ఆంధ్ర ప్రదేశ్

AP Cabinet Meeting: నేడు కొత్త మంత్రులతో ఏపీ కేబినెట్ తొలిసారి భేటీ, ప్రధాన చర్చ ఆ రెండు అంశాలపైనే, కీలక నిర్ణయాలు తీసుకుంటారని చర్చ..

Krishna

ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ జరగనుంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. నిజానికి ఈ సమావేశం రేపు జరగాల్సి ఉండగా.. ఒకరోజు ముందే నిర్వహిస్తున్నారు.

AP Shocker: సంస్కృతం మాస్టారు రాసలీలలు, కామ‌వాంఛ తీరిస్తే పరీక్షలో పాస్ చేయిస్తానంటూ, కాలేజీ విద్యార్థినితో లెక్చరర్ అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

Krishna

చదువు నేర్పాల్సిన గురువే ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తండ్రి స్థానంలో ఉంది విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువు దారి తప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలాంటి కాలేజీ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. భయంతో ఆ విద్యార్థిని కాలేజీకి వెళ్లనని చెప్పింది. ఏమైందని తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

C Narasimha Rao Passes Away: ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకులు సి. నరసింహారావు కన్నుమూత, సంతాపం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

Krishna

హైదరాబాద్, మే 12: ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి. నరసింహారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.

Cyclone Asani: కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరం దాటిన అసని తుఫాను, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, సముద్ర తీర ప్రాంత ప్రజలకు అలర్ట్, 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం..

Krishna

రెండ్రోజులుగా ఏపీ ప్రజల గుండెల్లో గుబులు రేపిన అసని తుఫాను ఎట్టకేలకు తీరం దాటింది. అసని తుఫాను కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరాన్ని దాటింది. ఇక్కడ భూభాగాన్ని తాకిన అనంతరం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

Gadapa Gadapaku Mana Prabhutvam: ఇళ్ళు లేవని ఒక్క పేదవాడు నన్ను అడిగినా 2024లో ఎన్నికల్లో పోటీ చేయను, గడప గడపకు మన ప్రభుత్వం పోగ్రాంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుస్తున్న వ్యకి​ ప్రస్తుతం మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు తన కొడుకు, మనవడిని ఇంగ్లీష్‌ మీడియం చదివిస్తుంటే.. పేద ప్రజలకు ఇంగ్లీష్‌ మీడియం అందకుండా కోర్టులకు వెళ్తున్నారు.

Andhra Pradesh: ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, రోడ్డు ప్రమాద బాధితుడుకి వైద్యం చేయకుండా విశ్రాంతి తీసుకున్న డాక్టర్, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, కాంపౌండర్లు చికిత్స చేయడంతో బాధితుడు మృతి

Hazarath Reddy

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన బాధితుడికి అక్కడి ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, కాంపౌండర్లు చికిత్స చేశారు. ప్రథమచికిత్స చేసి, కట్లు కట్టి, మందులివ్వాల్సిన డాక్టరు.. ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి తాపీగా వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ఆ బాధితుడు (Road Accident Victim Dies) మరణించాడు.

Cyclone Asani: అసని తుఫాను ముప్పు, అధికారులతో సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌, ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలని ఆదేశాలు

Hazarath Reddy

ముప్పును మోసుకొస్తున్న అసని తుఫాను దెబ్బకు ఏపీ వణుకుతోంది. ఈ నేపథ్యంలో తుపాను (Cyclone Asani) ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌(CM YS Jagan emergency video conference ) చేపట్టారు. సహాయక చర్యలపై సమీక్ష జరుపుతున్నారు.

SSC Paper Leak Case: నారాయణకు బెయిల్ మంజూరు, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ 2014లోనే రాజీనామా చేసినట్టు వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు (Narayana) కోర్టులో ఊరట లభించింది. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో అరెస్టయిన ఆయనకు బెయిల్‌ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేస్తూ చిత్తూరు పట్టణ నాలుగో మేజిస్ట్రేట్‌ తీర్పునిచ్చారు.

Advertisement

Cyclone Asani: అసని తుఫాను దెబ్బ, ఏపీ తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రథం, మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందినదై ఉంటుందని తెలిపిన అధికారులు

Hazarath Reddy

మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సున్నపల్లి తీరంలో మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందిన బంగారు రంగుతో కూడిన రథం లాంటి నిర్మాణం కనిపించింది. గ్రామస్తులు కట్టకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు.

Cyclone Asani: దిశను మార్చుకున్న అసని తుపాను, మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరాన్ని తాకే అవకాశం, విశాఖ విమానాశ్రయంలో మొత్తం 68 సర్వీసులు రద్దు, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను (Cyclone Asani) బలహీనపడింది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. విశాఖ తీరానికి సమీపించి.. ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించిన తీవ్ర తుపాను మరోసారి దిశ మార్చుకుని మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోంది.

Andhra Pradesh: అసని తుఫాను కారణంగా నేడు జరగనున్న ప‌రీక్ష వాయిదా, తిరిగి మే 25, 2022న నిర్వ‌హిస్తామ‌ని ప్రకటించిన బోర్డు

Hazarath Reddy

బంగాళఖాతం నుంచి పొంచిఉన్న తీవ్ర తుఫాను అసని కారణంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో బుధవారం జరగనున్న పలు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. బుధవారం జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ -1ఎ సహా..వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు వాయిదా వేశారు.

SSC Paper Leak Case: రెండు దెబ్బలు కొడితే నారాయణకు ఏమైనా జరగవచ్చు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు, దెబ్బతిన్న వ్యక్తిగా చెబుతున్నానని వెల్లడి

Hazarath Reddy

నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో (SSC Paper Leak Case) అరెస్ట్ చేయడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజికి కారణమని సీఎం జగన్ అన్నారని, కానీ మంత్రి బొత్స సత్యనారాయణ అదంతా అబద్ధం అని చెప్పారని, ఇందులో ఏది నిజం, ఏది నమ్మాలి? అని రఘురామ (Raghuram Krishnaraju Reaction) ప్రశ్నించారు.

Advertisement

Paper Leak Case: నారాయణ అరెస్ట్‌, లీక్‌ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లేనని తెలిపిన అంబటి రాంబాబు, నారాయణ అరెస్ట్‌లో కక్ష సాధింపు ఏముందని ప్రశ్నించిన రాంచంద్రారెడ్డి, ఇంకా ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఆయన సొంత వాహనంలోనే ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు.

Paper Leak Case: ట్విస్టులతో సాగుతున్న నారాయణ అరెస్ట్ ఎపిసోడ్, అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ కేసులో మరో కేసు నమోదు, భగ్గుమంటున్న టీడీపీ నేతలు, ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఆయన సొంత వాహనంలోనే ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు.

CM Jagan First Cabinet Meeting Update: మే 12న సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ, మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలిసారిగా నూతన కేబినెట్‌ సమావేశం

Hazarath Reddy

ఏపీ మంత్రివర్గ విస్తరణ అనంతరం నూతన కేబినెట్‌ తొలిసారి మే 12న సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ (CM Jagan First Cabinet Meeting) నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Cyclone Asani: వీడియో.. విశాఖలో భారీ వర్షాలు, జలమయమైన రోడ్లు, ముప్పుని మోసుకొస్తున్న అస‌ని తీవ్ర తుఫాన్

Hazarath Reddy

Advertisement

Cyclone Asani: తీవ్ర తుఫాన్‌గా మారిన అస‌ని, వైజాగ్ విమానాశ్ర‌యంలో 23, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో 10 విమానాలు ర‌ద్దు, తూర్పు తీర ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు

Hazarath Reddy

ముప్పుని మోసుకొస్తున్న అస‌ని తీవ్ర తుఫాన్‌గా మారింది. దీంతో విమానాల‌ను ర‌ద్దు చేశారు. వైజాగ్ విమానాశ్ర‌యంలో 23, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో 10 విమానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం బంగాళాఖాతంలో స‌ముద్రం అల‌జ‌డిలో ఉంది. దీంతో తూర్పు తీర ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి.

Ponguru Narayana Arrest: టెన్త్‌ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్, ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు

Hazarath Reddy

మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణ అరెస్ట్‌ (Ponguru Narayana Arrest) అయ్యారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపులోకి (Ponguru Narayana arrested in Hyderabad) తీసుకున్నారు.

Cyclone Asani: ఇక 48 గంటలే.. సముద్రంలోనే తుపానుగా బలహీనపడే అవకాశం, కాకినాడ, విశాఖపట్నం మధ్య లేదా ఒడిశా తీరం వద్ద తీరం దాటే అవకాశం, ఆసానితో విశాఖలో పలు విమానాలు రద్దు

Hazarath Reddy

తీవ్ర తుఫాన్‌ ‘అసాని’ ఉత్తర కోస్తా దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి కోస్తాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై ఉన్న ‘అసని’ తీవ్ర తుపాను (Cyclone Asani) గంటకు 25 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది.

Cyclone Asani: గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఆసని తుఫాను, రెండు రోజుల్లో బలహీనపడే అవకాశం, ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్

Hazarath Reddy

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను అసని (Cyclone Asani) పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంది. అసని గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర, ఒడిశా వైపు పయనిస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

Advertisement
Advertisement