రాష్ట్రీయం
Sangareddy: కరెంట్ పోల్‌పై కూర్చోని వ్యక్తి హల్చల్, కుటుంబ కలహాల నేపథ్యంలో పోల్ ఎక్కిన యువకుడు..జగ్గారెడ్డి రావడంతో కిందకు దిగిన వినోద్..వీడియో
Arun Charagondaసంగారెడ్డిలో కరెంట్ పోల్‌పై కూర్చోని వ్యక్తి హల్చల్ చేశాడు. తనని ఇంట్లో ఉండనివ్వడం లేదని పోల్ ఎక్కాడు రాజంపేటకు చెందిన వినోద్. జగ్గారెడ్డి వస్తే దిగుతానని పైన నుండి చిటీలు రాసి కింద పడేశాడు వినోద్. జగ్గారెడ్డి రావడంతో కిందకు దిగి తన సమస్యను చెప్పాడు.
Roja: జగన్‌ను మళ్లీ సీఎం చేసే వరకు పోరాటం ఆపం, జగన్ కట్ అవుట్ చూస్తేనే కూటమి ప్రభుత్వం భయపడుతోందని మండిపడ్డ మాజీ మంత్రి రోజా
Arun Charagondaజగన్ ను మళ్లీ సీఎం ను చేసే వరకు ఈ పోరాటం ఆపను అని తేల్చిచెప్పారు మాజీ మంత్రి రోజా. అధికారంలోకి రాకముందు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నాడు..కానీ ఇప్పుడు బాబు ష్యూరిటీ, బాదుడే బాదుడు గ్యారెంటీ అయిపోయిందన్నారు. పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో కూడా పబ్బులు,బెల్ట్ షాపులు పెడుతున్నారుఅని మండిపడ్డారు రోజా. జగన్ కట్ అవుట్ కు కూడా కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు
CM Revanth Reddy On Pushpa 2 Stampede: ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదు, అల్లు అర్జున్ అసలు మనిషేనా?..అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Arun Charagondaతాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పుష్ప 2 విషాదంపై మాట్లాడిన సీఎం రేవంత్...అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా?...దేనికి మీ పరామర్శలు.. సినీ ప్రముఖులను ప్రశ్నించారు.
CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ
Arun Charagondaసంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్...ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం దీనికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములే కారణం అని మండిపడ్డారు. రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా చెప్పాలన్నారు.
Telangana: మీడియా ఎస్‌ఐ చిందులు, ఏం చేసుకుంటారో చేసుకోమని జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిన ఎస్‌ఐ గీత...ఎస్‌ఐపై జర్నలిస్టుల ఫైర్
Arun Charagondaజగిత్యాల జిల్లాలో మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు జగిత్యాల టౌన్ ఎస్ఐ గీత. పోలీస్ స్టేషన్ వద్ద ఓ సమస్య పై బాధితులు మాట్లాడుతుండగా పలు ఛానల్ మైక్ లు తీసివేశారు ఎస్సై. ఏం చేసుకుంటారో చేసుకోమని జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
YS Jagan Birthday Celebrations: జగన్ బర్త్ డే వేడుకల్లో అల్లు అర్జున్ ఫోటో, ఎన్టీఆర్ జిల్లాలో జగన్‌తో పాటు బన్నీ ఫోటోను ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు...వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaమాజీ సీఎం జగన్ బర్త్ డే వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీ లో అల్లు అర్జున్ ఫోటో పెట్టి బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటో ను ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫ్లెక్సీపై రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అందరు ఏకం అవుతారంటూ కొటేషన్ వేయగా ఇది వైరల్‌గా మారింది.
KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం 100శాతం రుణమాఫీ అంటాడు.. ఎమ్మెల్యేలు 70శాతం రుణమాఫీ అంటున్నారు...మీ ఎమ్మెల్యేలకు కనీసం ట్రైనింగ్ అయినా ఇవ్వండని చురకలు అంటించారు కేటీఆర్. ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ...కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా చెప్పాలన్నారు.
TTD Darshan Tickets: టీటీడీ దర్శన టికెట్ల తేదీల్లో మార్పులు చేసిన టీటీడీ, మార్చి నెల టికెట్ల తేదీల మార్పు, అదే రోజు గదుల కోటా రిలీజ్
Arun Charagondaమార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో మార్పులు చేసింది టీటీడీ. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. 26వ తేదీ ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని వసతి గదులు కోటా విడుదల చేయనుంది.
Telangana: దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ ని ఢీ కొట్టిన డీసీఎం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి, చనిపోయిన వారిలో ఒక మహిళ...వీడియో
Arun Charagondaనల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మల్లేపల్లి రోడ్డులో గల దర్గా దగ్గర బైక్ ని ఢీ కోట్టింది డీసీఎం.. బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మరణించారు. మృతులు దేవరకొండ మండలం తాటికొల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.. దర్గా నుండి దేవరకొండ పట్టణం వైపు వస్తున్నా బైక్ ని వెనుకనుండి వచ్చి డీసీఎం గుద్దడంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు.మృతులలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.
Tremors in Prakasam: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు.. భయంతో స్కూల్ నుంచి బయటకు పరుగులుతీసిన విద్యార్థులు
Rudraఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో శనివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు.
Hyderabad Traffic Restrictions: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడకలను నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
Nara lokesh: మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, కువైట్‌లో ఇబ్బందులు పడుతున్న మహిళను స్వస్థలం నెల్లూరుకు చెర్చిన లోకేష్
Arun Charagondaఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్ .నెల్లూరుకు చెందిన షేక్ మున్నీ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించండి అన్న అంటూ మంత్రి లోకేష్ ను "ఎక్స్" లో కోరగా మంత్రి లోకేష్ స్పందించారు.
Actor Mohan Babu: తన ఫోటోలు, వాయిస్ ను గూగుల్ లో, సోషల్ మీడియాలో వాడొద్దని కోర్టుకు మోహన్ బాబు.. తొలగించాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం
Rudraఇప్పటికే వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన నటుడు మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. తన ఫోటోలు, వాయిస్ ను గూగుల్ లో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని అందులో అభ్యర్థించారు.
Road Accidents in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా దేవరకొండలో ముగ్గురు.. సత్యసాయి జిల్లాలో నలుగురు మృతి
Rudraరోడ్డు ప్రమాదాలతో తెలుగు రాష్ట్రాలలోని రహదారులు శనివారం తెల్లవారుజామున నెత్తురోడాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తంగా ఏడుగురు మరణించగా పలువురు గాయపడ్డారు.
Fire Accident In Software Company: హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు (వీడియో)
Rudraహైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఈ ఘటన జరిగింది.
Rains Alert for Hyderabad: హైదరాబాద్ లో మారిన వాతావరణం, నగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన ఐంఎడీ, అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం
VNSబంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో (Hyderabad Rains) రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD Hyderabad) అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరిగి, చలి తీవ్రత (Cold Wave) తగ్గింది.
Case on KTR: కేటీఆర్ పై మరో కేసు నమోదు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ
VNSఫార్ములా-ఈ కార్ రేస్ (Formula E Car Race) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై ఏసీబీ (ACB) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ECIR) నమోదు చేశారు.
Traffic Restrictions In Hyderabad:హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లో వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన పోలీసులు
VNSఎల్బీస్టేడియంలో శనివారం సాయంత్రం ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాలలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
Pawan Kalyan Performs Dhimsa Dance: వీడియో ఇదిగో, మహిళలతో కలిసి పవన్ కళ్యాణ్ థింసా నృత్యం, మన్యం జిల్లా పర్యటనలో స్థానిక మహిళలతో కలిసి కాలు కదిపిన డిప్యూటీ సీఎం
Hazarath Reddyమహిళలతో కలిసి పవన్ కళ్యాణ్ థింసా నృత్యం చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. మన్యం జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థింసా నృత్యం చేశారు. స్థానిక మహిళలతో కలిసి ఆయన కాలు కదిపారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆయన నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Viral Video: పిల్లి నాకిన పిండితో పరోటాలు, హైదరాబాద్ బండ్లగూడలోని ఓ హోటల్ నిర్వాకుడి ఘనకార్యం...వీడియో
Arun Charagondaపిల్లి నాకిన పిండితో పరోటాలు... హైదరాబాద్-బండ్లగూడలోని ఓ హోటల్‌లో నిర్వాకం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవైపు పరోటా పిండిని పిల్లి నాకుతుంటే, అదే పిండితో పరోటాలు చేశాడు హోటల్ నిర్వాహకుడు. కస్టమర్ తీసిన వీడియో ద్వారా విషయం బయటకు రాగా వైరల్‌గా మారింది.