ఆంధ్ర ప్రదేశ్

Inner Ring Road Case: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కి వాయిదా, అప్పటి వరకు లోకేశ్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ అక్టోబరు 3వ తేదీకి వాయిదా పడింది. రెండ్రోజుల క్రితం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు.

Andhra Pradesh Shocker: తిరుపతిలో విషాదం, భార్యతో గొడవపడి ఆటోలో నుంచి దూకేసిన భర్త, ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపే మృతి

Hazarath Reddy

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో భార్యతో తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆటో రిక్షా నుంచి దూకి (35) ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఇటుక బట్టీల కార్మికుడు కోట్లపాటి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు.

YSR Vahana Mitra: త్వరలో కురుక్షేత్ర యుద్ధం, మీకు మంచి జరిగిందనిపిస్తే నా పక్షాన నిలవండి, వాహనమిత్ర నిధుల కార్యక్రమంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఏపీలో త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని తెలిపారు.పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు

Andhra Pradesh: విశాఖలో విషాదం, తల్లిదండ్రులు గొడవలు చూడలేక కూతురు ఆత్మహత్య, నా అంత్యక్రియలకు డబ్బులు ఖర్చు చేయవద్దని, అవయువాలు దానం చేయాలని సూసైడ్ నోట్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ దురదృష్టకర సంఘటనలో పాతపట్నం పట్టణంలో 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. టీనేజ్ అమ్మాయి తన కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలకు హాజరైన ఒక రోజు తర్వాత ఈ షాకింగ్ సంఘటన జరిగింది.

Advertisement

YSR Vahana Mitra Scheme: వైఎస్సార్‌ వాహన మిత్ర నిధులు విడుదల చేసిన సీఎం జగన్, డ్రైవర్ల అకౌంట్లోకి నేరుగా రూ. 10 వేలు..

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం మరో పథకానికి సంబంధించి నిధుల్ని విడుదల చేసింది. సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు వైఎస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra) పథకం నిధులను నేడు సీఎం జగన్ విడుదల చేశారు.

Inner Ring Road Case: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు, విచారణకు సహకరించాలని ఆదేశాలు, నోటీసులు అందజేయాలని సీఐడీకి సూచన

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

Hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో ఇంకా కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనాలు.. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్‌ వైపు బారులు (లైవ్ వీడియో)

Rudra

హైదరాబాద్‌లో రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్‌ (Hussain Sagar) వైపు బారులు తీరారు.

Newyork is Sinking: అంతకంతకూ కుంగుతున్న న్యూయార్క్‌ నగరం.. ఏటా 1.6 మిల్లీ మీటర్ల చొప్పున భూమి లోపలికి కుంగుతుందంటున్న నాసా.. కారణం ఏంటో తెలుసా?

Rudra

అమెరికాలో అతిపెద్ద నగరం న్యూయార్క్ కుంగుతున్నది. ఏటా సుమారు 1.6 మిల్లీమీటర్లు భూమి లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడైంది.

Advertisement

Yuvagalam padayatra Postponed: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర వాయిదా, అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ నేపథ్యంలో కీలక నిర్ణయం

Hazarath Reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే.

Skill Development Scam Case: చంద్రబాబు అరెస్ట్, ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జగన్ సర్కారు

Hazarath Reddy

ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Andhra Pradesh: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అగ్ర నేతలతో సహా 26 మందికి హైకోర్టు నోటీసులు, పిటిషన్‌పై విచారణ నాలుగు వారాలకు వాయిదా

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత పిటిషన్‌లను విచారించిన జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా పలు దూషణలు పర్వం కొనసాగిన సంగతి విదితమే. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్‌ కంటెంప్ట్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది.

Andhra Pradesh: రహదారి భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం,రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో రహదారి భద్రత కోసం రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారి ప్రాజెక్టుల అంచనాలో 2 శాతం రహదారి భద్రతా నిధికి జమ చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

AP Assembly Session 2023: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా, జీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌తో సహా పలు కీలక బిల్లులకు ఆమోదం

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయిదోరోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సభలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఇక శాసన మండలిలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి.

Skill Development Scam Case: చంద్రబాబుకు రెండు కోర్టుల్లో చుక్కెదురు, బాబు పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు, బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

Hazarath Reddy

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జెల్లో రిమాండ్ ఖైదీగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ కోసం ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు, హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నారా లోకేష్‌

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్‌ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది

Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా, పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు విముఖత చూపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి విముఖత చూపించారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది

Advertisement

Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, చంద్రబాబు త్వరగా బయటకు రావాలంటూ చర్చిలో ప్రార్థనలు చేసిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

Hazarath Reddy

రాజమండ్రి లూధరన్ చర్చిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని, దేవుడి దీవెనలు, ఆశీస్సులతో ఆయన త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియో ఇదిగో..

Andhra Pradesh: గుంటూరు నుంచి తిరుపతికి హెలీకాప్టర్ ద్వారా గుండె తరలింపు, ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం వైఎస్ జగన్

Hazarath Reddy

ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గుంటూరులో ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడి అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.

Nara Lokesh: ఢిల్లీ వచ్చి అరెస్టు చేసే సత్తా లేని చెత్త కేసు నాపై పెట్టించాడు, యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారన్న నారా లోకేశ్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ప్రారంభం కాకూడదని జీవో 1 తెచ్చినా... యువగళం ఆగలేదని, జనగళమై గర్జించిందని అన్నారు.

AP Assembly Session 2023 Day 4: అసెంబ్లీలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌పై చర్చ, చంద్రబాబు హయాంలో రూ. 114 కోట్లు కొట్టేశారని తెలిపిన మంత్రి గుడివాడ అమరనాథ్

Hazarath Reddy

అసెంబ్లీలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌పై చర్చ సందర్భంగా మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ..చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారని తెలిపారు.

Advertisement
Advertisement