day 2023: గోల్కొండ కోట‌ నుంచి ప్రజలకు వరాల జల్లులు కురిపించిన సీఎం కేసీఆర్, జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి
Hazarath Reddyగోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్రంలోని గూడు లేని నిరుపేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో కేసీఆర్ స‌ర్కార్ డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.
Independence Day 2023: మేనిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామని తెలిపిన సీఎం జగన్, పేదలు గెలిచి వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం జరుగుతుందని వెల్లడి
Hazarath Reddyస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్‌. అనంతరం ప్రసంగించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
Andhra Pradesh: కూల్ బీర్ కోసం తల పగలకొట్టుకున్న యువకుడు, కాకినాడలో జరిగిన ఫైటింగ్ వీడియో ఇదిగో
Hazarath Reddyకాకినాడ - రాజాం మండలంలోని రాజిపేట ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఆబోతుల హరిబాబు అనే వ్యక్తి బీర్లు కూలింగ్ లేవా అంటూ అడగగా.. వైన్ షాప్ సిబ్బందికి, అతనికి మధ్య గొడవ జరిగి కూల్ బీర్ అడిగిన హరిబాబు తల పగిలింది.
Tirumala: వీడియో ఇదిగో, తిరుమల కాలినడకన వెళ్లే భక్తలకు ఆత్మరక్షణ కోసం మంచి ఉత కర్ర ఇస్తాం, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ ఇదిగో..
Hazarath Reddyతిరుమల కాలి నడకన వెళ్లే ప్రతి ఒక్క భక్తుడికి ఆత్మరక్షణ కోసం ఒక మంచి చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించాం - టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
Revanth Reddy: వీడియో ఇదిగో, ఆ పోలీసుల గుడ్డలు ఊడదీసి కొడతా, డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నానని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyమహబూబ్ నగర్ పోలీసులను గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నాం. 100 రోజుల తరువాత అధికారంలోకి రాగానే మీ గుడ్డలు ఊడతీసి, అసలు మిత్తితో సహా చెల్లిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Telangana Shocker: తీవ్ర విషాదం, చిన్న విభేదాలతో భార్యని చంపి ఉరివేసుకున్న భర్త, కరీంనగర్‌లో విషాదకర ఘటన
Hazarath Reddyకరీంనగర్ మార్కండేయ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యని చంపి ఓ భర్త ఉరివేసుకున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా భార్య లావణ్యను చంపిన భర్త ప్రవీణ్, 2 రోజులు మృతదేహాన్ని ఇంట్లోనే దాచి, హాస్టల్లో ఉన్న కూతురుని చూసొచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్.
Video: తీవ్ర విషాదాలు, క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి, పని కోసం బయటకు వెళ్లి మరొక యువకుడు మృతి
Hazarath Reddyకర్నూలు - బేతంచెర్లలోని సంజీవనగర్ కాలనీకి చెందిన మహేంద్ర (21) స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి - బిక్కవోలుకు చెందిన రాజా (30) అనే యువకుడు సోమవారం ఉదయం పని నిమిత్తం బయటికి వెళ్ళాడు.
Video: వీడియో ఇదిగో, దహన సంస్కారాలు చేయాలంటే పొంగి పొర్లుతున్న వాగును దాటాల్సిందే, బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అధికారులు ససేమిరా
Hazarath Reddyఆ గ్రామంలో దహన సంస్కరాలు చేయాలంటే పొంగిపోతున్న వాగు సైతాన్ని దాటిపోవాల్సిందే. ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌కే ఈ దుస్థితి రావటం ఆ గ్రామ ప్రజలను కలచివేస్తుంది.
Stray Dog Attack: నిజామాబాద్‌లో బాలుడి మీద దాడి చేసిన వీధి కుక్క, వీడియో ఇదిగో..
Hazarath Reddyనిజామాబాద్ జిల్లాలో ఓ వీధి కుక్క బాలుడిపై దాడికి యత్నించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 8వ డివిజన్‌లో ఓ బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కిరాణా షాపుకు వెళ్లి ఏదో తినే పదార్థాన్ని కొనుగోలు చేసిన బాలుడు దాన్ని చేతిలో పట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు.
Rat in Godavari Express: 20 నిమిషాల పాటు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసిన ఎలుక, క్యాబిన్ కంట్రోల్ పానెల్‌లోకి దూరడంతో పొగలు
Hazarath Reddyగోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎలుక కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు థర్డ్ ఏసీ కోచ్ క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ఎలుక దూరడంతో పొగలు వచ్చాయి. వెంటనే రైలు ఆపేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్.. ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరింది.
Video: వీడియో ఇదిగో, దొంగతనానికి వచ్చిన దొంగను తరిమి తరిమి కొట్టిన మహిళ, వేములవాడలో సీసీటీవీ పుటేజీ బయటకు
Hazarath Reddyభగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె మొదటి కూతురుకు వివాహం కాగా, రెండో కూతురు అమెరికాలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి దొంగతనానికి యత్నించాడు.శ్రీలత తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. సదరు దొంగ ఆమె మెడలో నుంచి బంగారం అపహరించేందుకు యత్నించాడు.