రాష్ట్రీయం

Dr Sake Bharati: సాకే భారతికి ఏపీ ప్రభుత్వం వరాల జల్లులు, జూనియర్ లెక్చరర్ పోస్టు ఆఫర్, 2 ఎకరాల స్థలం, ఇంటి నిర్మాణం, వివరాలను వెల్లడించిన జిల్లా కలెక్టర్

Hazarath Reddy

అనంతపురం జిల్లా నుంచి కూలీ పనులు చేసుకుంటూ పీహెచ్‌డీ చేసిన డాక్టర్‌ సాకే భారతి (Dr Saake Bharti)కి వైఎస్ జగన్ ప్రభుత్వం 2 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ మేరకు ఆమెకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ గౌతమి భూమి పట్టాను అందజేశారు.

Hyderabad Metro Expansion: రూ.69 వేల కోట్లతో 400 కిలో మీటర్లు పరిధిలో హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ, కొత్తగా రాబోతున్న మెట్రో కారిడార్లు ఇవిగో..

Hazarath Reddy

రూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు కనెక్టివిటీని మొత్తం 400 కి.మీలకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Bear in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి, అర్థ రాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద ప్రత్యక్షం

Hazarath Reddy

తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షం. అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద కనిపించిన ఎలుగు బంటి. అయితే ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

CM KCR Maharashtra Tour: మహారాష్ట్ర బయల్దేరిన సీఎం కేసీఆర్, మహారాష్ట్ర యుగకవి అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో పొల్గొననున్న ముఖ్యమంత్రి

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నేడు మహారాష్ట్రలో (Maharashtra) పర్యటించనున్నారు.ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు. 11.15 గంటలకు కొల్హాపూర్‌ (Kolhapur) విమానాశ్రయానికి చేరుకుంటారు.

Advertisement

Emergency Vehicles in TS: తెలంగాణలో అత్యవసర సేవలకు 466 ఎమర్జెన్సీ వాహనాలు, నేడు జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడు 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. నేటి నుంచి వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108, 102 అనే హెల్ప్‌లైన్‌ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్‌ చేశారు

Vande Bharat: ఈ నెల 6 నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్.. దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు.. సోమవారం ట్రయల్‌ నిర్వహణ, రైలు డోన్ నుంచి కాచిగూడ చేరుకున్న వైనం

Rudra

తెలుగురాష్ట్రాల ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.

TSRTC Merger With Government: తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనంతో పండగ చేసుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు..మా బాపు కేసీఆర్ అంటూ నినాదాలు..

kanha

టీఎస్ఆర్టీసీ (TSRTC)ని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు.

Dasoju Shravan: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్ధులుగా ఎంపిక.

kanha

గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థులను ఎంపిక చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రావులను ఖరారు చేస్తూ గవర్నర్ కు పంపించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గవర్నర్ కు పంపించిన తర్వాత ఆమోదించాల్సిందేనన్నారు. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

Advertisement

Gangavaram Port: విశాఖ గంగవరం పోర్టులో తీవ్ర ఉద్రిక్తత, బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆందోళనకు దిగిన కార్మికులు

Hazarath Reddy

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఒక్కసారిగా గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

TSRTC Merge with Government: టీఎస్ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం

kanha

టీఎస్ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం. ఆగస్ట్ 3 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.

Nara Lokesh Speech at Mundlamuru: ఒక ఎంపీ జిప్పు విప్పి దేశం మొత్తం చూపించాడు, పాదయాత్రలో జగన్ సర్కారుపై విరుచుకుపడిన నారా లోకేష్

Hazarath Reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ముండ్లమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

Telangana Cabinet Meeting Highlights: టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం భేటీ ముగిసింది. ఐదు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలతో పాటు వరదల వల్ల జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికి చేపట్టే అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది

Advertisement

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్, దంచి కొడుతున్న వర్షం, అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు

Hazarath Reddy

భారీ వర్షం హైదరబాద్ నగరాన్ని మరోసారి వణికించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది.

Andhra Pradesh Debts Row: ఏపీ అప్పులపై పార్లమెంట్ సాక్షిగా క్లియర్ కటౌట్ ఇదిగో, నాలుగేళ్లలో జగన్ సర్కారు చేసిన అప్పులు రూ.1,77,991కోట్లు మాత్రమే

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పులపై పార్లమెంట్‌ సాక్షిగా వాస్తవాలు బయటపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌. ఏపీ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే ఉందని తేల్చిచెప్పారు.

Tirumala: అధికమాసం ఎఫెక్ట్, తిరుమలలో ఈసారి ఒకేసారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి

Hazarath Reddy

తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈసారి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉందని ఈవో ధర్మారెడ్డి అన్నారు.

Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, తగిన జాగ్రత్తలు లేకుండా దారులను ఎప్పుడూ మార్చవద్దు అంటూ ట్వీట్

Hazarath Reddy

రోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి రోడ్డు మీద వెళుతూ లైన్ క్రాస్ చేశాడు. దీంతో వెనక నుంచి వచ్చిన స్కూటి గుద్దడంతో ఇద్దరూ కింద పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోషేర్ చేస్తూ తగిన జాగ్రత్తలు లేకుండా దారులను ఎప్పుడూ మార్చవద్దు అంటూ ట్వీట్ చేశారు సైబరాబాద్ పోలీసులు

Advertisement

Prithvi on Ambati Rambabu: వీడియో ఇదిగో, అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు, నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్ర వేయడం పై వస్తున్న కామెంట్ల పై స్పందించిన నటుడు పృథ్వీ. నాకు మంత్రి అంబటి ఎవరో తెలియదు. అంబటి రాంబాబు ఆస్కార్ లెవల్ నటుడేమీ కాదు ఇమిటేట్ చేయడానికి. ఓ పనికిమాలిన వెధవ, ఓ బాధ్యత లేని వెదవ, బారుల్లో తాగుతూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర అని చేయాలని డైరెక్టర్ నాకు చెప్పారు.

Hyderabad Rains: ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లేవారు జాగ్రత్త.. అకస్మాత్తుగా పడిన భారీ వర్షంతో తడిసి ముద్దైన హైదరాబాద్, అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచన

Hazarath Reddy

తగ్గట్లే పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంతో పాటు పాటు శివారుల్లోనూ భారీగా వర్షం పడుతున్నట్లు సమాచారం. దీంతో నగరవాసుల్లో వణుకు మొదలైంది. భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచిస్తోంది.

CM Jagan Visakha Tour Schedule: సీఎం జగన్‌ విశాఖలో పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇదే, నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు

Hazarath Reddy

విశాఖపట్నంలో రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు.

Telangana Weather Update: ఎండలు వచ్చినా మళ్లీ అలర్ట్, తెలంగాణకు రానున్న రెండు రోజుల పాటు వర్షాలు, గోదావరిలో తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

Advertisement
Advertisement