ఆంధ్ర ప్రదేశ్
AP Employee Union Leaders Meet CM Jagan: తన మనసు ఎప్పుడూ ఉద్యోగులకు మంచి చేయడమే కోరుకుంటుంది, ఉద్యోగ సంఘాల భేటీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్‌ నిర్ణయాలు, జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి
CM Jagan Mohan Reddy Action Plan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు, వైద్య, ఆరోగ్యశాఖలపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
Hazarath Reddyవైద్య, ఆరోగ్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు, పలువురు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు.
AP Inter Supplementary Results 2023 Out: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyఏపీ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ, వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన ఫలితాలను విజయవాడలోని ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ 19వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ ముందుకు వచ్చిన సునీతా రెడ్డి
Hazarath Reddyవైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.
Andhra Pradesh Shocker: పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో లవ్, అతను ఫోన్ ఎత్తడం లేదని ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య, యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగింత
Hazarath Reddyకృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.గన్నవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గన్నవరం పట్టణంలోని సినిమాహాళ్ల కూడలి సమీపంలో నివసిస్తున్న మొహమ్మద్‌ జాస్మిన్‌(20) బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.
Tax Devolution to Telugu States: తెలంగాణకు 2,486 కోట్లు, ఏపీకి 4,787 కోట్లు, రాష్ట్రాలకు 3వ విడత పన్ను నిధులను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ
Hazarath Reddyకేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు మూడో విడత పన్నుల వాటాను సోమ వారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తంగా రూ.1,18,280 కోట్ల మేర నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు రూ.2,486 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్ల నిధు లను విడుదల చేసింది.
Police Jeep Stolen by Thief: ఈ దొంగ మాములోడు కాదు, చిత్తూరు పోలీస్ జీపునే దొంగిలించి చెన్నైలో అమ్మేస్తుండగా పట్టుకున్న పోలీసులు
Hazarath Reddyచిత్తూరు : సోమవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో పోలీసు స్టేషన్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న పోలీస్ వాహనం మాయమైనట్లు పోలీసు గుర్తించారు. అప్రమత్తంమైన పోలీసులు సీసీ పుటేజ్ ను పరిశీలించగా తమిళనాడు రాష్ట్రం వేలూరుకి చేందిన వందవాసి అనే వ్యక్తి జీపును దొంగలించినట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని అతని వద్ద జీపును స్వాధీనం చేసుకున్నారు.
Kothakota Dayakar Reddy Passes Away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత.. దయాకర్ రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం
Rudraమక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.
Andhra Pradesh Shocker: వేరు కాపురం గొడవ, అత్తను, భార్యను దారుణంగా దారుణంగా కొట్టి చంపిన అల్లుడు, కర్నూలులో షాకింగ్ ఘటన
Hazarath Reddyకర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరు కాపురానికి భార్య ఒప్పుకోలేదని అత్తని, భార్యను ఓ అల్లుడు కిరాతకంగా కర్రతో కొట్టి చంపాడు.
CM Jagan Mohan Reddy on BJP: బీజేపీ నాతో ఉండకపోవచ్చు కానీ ప్రజలు నాతోనే ఉన్నారు, పల్నాడు సభలో బీజేపీపై నిప్పులు చెరిగిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyబీజేపీ అగ్రనేతల ఘాటైన దాడి తర్వాత బీజేపీపై ఎదురుదాడికి దిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీ తనతో ఉండకపోవచ్చని, అయితే ప్రజల ఆదరణ తనకు ఉందని సోమవారం వ్యాఖ్యానించారు.
Karumuri on Amit Shah Remarks: ఏపీ అన్ని రంగాల్లో నెంబర్ వన్ అని కేంద్రం చెబుతుంటే అవినీతి ఎక్కడుంది, అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి కారుమూరి
Hazarath Reddyవిశాఖపట్నం సభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటనలు ఇస్తుంటే, ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని అమిత్ షా వ్యాఖ్యానించడం సరికాదని కారుమూరి పేర్కొన్నారు.
Saptagiri to Join TDP: టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్న స్టార్ కమెడియన్ సప్తగిరి, చంద్రబాబు ఆదేశిస్తే చిత్తూరు జిల్లా నుంచి పోటీకి రెడీ అంటున్న నటుడు
Hazarath Reddyరాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు, స్టార్ కమెడియన్ సప్తగిరి ప్రకటించారు. తాను త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కమెడియన్ వెల్లడించారు.
Jagananna Vidya Kanuka: ఈ పిల్లల మేనమామగా ఎంతో సంతోషపడుతున్నా, జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్, ఏపీ ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyజగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించారు.‘‘పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం.
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు, రాగల రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 24 గంటల్లో ఉగ్రరూపం దాల్చనున్న బిపర్జోయ్ తుపాను
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
Half-Day Schools in AP: విద్యార్థుల భవిష్యత్ కోసం ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ఈ తరం పిల్లలకు గ్లోబల్‌ చదువులు, నేటి నుంచి 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు
Hazarath Reddyరాష్ట్రంలో వేసవి సెలవులు అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ఈ నెల 17వ తేదీ వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Jagananna Vidya Kanuka: స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక, నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను అందించిన సీఎం జగన్
Hazarath Reddyనాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను సీఎం జగన్‌ అందించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరు స్కూల్‌లో డిజిటల్‌ తరగతి గదులను పరిశీలించిన సీఎం జగన్‌.. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు.
Amit Shah Slams YS Jagan Govt: వీడియో ఇదిగో, నాలుగేళ్ల పాలనపై వైఎస్ జగన్‌ సిగ్గుపడాలంటున్న అమిత్ షా, అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ లేవని వెల్లడి
Hazarath Reddyరైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నందుకు వైఎస్ జగన్ సిగ్గుపడాలి. విశాఖపట్నం - నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ చేయలేదు. పేదల కోసం మోడీ రేషన్ ఉచితంగా బియ్యం పంపిస్తుంటే జగన్ బియ్యం మీద స్టిక్కర్ వేసుకుంటున్నాడు.
GVL Fail to Translate Amit Shah's Speech: వీడియో ఇదిగో, అమిత్ షా స్పీచ్ అనువాదం చేయలేక తడబడిన జీవీఎల్, అసహనం వ్యక్తం చేసిన హోం మంత్రి
Hazarath Reddyబీజేపీ నిర్వహించిన వైజాగ్ సభలో అమిత్ షా స్పీచ్ అనువాదం చేయలేక తడబడ్డాడు రాజ్య సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు. నేనేం చెప్తున్నా నువ్వేం అనువదిస్తున్నావు అంటూ అసహనం వ్యక్తం చేసిన అమిత్ షా. వీడియో ఇదిగో..
Tiger Eats Grass: మహారాష్ట్ర యావత్వాల్ అడవుల్లో గడ్డి తిన్న రెండు పులులు.. అదురైన దృశ్యాన్ని ఫొటో తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్.. ఆహారం అరగకపోతే పులులు గడ్డి తింటాయంటున్న నిపుణులు
Rudraఎంత కరువొచ్చినా పులి గడ్డి మేయదని సామెత. అయితే, ఇప్పుడు దాన్ని తిరగరాయాల్సిన పరిస్థితి. అవును. పులి క్రూర జంతువు, మాంసాహారి అని అందరికీ తెలుసు. ఐతే, అలాంటి పులి గడ్డి తింటోందంటే మీరేమంటారు?
Road Accident In EG: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి.. మృతుల్లో రెండేండ్ల చిన్నారి కూడా..
Rudraతూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.