ఆంధ్ర ప్రదేశ్

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్, ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఏపీ డీజీపీ షాక్, హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో లేని ఐపీఎస్‍లకు మెమో, 16 మంది అధికారులకు షాకిచ్చిన డీజీపీ

Arun Charagonda

ఏపీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు షాకిచ్చారు డీజీపీ. వెయిటింగ్‍లో ఉంటూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండని ఐపీఎస్‍లకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‍ లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్‍లకు డీజీపీ ఆదేశాలిచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Andhra Pradesh: కుటుంబ కలహాల నేపథ్యంలో కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య, బతకడం ఇష్టం లేదంటూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో

Hazarath Reddy

కుటుంబ కలహాల నేపథ్యంలో కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య.. మాచర్ల పట్టణానికి చెందిన చక్క రాజేష్ 30 సంవత్సరాలు, రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో తన కుటుంబంలో కలహాలు ఉన్నట్లు, ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోను పోస్ట్ చేశారు.

Andhra Pradesh: తెలంగాణ స్థానిక‌త ఉన్న 122 మంది ఉద్యోగుల‌ను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం, ఇకపై సొంత రాష్ట్రంలోనే ప‌ని చేయ‌నున్న ఉద్యోగులు

Hazarath Reddy

తెలంగాణ స్థానిక‌త ఉన్న 122 మంది ఉద్యోగుల‌ను రిలీవ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఇక‌పై తెలంగాణ‌లో ప‌ని చేయ‌నున్నారు.

Advertisement

Duvvada Srinivas: క్లాసికల్ డ్యాన్స్ వీడియో రిలీజ్ చేసిన మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ ఘటన నేపథ్యంలో మాధురి ట్వీట్ వైరల్

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. మాధురి ఆత్మహత్య యత్నం చేసుకోగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇంత పెద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో తన క్లాసికల్ డ్యాన్స్ చూడాలనుకునేవారి కోసం వీడియో రిలీజ్ చేసింది మాధురి.

Andhra Pradesh Shocker: వైరల్ వీడియో.. యువకుడిని చిత్ర హింసలు పెట్టిన స్నేహితులు, ఆస్పత్రిలో చేరిక, చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడి తల్లి ఆరోపణ

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ లో దాడుల సంస్కృతి పెరిగిపోతోంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం, చిన్నపరిమి గ్రామంలో ఆగస్టు 6వ తేదీన ఓ వ్యక్తిని తీసుకెళ్లి, అతని స్నేహితులు దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తన కుమారుడిని కొట్టిన వ్యక్తులు మళ్లీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తన కొడుకును చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది

Andhra Pradesh Shocker: కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య, మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసుని హతమార్చిన దుండగులు

Arun Charagonda

ఏపీలో హత్యారాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్యకు గురయ్యాడు. పత్తికొండ మండలం హోసూరులో మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసుని హతమార్చారు దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Visakhapatnam: గిన్నెలు కడగలేదని కూతురుపై తల్లి దాడి, బాలికకు తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

విశాఖపట్నంలో అమానుషం చోటు చేసుకుంది. గిన్నెలు కడగ లేదనే నెపంతో ఓ తల్లి దారుణానికి తెగబడింది. విశాఖపట్నం సింహాద్రి నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 13 సంవత్సరాల బాలికపై తన తల్లి తీవ్రంగా దాడి చేయగా ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతోంది బాలిక.

Advertisement

Fire Accident At Vishakapatnam Beach: విశాఖ బీచ్‌లో అగ్నిప్రమాదం, డైనో పార్కులో చెలరేగిన మంటలు, లక్షల రూపాయల ఆస్తి నష్టం

Arun Charagonda

విశాఖ బీచ్ రోడ్డులోని డైనో పార్క్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఏపీ మంత్రులు, నిర్వహణ లోపంపై చర్చ

Arun Charagonda

భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌లోని 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోగా 70 ఏండ్ల డ్యామ్‌ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఇక ఇవాళ తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Andhra Pradesh Shocker: అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపిన భర్త, పరారీలో నిందితుడు, పోలీసుల గాలింపు ముమ్మరం

Arun Charagonda

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపాడు భర్త. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుని గాలింపు చర్యలు చేపట్టారు.

Leopard Caught On Srisailam: వీడియో ఇదిగో.. శ్రీశైలంలో చిరుత పులి సంచారం, ఓ ఇంట్లో కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత పులి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వద్ద చిరుత సంచారం సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇంటి ప్రహరీ గోడ పై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లింది చిరుత పులి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు

Advertisement

Jurala Dam: జూరాల డ్యామ్‌ లో లీకేజీలు... తుంగభద్ర గేట్ ఘటన నేపథ్యంలో జూరాల డ్యామ్ భద్రతపై అనుమానాలు.. ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేత (వీడియో)

Rudra

తుంగభద్ర డ్యామ్ లో ఓ గేటు ఇటీవల కొట్టుకుపోవడం ఆ డ్యాం భద్రతపై అనుమానాలను రేకెత్తించింది. గేటు కొట్టుకుపోవడంతో భారీ ఎత్తున నీరు వృథాగా పోయింది. వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది.

Visakha MLC By Elections: సీఎం చంద్రబాబు వెనకడుగు, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటికి దూరం, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమే!

Arun Charagonda

అంతా ఉహించిందే జరిగింది. బలం లేని చోట పోటీ చేసి పరువు పొగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే ఉత్తమమని భావించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నంతో నామినేషన్ గడువు ముగస్తుండగా పోటీ చేయట్లేదని ప్రకటించారు చంద్రబాబు. ఇందుకు సంబంధించి విశాఖ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం లేకుండా పోటీ చేయడం సరికాదని కేడర్‌కు తేల్చి చెప్పారు చంద్రబాబు.

Sagar, Srisailam Gates Closed: తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు

Rudra

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అన్ని గేట్లను అధికారులు మూసి వేస్తున్నారు.

ACB Raids in Jogi Ramesh Residence: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు.. అగ్రి గోల్డ్ భూములకు సంబంధించే ఈ దాడులు

Rudra

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఏసీబీ సోదాలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది.

Advertisement

Vangalapudi Anitha On YS Jagan: జగన్‌ను జైల్లో వేయాలి, భద్రత తొలగింపుపై అన్నీ అబద్దాలే, తప్పు చేసిన వారు జైలుకు వెళ్లాల్సిందేనన్న ఏపీ హోంమంత్రి అనిత

Arun Charagonda

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను జైలులో వేయాలన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. మీడియాతో మాట్లాడిన అనిత..తన భద్రత కుదింపుపై జగన్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో జగన్ 950 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకున్నారని అది ఒక గ్రామం ఓటింగ్‌తో సమానమని ఇప్పుడు అంతమంది పోలీసులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు.

Botsa Satyanarayana Files Nomination: విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్, రాజకీయాలను వ్యాపారం చేశారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

Arun Charagonda

విశాఖపట్నం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు బొత్స. రాజకీయాలను టీడీపీ నేతలు వ్యాపారంగా మార్చారని తెలిపారు.

Nellore: కుటుంబ కలహాలు, పట్టాలపై పడుకొని ఆత్మహత్యయత్నం, కాపాడిన కానిస్టేబుల్..వీడియో వైరల్

Arun Charagonda

పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు ఓ యువకుడు. నెల్లూరు - రంగనాయకులపేటకి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పి.చెన్నయ్య ఆ వ్యక్తిని కాపాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ డ్రామా, నాలుగో రోజు దువ్వాడ శ్రీనివాస్ ఆఫీస్‌ ముందు వాణి ఆందోళన, మాధురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి, ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. మా నాన్న మాకు కావాలి అంటూ శ్రీనివాస్ కుమార్తెలు మీడియా ముందుకు రావడంతో రెండు సంవత్సరాలుగా ఇంట్లోనే రగులుతున్న విషయం కాస్త బయటకు వచ్చింది.

Advertisement
Advertisement