ఆంధ్ర ప్రదేశ్
CM Jagan in Action: రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, మే నెలలో రైతు భరోసా ఇన్‌స్టాల్‌మెంట్, అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyతాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రబీలో ఇ– క్రాప్‌ బుకింగ్‌పై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు
Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, సీబీఐ దర్యాప్తు జూన్ 30 వరకు పొడిగింపు, అవినాష్‌ ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులు నిలిపివేత
Hazarath Reddyమాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ హత్య కేసులో దర్యాప్తు గడువును జూన్‌ 30 వరకు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ గడువు ఏప్రిల్‌ 30కి ముగియాల్సి ఉంది.
YS Vijayamma Clarity on Slap: నేను పోలీసును కొట్టలేదు, క్లారిటీ ఇచ్చిన వైఎస్ విజయమ్మ, తాను నిజంగా కొట్టాలనుకుంటే గట్టిగా కొట్టేదాన్నని వ్యాఖ్యలు
Hazarath Reddyజూబ్లీహిల్స్ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తాను పోలీసును కొట్టానంటూ టీవీ ఛానళ్లలో చూపిస్తున్నారని విజయమ్మ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తనపై పడుతుంటే కోపం రాదా అని ప్రశ్నించారు. తాను నిజంగా కొట్టాలనుకుంటే గట్టిగా కొట్టేదాన్నని అన్నారు.
JC Diwakar Reddy: రాయలసీమ నీటి కష్టాలు తీరాలంటే తెలంగాణలో కలపాల్సిందే, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
Hazarath Reddyరాయలసీమను తెలంగాణలో కలపాలని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అప్పుడే రాయలసీమకు నీటి కష్టాలు తీరుతాయని చెప్పారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కావచ్చని... కానీ, కలపడం మాత్రం సులభమేనని అన్నారు. రాయలసీమను తెలంగాణలో కలపడంపై ఎవరికీ అభ్యంతరాలు కూడా లేవని చెప్పారు.
AP Shocker: అందుకు ఒప్పుకోలేదని యువతిపై వేడి నూనె, బాధతో ఏడుస్తుంటే మీదపడి అత్యాచారం చేసిన కామాంధుడు, ఏలూరులో దారుణ ఘటన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలైన ఇంజినీరింగ్ విద్యార్థిని కాళ్లు, చేతులపై వేడివేడి నూనె పోసి ఆమె ఏడుస్తుంటే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడైన యువకుడు
JC Prabhakar Reddy House Arrest: జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్, రోడ్డుపై పడిపోయిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రకటనలు
Hazarath Reddyఅనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద దాదాపు 100 మంది పోలీసులు మోహరించారు. ఇంటి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
Papikondalu Tour Cancelled: పర్యాటకులకు గమనిక.. నేడు, రేపు పాపికొండల విహారయాత్ర రద్దు.. అకాల వర్షాలకు తోడు ఈదురు గాలులు.. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ యాత్రకు అనుమతిస్తామన్న అధికారులు
Rudraపర్యాటకులకు ముఖ్య గమనిక. ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాపికొండల విహారయాత్రను అధికారులు రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు.
Thunderstorms In AP: ఏపీలోని ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం.. విపత్తుల శాఖ వార్నింగ్.. పంట పొలాల్లో, ఆరుబయట చెట్ల కింద ఉండొద్దంటూ సూచన
Rudraఎర్రటి ఎండలు ఒకవైపు.. మరోవైపు అకాల వర్షాలు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా నెలకొన్న భిన్న వాతావరణపరిస్థితులతో అన్నదాతలను ఇక్కట్లు తప్పట్లేదు. వడగళ్ల వానలతో ఏపీలోని వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
Swaroopanandendra: సింహాచలం గర్భాలయంలో ఆచారాలు మంటగలిపారు.. శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఫైర్.. చందనోత్సవానికి సరైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం.. భక్తుల అవస్థలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన
Rudraసింహాచలం (Simhachalam) అప్పన్న చందనోత్సవ (Chandanotsavam) ఏర్పాట్లపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర (Swaroopanandendra) మండిపడ్డారు. ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల (Devotees) అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు.
Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం
Rudraప్రముఖ చలనచిత్ర నటుడు శరత్‌బాబు(71) ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈనెల 20న హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)లో చేర్పించారు.
Prof Ravva Srihari Passed Away: ప్రముఖ భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ సార్వభౌముడు రవ్వా శ్రీహరి కన్నుమూత.. గుండెపోటుతో కన్నుమూసిన శ్రీహరి.. కేంద్ర సాహిత్య అకాడమీ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్న భాషా శాస్త్రవేత్త
Rudraప్రముఖ భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ సార్వభౌముడు, నిఘంటు నిర్మాణకర్త ఆచార్య రవ్వా శ్రీహరి (80) (Prof Ravva Srihari) గుండెపోటుతో (Heart Attack) మృతి చెందారు. హైదరాబాద్ (Hyderabad) మలక్‌పేటలో (Malakpet) నివసిస్తున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుకు (Heart Attack) గురయ్యారు.
Guntur Shocker: గుంటూరులో పట్టపగలే షాకింగ్, చైన్ స్నాచర్ల విజృంభణ, వైరల్ వీడియో చూస్తే వామ్మో అంటారు..
kanhaగుంటూరు - కృష్ణనగర్లో నిన్న సాయంత్రం సుమారు 9 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు సీసీ కెమెరాలు ఉన్నా దర్జాగా వచ్చి మహిళ మెడలో చైన్ కొట్టుకుపోయారు.
Thundershowers In AP: ఏపీ వాసులకు అలర్ట్.. నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.. ఈ నెల 25 వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ.. ఏపీలోని పలు జిల్లాల్లో వడగాల్పులు
Rudraఏపీవాసులకు అలర్ట్. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ఫుల్ డిమాండ్.. రెట్టింపు కానున్న కోచ్‌లు.. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న రైలు.. 16 బోగీలతో నడపాలంటూ రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు.. మరో 10 రోజుల్లోనే అందుబాటులోకి అదనపు కోచ్‌లు
Rudraప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-తిరుపతి (Secunderabad-Tirupati) మధ్య ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ (Vande Bharat Express) రైలుకు ముందుగా ఊహించినట్టుగానే ప్రయాణికుల (Passengers) నుంచి పెద్దయెత్తున డిమాండ్ (Demand) వస్తున్నది.
Eid-ul-Fitr 2023: ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, ఇది దివ్య ఖురాన్ అవతరించిన మాసం అని వెల్లడి
Hazarath Reddyసత్య నిష్ఠ, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాస దీక్షలతో పవిత్రంగా రంజాన్ మాసం ముగించుకుని, ఈదుల్ ఫితర్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న వారందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
Eid-ul-Fitr: ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, అల్లా దీవెనలతో అంతా మంచి జరగాలని ట్వీట్
Hazarath Reddyపవిత్ర పండుగ రంజాన్‌ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలియజేశారు. నెలవంక కనిపించడంతో శనివారం దేశవ్యాప్తంగా రంజాన్‌ నిర్వహించనున్నారు.
Chandrababu Yerragondapalem Tour: యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు, చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్, నిరసనకారులకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు.యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.చంద్రబాబు వాహనంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులు నిరసనకు దిగారు
Andhra Student Shot Dead: అమెరికాలో ఆంధ్రా విద్యార్థి దారుణ హత్య, పెట్రోలు బంకులో పనిచేస్తుండగా కాల్చి చంపిన దుండగులు
Hazarath Reddyమాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థిని అమెరికాలోని ఓ ఫ్యూయల్ స్టేషన్‌లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) కాల్చి చంపినట్లు కొలంబస్ డివిజన్ ఆఫ్ పోలీస్ అధికారులు తెలిపారు.ఓహియోలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్న సాయీష్ వీరా ఉద్యోగంలో ఉండగా గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
Andhra Pradesh Fire: అమరావతిలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో మాడి మసైపోయిన రాజధాని అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన నిర్మాణ సామగ్రి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన నిర్మాణ సామగ్రి శుక్రవారం భారీ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది.ఈ ఘటన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో చోటుచేసుకుంది.
AP DSC 2023 Notification: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌, ఎన్ని పోస్టులనే దానిపై కసరత్తు చేస్తున్న సర్కారు, త్వరలో గ్రూప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
Hazarath Reddyనిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.