రాష్ట్రీయం

Tirupati Fire: వీడియో ఇదిగో, తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం, గోవింద రాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు

Hazarath Reddy

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోవింద రాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలు.. చుట్టూ పక్కల దుకాణాలకు వ్యాపిస్తున్నాయి.

Kodali Nani Challenge To Chandrababu: దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేయ్, చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని

Hazarath Reddy

గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి’’ అని కొడాలి నాని పేర్కొన్నారు.

AP TIDCO Houses Inauguration: 175 సీట్లలో అభ్యర్థులను నిలబట్టలేని ఆ వ్యక్తి మనకు ప్రత్యర్థి, టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాబుపై విరుచుకుపడిన సీఎం జగన్

Hazarath Reddy

రాష్ట్ర సర్కార్‌ నిర్మిస్తోంది జగనన్న కాలనీలు కాదని.. ఏకంగా ఊర్లు కడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన లబ్ధిదారులు, ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు

Andhra Pradesh Horror: బాపట్లలో దారుణం, పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు, చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

Hazarath Reddy

ఏపీలోని బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ దారుణ ఘటన జరిగింది.

Advertisement

CM KCR on Bandi Sanjay Comments: బండి సంజయ్ వ్యాఖ్యలను బక్వాస్ అంటూ కొట్టిపారేసిన కేసీఆర్, 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారన్న తెలంగాణ బీజేపీ చీఫ్

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మతో టచ్‌లో ఉన్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను బక్వాస్ అంటూ కొట్టిపారేశారు. వీడియో ఇదిగో..

Murmu’s Hyderabad Visit – Traffic Restrictions: నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రేపు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సీజీపీకి హాజరుకానున్న ముర్ము.. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ రోజు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Rudra

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ముర్ము ఈ రోజు రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట విమానాశ్రయమంలో దిగనున్న ఆమె నేరుగా రాజ్‌భవన్ చేరుకుని ఈ రోజు రాత్రి అక్కడ బస చేయనున్నారు.

Trains Cancelled: తాడి-అనకాపల్లి మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు

Rudra

విశాఖపట్టణం మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Edible Oil Prices Comedown: సామాన్యులకు ఊరట.. తగ్గనున్న వంటనూనెల ధరలు.. రిఫైన్డ్ నూనెలపై దిగుమతి సుంకం 17.5 నుంచి 12.5 శాతానికి తగ్గించిన కేంద్రం .. అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు

Rudra

పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరాభారంతో అల్లాడుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్! దేశంలో వంటనూనెల ధరలు మరింతగా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా శుద్ధి చేసిన (రిఫైన్డ్) వంట నూనెలపై(సోయాబీన్, సన్‌ఫ్లవర్) దిగుమతి సుంకాన్ని తగ్గించింది.

Advertisement

Acid Attack in Eluru: ఏలూరులో మహిళపై యాసిడ్ దాడి, డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా యాసిడ్ అటాక్ చేసిన దుండగులు

Hazarath Reddy

ఏపీలోని ఏలూరులోని విద్యానగర్‌లో దారుణం జరిగింది. వివాహితపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. రాత్రి స్కూటీపై వెళుతుండగా దుండగులు యాసిడ్ చల్లడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పతిలో చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు. అయితే, ఆమె కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: ఒకేసారి 100 జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్, మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు అందించే లక్ష్యంతో ముందడుగు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి.

AP ICET Results 2023 Declared: ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల, టాపర్‌గా రేణిగుంటకు చెందిన తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి, cets.apsche.ap.gov.in ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్‌ 2023 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను విడుద‌ల చేశారు.

Green Apple Awards to Telangana: తెలంగాణ సచివాలయానికి అంతర్జాతీయ అవార్డు, రాష్ట్రంలో అయిదు నిర్మాణాలకు యుకె గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు,హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. లండన్‌కు చెందిన గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను వివిధ విభాగాల్లో యాదాద్రి ఆలయం సహా ఐదు నిర్మాణాలు దక్కించుకున్నాయి.

Advertisement

Perni Nani Slams Pawan Kalyan: నా ఈకలు కూడా పీకలేవు పవన్, నీకంటే పెద్ద మొగోడిని నేను, రెండు చెప్పులు చూపిస్తూ మక్కెలిరిగిపోతాయంటూ పేర్ని నాని మాస్ వార్నింగ్

Hazarath Reddy

జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు.గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, పవన్‌ పూటకొక మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రోజుకొక డైలాగ్‌ చెప్పి పవన్‌ వ్యూహం అంటారు.

Groom Dies of Sunstroke: రెండు గంటల్లో పెళ్లి, వడదెబ్బతో కుప్పకూలి మృతి చెందిన పెళ్లి కొడుకు, సంవత్సరం వ్యవధిలో ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు

Hazarath Reddy

కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు వడదెబ్బతో కన్నుమూశాడు.ఈ విషాదకర ఘటన కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్ల బొరీ గ్రామంలో చోటుచేసుకుంది

Jagananna Suraksha: అర్హులై ఉండి పథకాలు అందని వారి కోసం సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, ఈ నెల 23 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం

Hazarath Reddy

ప్రజా సమస్యలను సం­తృప్త స్థాయిలో పరిష్కరించడం, అర్హులెవరూ మిగిలిపోకుండా పథకా­లను అందించడమే లక్ష్యంగా ఈనెల 23వతేదీ నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వ­హించ­నున్నట్లు సీఎం ప్రకటించారు.

IIIT Basara Student Dies: బాసర త్రిపుల్ ఐటీలో వరుస మరణాలు, రెండు రోజుల్లోనే ఇద్దరు విద్యార్ధినులు మృతి, నాలుగో అంతస్తు నుంచి కిందపడి స్టూడెంట్ మరణం, ఆత్మహత్య కాదు ప్రమాదమే అంటున్న యాజమాన్యం, పోలీసుల దర్యాప్తు

VNS

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో (IIIT) మరో విషాదం చోటుచేసుకుంది. దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే మరో విద్యార్థిని మృతిచెందింది. అర్థరాత్రి లిఖిత అనే విద్యార్థిని భవనంపై నుంచి దూకి మృతిచెందింది. విద్యార్థిని స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతం. లఖిత హాస్టల్ నాలుగో అంతస్తుపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.

Advertisement

Elephants Hit By Vehicle: చిత్తూరులో ఘోర ప్రమాదం, రోడ్డుదాటుతున్న ఏనుగులను ఢీకొట్టిన వాహనం, మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతి

VNS

చిత్తూరు జిల్లా (Chittoor District) పలమనేరు (Palamaneru) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం ఢీకొని మూడు ఏనుగులు మృతి చెందాయి. చిత్తూరు-పలమనేరు జాతీయ రహదారిపై అటవీ సెక్షన్ సమీపంలో జగమర్ల క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్న మూడు ఏనుగులను (3 Elephants Dies) ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే మూడు ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు.

Pawan Kalyan: సొంత చిన్నాన్న రక్తం జగన్ చేతికి అంటుకుని ఉంది, ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హుడా..కత్తిపూడి వేదికగా కత్తులు దూసిన జనసేనాని పవన్ కళ్యాణ్

kanha

కత్తిపూడి వేదికగా పొలిటికల్ కత్తులు దూశారు జనసేనాని పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో కక్ష గట్టి ఓడించారని.. కానీ..ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తామన్నారు పవన్.

Elephants Enter Village: అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన ఏనుగుల గుంపు, హడలిపోయిన పార్వతీపురం జిల్లా వాసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తాగునీటి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం జిల్లా పూజారిగూడ గ్రామంలోకి ఏడు ఏనుగుల గుంపు ప్రవేశించగా వాటిలో కొన్ని బకెట్లు, కంటైనర్‌లో ఉంచిన నీటితో దాహం తీర్చుకున్నాయి. గ్రామస్తులు రెండు బకెట్లలో నిల్వ ఉంచిన నీటిని ఏనుగులు తాగుతున్న దృశ్యాలు కనిపించాయి.

Amit Shah Telangana Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు, జేపీ నడ్డా సభ యథావిధిగా కొనసాగుతుందని తెలిపిన తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్

Hazarath Reddy

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్‌జాయ్‌ తుపాను కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది.

Advertisement
Advertisement