రాష్ట్రీయం

Godavari Flood Surge Continues: గోదావరికి నదికి అంతకంతకూ పెరుగుతున్న వరద, అలర్ట్ అయిన అధికారులు, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

Hazarath Reddy

గోదావరి నది మహోగ్ర రూపం దాలుస్తున్నది. భారీ వర్షాలకు పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది

Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు ఇంట్లోకి వచ్చిన కొండచిలువ,పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించిన స్నేక్ రెస్క్యూ టీం

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగలు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వరదలకు పాములు, మొసళ్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. తాజాగా ఖమ్మం త్రీ టౌన్ ఏరియా వెంకటేష్ నగర్లో రోడ్డుపై పారుతున్న నీటిలో రోడ్డు పైకి వచ్చిన కొండచిలువ. దానిని స్నేక్ రెస్క్యూ టీం పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు.

Telangana Floods: భారీ వరదలకు జంపన్నవాగులో 7 గురు గల్లంతు, నాలుగు మృతదేహాలు లభ్యం, ముగ్గురి కోసం హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు

Hazarath Reddy

ఈ వాగులో ఏడుగురు గల్లంతు కాగా నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. మరో ముగ్గురి కోసం హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వరదలో కొట్టుకుపోయి గుర్తుతెలియని యాచకుడి మృతదేహం కరెంటు తీగలకు వేలాడుతుంది.

Rains in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన.. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.. ఇతర జిల్లాల్లో కూడా

Rudra

హైదరాబాద్‌లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది.

Advertisement

Medaram Submerged: మునిగిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం.. రెండు నుంచి మూడు అడుగుల మేర చేరిన నీరు.. ఏడుపాయలు, వరంగల్ భద్రకాళి, యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ రాజన్న ఆలయంలోనూ వరద కష్టాలు

Rudra

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలకుతం అయ్యాయి. ములుగు జిల్లా మేడారంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క-సారలమ్మ ఆలయం సహా అనేక చోట్ల రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది.

Hyderabad Rains: విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి - 65 మీద నందిగామ జిల్లా ఐతవరం గ్రామం వద్ద మున్నేరు వరద నీరు రోడ్డు మీదకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు దాటుతుండగా ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Telugu States Floods: అలర్ట్, విజయవాడ-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు, ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు నదులు

Hazarath Reddy

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్‌ జిల్లాలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై(హైదరాబాద్‌-విజయవాడ)అడుగు మేర వరద నీరు చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి

Telangana Floods: కన్నారం వాగులో బైక్‌తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి మృతి, వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

Hazarath Reddy

కన్నారం వాగులో బైక్ సహా కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. హనుమకొండ - కన్నారం గ్రామానికి మహేందర్ అనే వ్యక్తి కన్నారం వాగు మీద బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కన్నారం వాగులో పడి కొట్టుకుపోయాడు. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు జాలర్ల సహాయంతో గాలించగా అతని మృతదేహం లభ్యం అయింది. వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Telangana Floods: వీడియో ఇదిగో, కన్నారం వాగు దాటుతూ బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువకుడు, జాలర్ల సహాయంతో గాలిస్తున్న పోలీసులు

Hazarath Reddy

హనుమకొండ (Hanmakonda) జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామం వద్ద వాగు దాటుతూ ద్విచక్రవాహనదారుడు గల్లంతయ్యాడు. వాహనంపై మహేందర్ అనే వ్యక్తి వాగుమీదుగా వెళ్తుండగా బైకు అదుపుతప్పి వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు

Video: వరదలో బైక్ మీద కొట్టుకుపోయిన యువకుడిని కాపాడిన స్థానికులు, తాళ్ల సహాయంతో బయటకు తీసుకువచ్చిన గ్రామస్తులు

Hazarath Reddy

తెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లా అడ్డగుడూర్ మండలం గోవిందాపురం వద్ద నక్కల వాగు ఉదృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన ప్రయాణికుడు, తాళ్ల సహాయంతో కాపాడి బైటకు లాగిన స్థానికులు.

Telangana Rains: భారీ వర్షానికి నీట మునిగిన సమ్మక్క, సారలమ్మ గద్దెలు, తెలంగాణను వణికిస్తున్న భారీ వరదలు

Hazarath Reddy

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి

Telangana Floods: వీడియో ఇదిగో, వరద నీటిలో మునిగిపోయిన లక్నవరం వంతెన, తెలంగాణను వణికిస్తున్న భారీ వరదలు

Hazarath Reddy

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Advertisement

Telangana Rains: ఆపరేషన్ మోరంచపల్లి సక్సెస్, గ్రామస్తులందరినీ సురక్షితంగా బోట్ల ద్వారా తరలించిన అధికారులు, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Hazarath Reddy

హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను అధికారులు రక్షించారు. సహాయక చర్యల్లో 2 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. గ్రామస్తులను 6 ఫైర్‌ డిపార్ట్‌మెంట్ బోట్లు తరలించాయి. గ్రామం మొత్తాన్ని అధికారులు ఖాళీ చేయించారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా సిబ్బంది రెస్క్యూ చేశారు.

Telangana Floods: మోరంచపల్లిలో ఇళ్లు పూర్తిగా నీటిలో ఎలా మునిగిపోయాయో చూడండి, దాదాపు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Hazarath Reddy

తెలంగాణలోని జయశంకర్ - భూపాలపల్లి జిల్లాలో 24 గంటల సమయంలో రికార్డు స్థాయిలో 600mm+ వర్షపాతం తర్వాత మోరంచపల్లె గ్రామంలో తీవ్ర వరద పరిస్థితి వీడియో ఇది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచ వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.

HC on Bigg Boss Show: బిగ్‌బాస్‌ షోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, టీవీల్లో అసభ్యకర రీతిలో వచ్చే రియాల్టీ షోలకు సెన్సార్‌ లేకపోతే ఎలా అని మండిపాటు

Hazarath Reddy

బిగ్‌బాస్‌ షో నిలిపివేసేలా ఆదే­శాలు జారీ చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. టీవీల్లో అసభ్య, అభ్యత­రకర రీతిలో రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్‌ చేయక­పోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది.

Telangana Floods: భారీ వరదలకు చెరువులా మారిన కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌, పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Hazarath Reddy

తెలంగాణలో రికార్డు స్థాయిలో వానలు కురుస్తుండటంతో పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వానల నేపథ్యంలో కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌(జంక్షన్‌)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రైల్లే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది.

Advertisement

TDP vs YSRCP: వినుకొండలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రాళ్ల దాడి, పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

Hazarath Reddy

వినుకొండలో ఉద్రిక్త పరిస్థితి. టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీ నాయకులు వినుకొండలో భారీ ర్యాలీ నిర్వహించగా ఇదే సమయంలో వారికి ఎమ్మెల్యే సహా వైసీపీ నాయకులు ఎదురు కావడంతో పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గన్ బయటికి తీసి గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరపగా, పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Telangana Rains: భారీ వరదల్లో పూర్తిగా మునిగిపోయిన లారీ, సాయం కోసం డ్రైవర్, క్లీనర్ ఎదురుచూపులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో వరదల్లో చిక్కుకుపోయిన ట్రక్కు లోపల డ్రైవర్, క్లీనర్ సాయం కోసం ఆర్థిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. వాహనం వరద నీటిలో మునిగిపోయి, డ్రైవర్ మరియు సహాయకులు హైవేపై చిక్కుకుపోయినట్లు చూపిస్తుంది. ట్రక్కులోపల నీటి మట్టం అనేక అడుగులు పెరిగి, సీట్లను కప్పివేసి, ట్రక్ డ్రైవర్, సహాయకులలో భయం, ఆందోళన కలిగించింది.

Telangana Rains: తెలంగాణలో రేపు విద్యాసంస్థలకు సెలవు, అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

Hazarath Reddy

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్, నిరుపేద విద్యార్థులు ఫారిన్ యూనివర్సిటీల్లో చదువుకునే దిశగా ఏపీ సర్కారు అడుగులు

Hazarath Reddy

ఏపీలోని పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్య­సించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు (Jagananna Videshi Vidya Deevena) లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి

Advertisement
Advertisement