రాష్ట్రీయం
TDP vs YSRCP: వినుకొండలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రాళ్ల దాడి, పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు
Hazarath Reddyవినుకొండలో ఉద్రిక్త పరిస్థితి. టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీ నాయకులు వినుకొండలో భారీ ర్యాలీ నిర్వహించగా ఇదే సమయంలో వారికి ఎమ్మెల్యే సహా వైసీపీ నాయకులు ఎదురు కావడంతో పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గన్ బయటికి తీసి గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరపగా, పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Telangana Rains: భారీ వరదల్లో పూర్తిగా మునిగిపోయిన లారీ, సాయం కోసం డ్రైవర్, క్లీనర్ ఎదురుచూపులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో వరదల్లో చిక్కుకుపోయిన ట్రక్కు లోపల డ్రైవర్, క్లీనర్ సాయం కోసం ఆర్థిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. వాహనం వరద నీటిలో మునిగిపోయి, డ్రైవర్ మరియు సహాయకులు హైవేపై చిక్కుకుపోయినట్లు చూపిస్తుంది. ట్రక్కులోపల నీటి మట్టం అనేక అడుగులు పెరిగి, సీట్లను కప్పివేసి, ట్రక్ డ్రైవర్, సహాయకులలో భయం, ఆందోళన కలిగించింది.
Telangana Rains: తెలంగాణలో రేపు విద్యాసంస్థలకు సెలవు, అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
Hazarath Reddyరాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్, నిరుపేద విద్యార్థులు ఫారిన్ యూనివర్సిటీల్లో చదువుకునే దిశగా ఏపీ సర్కారు అడుగులు
Hazarath Reddyఏపీలోని పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్య­సించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు (Jagananna Videshi Vidya Deevena) లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి
Video: కొడుకు మృతదేహం చూసి కుప్పకూలిపోయిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గుండెపోటుతో మృతి చెందిన పెద్ద కొడుకు విష్ణువర్ధన్‌రెడ్డి
Hazarath Reddyసంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందారు. కొడుకు మృతదేహం చూసిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.
Andhra Pradesh Floods: ఏపీలో 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరో మూడు రోజులు భారీ వర్షాలు, ముంచెత్తిన వానతో పొంగిన వాగులు, నీటమునిగిన రహదారులు
Hazarath Reddyతీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.
Telangana Floods: మూసీ నదిలోకి భారీగా పెరిగిన వరద ప్రవాహం, అప్రమత్తమైన అధికారులు, నల్గొండ మూసీ ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఫలితంగా గండిపేట 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు తెరవడంతో.. మూసీ నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. మూసీకి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Telangana Floods: దిగువ గ్రామాలకు వణుకుపుట్టిస్తున్న కడెం ప్రాజెక్ట్, భారీగా చేరుతున్న వరద నీరు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది.
Patancheru MLA Son Dies: గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడు మృతి, కిడ్నీలు పాడవటంతో ఆస్పత్రిలో చేరిన విష్ణువర్ధన్‌రెడ్డి
Hazarath Reddyసంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందారు.
Telangana Floods: అర్థరాత్రి గ్రామాన్ని ముంచెత్తిన వరద, 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, జలదిగ్భంధంలో చిక్కుకుపోయిన మోరంచపల్లి గ్రామం, రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మోరంచపల్లి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఇళ్లు, భవనాలు మునిగిపోవడంతో మేడలపైకి వెళ్లి.. వర్షాల్లో తడుస్తూ మమ్మల్ని కాపాడండి ప్లీజ్ అంటూ.. సెల్ఫీవీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి
Srinivasa Sethu Flyover Accident: తిరుపతి ఫ్లైఓవర్ పనుల్లో మరోసారి ప్రమాదం, సిమెంట్ దిమ్మె అమర్చుతుండగా తెగిన వైర్లు, ఇద్దరు కార్మికులు మృతి
VNSతిరుపతిలో ఫ్లైవోవర్ పనుల్లో (Srinivasa Sethu Flyover) ప్రమాదం జరిగింది. శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనుల్లో క్రేన్లు వైర్లు తెగిపోయాయి. చివరి సిమెంట్ దిమ్మె అమర్చుతుండగా వైర్లు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
Red Alert Issued For Telangana: బీ అలర్ట్! ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు, తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, జీహెచ్‌ఎంసీ పరిధిలో గతరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన
VNSతెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరద (Flood) నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Tourists Rescued By NDRF: ములుగు అడవిలో తప్పిపోయిన 84 మంది టూరిస్టులు సేఫ్‌, సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఎన్డీఆర్ఎఫ్, రాత్రంగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్
VNSములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను (Rescued By Police) పోలీసులు రక్షించారు. గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతం (Mutyaladhara waterfalls) చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అటవీ ప్రాంతానికి వచ్చారు.
Telangana Rains: షాకింగ్ వీడియో, వాగు దాటుతూ మహిళ గల్లంతు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘటన..
kanhaవాగు దాటుతూ మహిళ గల్లంతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం, చాపరాలపల్లి వద్ద కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతు.
Telangana Rains: భద్రాచలం వద్ద కొద్ది సేపటి క్రితం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ, 48 అడుగులకు చేరిన గోదావరి వరద
kanhaభద్రాచలం వద్ద కొద్ది సేపటి క్రితం రెండవ ప్రమాధ హెచ్చరిక జారీ గోదావరిలో రాత్రి 9.30 గంటలకు భద్రాచలం దగ్గర 48 అడుగులకు చేరిన గోదావరి వరద. రెండో ప్రమాద హెచ్చరిక జారీ. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారులపైకి చేరిన వరద నీరు, నిలిచిపోయిన రాకపోకలు.
Mulugu District Shocker: ములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది టూరిస్టులు..
kanhaములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది పర్యాటకులు.
Jitta Suspended from BJP: జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీజేపీ, పార్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ చర్యలు
Hazarath Reddyఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై వేటు వేసింది.చాలాకాలంగా బీజేపీలో ఉన్న జిట్టా కొన్ని రోజులుగా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.
Telangana: జీవో నెంబర్‌ 46 రద్దు చేయాలంటూ నూతన సెక్రటేరియట్‌ను ముట్టడించిన కానిస్టేబుల్‌ అభ్యర్థులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyజీవో నెంబర్‌ 46ను రద్దు చేయాలంటూ కానిస్టేబుల్‌ అభ్యర్థులు నూతన సెక్రటేరియట్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సచివాలయం గేటు వద్దకు దూసుకొచ్చారు.
Data on Women Missing in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 72,767 మంది బాలికలు, మహిళలు మిస్సింగ్, వివరాలను వెల్లడించిన కేంద్రం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంట్‌కు నివేదించింది
TSRTC T9-30 Ticket: టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్, రూ.50 చెల్లిస్తే 12 గంటలపాటు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించవచ్చు
Hazarath Reddyగ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని #TSRTC ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.