ఆంధ్ర ప్రదేశ్

Avinash Reddy Parents Hospitalized: అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ తీవ్ర అస్వస్థత, తండ్రి భాస్కర్‌ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్న జైలు అధికారులు

Hazarath Reddy

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్‌ రెడ్డికి రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్‌ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Navaratnalu-Pedalandariki Illu: ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం, నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ, చంద్రబాబును నమ్మకూడదని తెలిపిన సీఎం జగన్‌

Hazarath Reddy

దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజయం’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు.

Navaratnalu-Pedalandariki Illu: అమరావతిలో పేదల పండుగ, 50,793 మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ, నవ­రత్నా­లు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద అందజేసిన సీఎం జగన్

Hazarath Reddy

సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధిలో 50,793 మంది పేద మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్ర­వారం (నేడు) ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద ‘నవ­రత్నా­లు–­పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేశారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసు, అవినాష్ రెడ్డికి మద్ధతు ప్రకటించిన కేఏ పాల్, కడప ఎంపీకి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నానని వెల్లడి

Hazarath Reddy

నేను టర్కీ వెల్లాలి కానీ నిన్న వైఎస్ విమలా దేవి వీడియో చూసి నాకు హార్ట్ టచ్ అయింది. దీంతో అవినాష్ రెడ్డి తల్లిని చూద్దాం అని కర్నూలుకు వచ్చాను. నేను ముక్కు సూటిగా అవినాష్ రెడ్డిని వివేకాకు న్యాయం జరగాలని అడిగాను. అవినాష్ రెడ్డిని అన్యాయంగా నిర్దోషిని దోషిగా చిత్రీకరిస్తున్నారు. నేను అవినాష్ రెడ్డికి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా - కేఏ పాల్

Advertisement

Tirupati Rains: తిరుపతిలో గాలీవాన బీభత్సం, భారీ వర్షంతో శ్రీవారి ఆలయ చుట్టుపక్కల రోడ్లన్నీ జలమయం

Hazarath Reddy

తిరుమలలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షంతో శ్రీవారి ఆలయ చుట్టుపక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. క్యూలైన్లలోకి వర్షపు నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

Navaratnalu Pedalandariki Illu: సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద మహిళలకు ఇళ్ళపట్టాలు పంపిణీ, నవ­రత్నా­లు–­పేదలందరికీ ఇళ్లు పథకం కింద అందజేయనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధిలో 50,793 మంది పేద మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్ర­వారం (నేడు) ఇళ్ల పట్టాల పంపిణీ చేయను­న్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద ‘నవ­రత్నా­లు–­పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేయనున్నారు.

Saivarshith-Biden Case: బైడెన్‌ను చంపేందుకే వచ్చానన్న తెలుగు యువకుడు సాయివర్షిత్ కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా?!

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- తెలుగు యువకుడు సాయివర్షిత్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బైడెన్‌ ను చంపుతానంటూ వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టిన సాయివర్షిత్‌కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

APPSC Group 1 & Group 2 Notification: ఏపీలో 1000 ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

Hazarath Reddy

గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉగ్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్‌-1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Advertisement

Andhra Pradesh: అమరావతిలో బందోబస్తు కోసం వచ్చిన పోలీసు, రాత్రి రోడ్డు మీద పడుకుని ఉండగా పాము కాటేయడంతో మృతి

Hazarath Reddy

అమరావతిలో భూముల పంపిణీ కోసం ఈ నెల 26న వస్తున్న వైఎస్ జగన్. బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు. రోడ్డుపై ఉద్యోగం చేస్తూ పాము కాటుతో రోడ్డుపై పైనే ఏపీ పోలీస్ మృతి.

New Parliament Building Inauguration: విభేదాలు పక్కనబెట్టి ప్రారంభోత్సవానికి రండి, ప్రతిపక్షాలను కోరిన సీఎం జగన్, నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి వైసీపీ హజరవుతుందని వెల్లడి

Hazarath Reddy

విశాలమైన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసినందుకు ప్రధాని మోదీకి నా అభినందనలు . పార్లమెంటు, ప్రజాస్వామ్య దేవాలయం, మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది. మన దేశ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు.

AP Weather Report: ఏపీ వాతావరణం రిపోర్ట్ ఇదిగో, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో వేడిగాలులు, ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

Hazarath Reddy

ఏపీలో వాతావరణంపై ఏపీ వెదర్ డిపార్ట్ మెంట్ అప్ డేట్ ఇచ్చింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాలో వర్షాలు పడతాయని, మరి కొన్ని జిల్లాల్లో ఎండలు ఎక్కువగా కాస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

AP High Court on Children: పిల్లల్ని అత్తమామల దగ్గర నుంచి తండ్రి తీసుకువెళితే కిడ్నాప్ కిందకు రాదు, తండ్రి వారికి చట్టబద్ధ సంరక్షకుడని తెలిపిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

పిల్లలను అత్తమామల నుంచి తీసుకువెళ్లిన కేసులో తండ్రికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్తమామల నుంచి పిల్లల్ని తండ్రి తీసుకెళ్లడం కిడ్నాప్‌ కాదని తీర్పు ఇచ్చింది. సున్నీ మహ్మదీయ చట్టం ప్రకారం పిల్లలకు తండ్రి చట్టబద్ధ సంరక్షకుడని గుర్తుచేసింది

Advertisement

Jagananna Vidya Deevena: విద్యాదీవెన కోసం రూ.10,636 కోట్లు ఖర్చు, నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొవ్వూరు పర్యటనలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికా­నికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు.

Gangavva Apology to Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన గంగవ్వ, టీడీపీ అధినేతకు గ్రహణం పట్టిందంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం

Hazarath Reddy

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘మై విలేజ్ షో’ ఫేమ్ గంగవ్వ క్షమాపణలు చెప్పారు. ఆ మధ్య ఓ కార్యక్రమంలో చంద్రబాబుకు గ్రహణం పట్టింది’ అని గంగవ్వ వ్యాఖ్యానించారు. ఈ ఒక్క ముక్కను మాత్రమే కట్ చేసి వదలడంతో టీడీపీ అధినేత ప్రత్యర్థులు దాన్నో అవకాశంగా తీసుకుని మరింతగా వైరల్ చేశారు. ఈ క్రమంలోనే గంగవ్వ చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.

Jagananna Vidyadeevena: రెండో విడత జగనన్న విద్యాదీవెనను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తూర్పుగోదావరిలో జిల్లాల్లో టూర్‌ షెడ్యూల్ ఇది!

VNS

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో మరింత దూకుడు పెంచింది. ఈరోజు జగనన్న విద్యా దీవెన (Jagananna Vidyadeevena) పథకంలో భాగంగా రెండో విడత నగదును ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయనుంది. జనవరి -మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించి 9.95లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 703 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Kotamreddy Sridhar Reddy: ప్రజా ఉద్యమాలను ఆపలేరు, ఇక నుంచి గెరిల్లా తరహాలో ఉద్యమాలు చేస్తామని కోటం రెడ్డి హెచ్చరిక, గృహనిర్బంధం చేసిన పోలీసులు

Hazarath Reddy

వైసీపీ నుంచి ఉద్వాసనకు గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేస్తూనే ఉంటానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ఉద్యమాలను ఆపలేరని చెప్పారు.

Advertisement

MLA Anam Ramanarayana Reddy: చంద్రబాబు సై అంటే ఎక్కడినుంచైనా పోటీ చేస్తా, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు, నెల్లూరులో అన్ని సీట్లు గెలుస్తామని జోస్యం

Hazarath Reddy

వైసీపీ నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన భవిష్యత్ రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు.

Andhra Pradesh: తిరుపతిలో సొంత ఇళ్లతో సహా పలు ఇళ్లకు నిప్పంటించిన టీనేజ్ బాలిక, తల్లి అక్రమ సంబంధాలతో ఊరు విడిచి వెళ్లాలనుకోవడమే కారణం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో తన ఇళ్లతోపాటు పలు ఇళ్లకు నిప్పు పెట్టిన 19 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు, తన గ్రామాన్ని వదిలి వెళ్లాలనే ఉద్దేశంతో ఆమె ఇలా చేసిందని పోలీసులు తెలిపారు.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు, తెలంగాణ హైకోర్టులో ఈ నెల 25న విచారణకు ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌, విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు

Hazarath Reddy

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌ను ఈ నెల 25న విచారించాలని తెలంగాణ హైకోర్టుకు.. సుప్రీంకోర్టు సూచించింది. ముందుస్తు బెయిల్‌ కోసం ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకునే హక్కు అవినాష్‌ రెడ్డికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Flyer Dies of Heart Attack: విమానం గాల్లో ఉండగా వృద్ధుడికి తీవ్రమైన గుండెపోటు, ఫస్ట్‌ ఎయిడ్‌ చేసినా దక్కని ఫలితం, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో విషాదకర ఘటన

Hazarath Reddy

బంధువుల వివాహానికి షార్జా నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు.

Advertisement
Advertisement