ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: రాజధానిపై మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు, తీర్పు ఊహించిందే.. త్వరలో మూడు రాజధానుల బిల్లులు పెడతాం, తీర్పు పూర్తిగా చదివాక అన్ని విషయాలపై మాట్లాడతామని తెలిపిన మంత్రి
Hazarath Reddyసమావేశం అనంతరం ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.హైకోర్టు తీర్పు మేం ఊహించిందేనని, తీర్పులో కొత్తదనం ఏమీ లేదని పేర్కొన్నారు.
Andhra Pradesh: మార్చి 4న కేంద్రమంత్రి షెకావత్‌తో ఏపీ సీఎం పోలవరం పర్యటన, పటిష్ఠ ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
Hazarath Reddyఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను (Polavaram on March 4 ) ఈనెల 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ (Union minister Gajendra Singh Shekhawat) పరిశీలించనున్నారు.
Section 144 imposed in AU: ఆంధ్ర వర్సిటీ, పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్, చలో ఏయూ కు పిలుపునిచ్చిన ఏయూ పరిరక్షణ పోరాట సమితి
Hazarath Reddyవిశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో పలు అక్రమాలు, అవినితీ ఆరోపణకు సంబంధించి న్యాయం చేయాలంటూ ఈ రోజు తలపెట్టిన చలో ఏయూ కార్యక్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Andhra Pradesh: చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు రాజీనామా చేయాలని డిమాండ్, నరసాపురంను జిల్లా కేంద్రంగా ఉంచాలని కోరుతూ నిరసన
Hazarath Reddyవైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రసాదరాజును గెలిపించినందుకు క్షమించాలని చెప్పుతో కొట్టుకున్నారు.
AP Weather Forecast: ఏపీలో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక, అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం
Hazarath Reddyదక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్య రేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది గురువారం మధ్యాహ్నానికి తీరం తీవ్ర అల్ప పీడనంగా మారి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్టెల్లా సూచించారు.
Three Capitals Row: అమరావతి రాజధానిగా ఆరునెలల్లో అభివృద్ధి పనులన్ని పూర్తి చేయండి, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, మూడు రాజధానుల అంశంపై తుది తీర్పును వెల్లడించిన ధర్మాసనం
Hazarath Reddyమూడు రాజధానుల అంశంపై (Three Capitals Row) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని (AP High Court directs state government) ఆదేశించింది.
Corona in AP: ఏపీలో కొత్తగా 101 మందికి కరోనా, పశ్చిమ గోదావరి జిల్లాలో 28, అనంతపురం జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 13 కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 9,008 కరోనా పరీక్షలు నిర్వహించగా, 101 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 28, అనంతపురం జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 13, తూర్పు గోదావరి జిల్లాలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి.
GST Collections in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ, తెలంగాణలో రూ.4,113 కోట్ల జీఎస్టీ
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు (GST Collections in Telugu States) పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 19 శాతం ఎక్కువ. అటు, తెలంగాణలో కూడా జీఎస్టీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.4,113 కోట్లకు చేరుకున్నది.
Andhra Pradesh: ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం, ఎనిమిది బస్సులు దగ్ధం, సుమారు రూ.6 కోట్ల వరకు నష్టం, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది
Hazarath Reddyఒంగోలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణ శివార్లలోని ఉడ్ కాంప్లెక్స్ వద్ద నిలిపి ఉంచిన 8 బస్సులు దగ్ధమయ్యాయి. ఇవన్నీ కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సులుగా భావిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ వద్ద చెలరేగిన మంటలు కొన్ని నిమిషాల్లోనే వ్యాపించాయి.
Corona in AP: ఏపీలో కొత్తగా 141 మందికి కరోనా, కృష్ణా జిల్లాలో 41, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 11,571 కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా జిల్లాలో 41, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 450 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.
Bheemla Nayak: కుమ్మరి చక్రాన్ని కాలితో తన్ని మా కుమ్మరులను అవమానిస్తారా, వెంటనే ఆ సీన్ తొలగించండి, భీమ్లా నాయక్‌ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమ్మర శాలివాహన సేవా సంఘం
Hazarath Reddyవన్‌ కల్యాణ్‌-రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌ చిత్రం భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలోని పలు సన్నివేశాలపై కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షకులు డాక్టర్‌ మానేపల్లి వీవీఎస్‌ఎన్‌ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.
AP 10th Class Exams Update: ఏపీలో మే 2 నుంచి 13 వరకు టెన్త్‌ పరీక్షలు, గదికి 16 మంది విద్యార్థులే ఉండేలా ఏర్పాట్లు, ఈ ఏడాది పరీక్షలకు 6.30 లక్షల మంది హాజరయ్యే అవకాశం
Hazarath Reddyఏపీలో టెన్త్‌ పరీక్షలను మే 2వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించేలా బోర్డు షెడ్యూల్‌ను (AP 10th Class Exams Update) ఇంతకు ముందే విడుదల చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలను తీసుకుంటోంది. రాష్టంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో గదికి 16 మంది విద్యార్థులే ఉండేలా ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
Andhra Pradesh: భార్యకు తెలీకుండా రెండో పెళ్లికి సిద్ధమైన భర్త, విషయం తెలియడంతో భర్త ఇంటి ముందు నిరహార దీక్షకు దిగిన బాధితురాలు
Hazarath Reddyతన భర్త రామచంద్రన్‌ను తనతో కలవకుండా అడ్డుకోవడమే కాకుండా మరో పెళ్లి చేయడానికి (second marriage in Chittoor) అత్తమామలు ప్రయత్నాలు ప్రారంభించారని శ్రీదేవి చేసిన ఫిర్యాదుతో రామచంద్రన్, అతని తల్లిదండ్రులను విచారిస్తున్నామని, శ్రీదేవికి న్యాయం చేస్తామని ఎస్‌ఐ ప్రియాంక తెలిపారు.
Corona in AP: ఏపీలో మూడు జిల్లాల్లో కేసుల నిల్, గణనీయంగా తగ్గి జీరోకి చేరుకుంటున్న కోవిడ్, గత 24 గంటల్లో 71 మందికి కరోనా పాజిటివ్
Hazarath Reddyఏపీలో కరోనావైరస్ వ్యాప్తి కనిష్ఠస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 7,969 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా 71 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, క‌ర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
AP Shocker: ప్రియుడితో రాసలీలల్లో తల్లి, ఈ పాడుపనిని మందలించిన కూతురు, కోపంతో కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తల్లి ఆమె ప్రియుడు, కడపలో నిందితులు అరెస్ట్
Hazarath Reddyకడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధం గురించి మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి సొంత కూతురినే (Mother kills daughter) ఓ తల్లి అంతమొందించింది. గత ఏడాది అక్టోబర్‌ 16న జరిగిన ఈ ఘటన అప్పట్లో ఆత్మహత్యగా చిత్రీకరించినప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపి హత్య అని తేల్చారు.
AP Assembly Budget Sessions 2022: మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ ఎమ్మెల్యేల హాజరుపై అయోమయం, మార్చి 11 లేదా 14 తేదీల్లో ఏపీ వార్షిక బడ్జెట్‌
Hazarath Reddyమార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను ఈ స‌మావేశాల్లోనే (AP Assembly Budget Sessions 2022) ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. 9,10 తేదీల్లో గ‌వ‌ర్న‌ర్ ప్రసంగానికి ధ‌న్య‌వాదాలు తెల‌ప‌నున్నారు. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Jagananna Thodu Scheme: చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలు, 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ చేపట్టిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyరోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు
KS Jawahar Reddy: సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్‌రెడ్డి బాధ్యతలు, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగా విధులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి జవహర్‌రెడ్డి విధుల్లో చేరారు. జవహర్‌రెడ్డి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 200 మందికి కరోనా, గుంటూరు జిల్లాలో 26, తూర్పు గోదావరి జిల్లాలో 25, కృష్ణా జిల్లాలో 21 కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా వ్యాప్తి కనిష్ఠస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 200కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. 15,654 కరోనా పరీక్షలు నిర్వహించగా, 136 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 26, తూర్పు గోదావరి జిల్లాలో 25, కృష్ణా జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.
Pulse Polio: దేశవ్యాప్తంగా పల్స్ పోలియా డ్రైవ్, ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కలు తప్పనిసరి, మూడు రోజులు రోజల పాటూ కొనసాగనున్న కార్యక్రమం, తెలంగాణలో ప్రత్యేక ఏర్పాట్లు
Naresh. VNSదేశవ్యాప్తంగా పల్స్ పోలియో(pulse polio) కార్యక్రమం కొనసాగుతోంది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ(Mansuk Mandaviya) పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు పోలియో చుక్కల‌ను వేశారు.