ఆంధ్ర ప్రదేశ్
COVID in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, గత 24 గంటల్లో 434 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 108 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటలలో 15,193 శాంపిల్స్ పరీక్షించగా, 434 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 66, గుంటూరు జిల్లాలో 62, పశ్చిమ గోదావరి జిల్లాలో 56 కేసులు గుర్తించారు.
Night Curfew Lifted in AP: ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత, ప్రతీ ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించే నిబంధన అమల్లోకి, రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగించాలని సీఎం ఆదేశాలు
Hazarath Reddyఏపీలో కోవిడ్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. క్రమంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు (Night Curfew Lifted in AP) తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించే నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు.
CM YS Jagan Review: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే, రాష్ట్ర చరిత్రలో రోడ్లకు ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదని తెలిపిన ఏపీ సీఎం జగన్, విశాఖ బీచ్‌ కారిడార్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైదిగా నిలిచేలా ప్లాన్ రూపకల్పన
Hazarath Reddyకొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి సమీక్ష (review meeting with Roads and Buildings Department) నిర్వహించిన సీఎం జగన్‌.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు.
Andhra Pradesh: విశాఖలో విషాదం, భర్తతో గొడవపడిన భార్య, ఇద్దరు పిల్లలను బావిలో పడేసి, ఆత్మహత్యా ప్రయత్నం చేసిన భార్య, చిన్నారులు మృతి
Hazarath Reddyవిశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంగా భార్య, భర్తల మధ్య చేలరేగిన గొడవలు ఆ కుటుంబాన్ని శోకంలో ముంచింది. ముక్కుపచ్చలారని చిన్నారుల మరణానికి ఈ ఘటన దారితీసింది.
Andhra pradesh High Court: ఏపీ హైకోర్టులో కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం, కార్యక్రమాన్ని నిర్వహించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
Hazarath Reddyనూతన న్యాయమూర్తులుగా జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ వడ్డిబోయన సుజాతలచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు.
Hyderabad: మరదలి ముందు భర్తను వెక్కిరించిన భార్య, మనస్తాపంతో భర్త ఆత్మహత్య, మరో ఘటనలో సరసాలకు అడ్డుగా ఉన్నాడని భర్తను చంపి వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన కసాయి భార్య
Hazarath Reddyభాగ్యనగరంలోని బంజారాహిల్స్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మరదలితో కలిసి భార్య చిన్నచూపు చూసిందని (Family Issues ) ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 2లోని సయ్యద్‌నగర్‌ ఫస్ట్‌ లాన్సర్‌లో నివసించే సయీద్‌బిన్‌ మాబ్రుక్‌(40) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు
COVID in AP: ఏపీలో భారీగా తగ్గిపోయిన కేసులు, గత 24 గంటల్లో 749 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 125 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 22,785 శాంపిల్స్ పరీక్షించగా, 749 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 125 కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 120 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 2 కేసులు గుర్తించారు.
TTD Free Darshan Tokens: శ్రీనివాసుడి భక్తులకు గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత ఆఫ్ లైన్‌ లో సర్వదర్శనం టికెట్లు, ఈ నెల 15 నుంచి ప్రతిరోజు 15వేల టోకెన్లు
Naresh. VNSతిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. కరోనా కారణంగా నిలిచిపోయిన సర్వ దర్శనం టోకెన్ల జారీని (free darshan tokens) పునరుద్దరించాలని నిర్ణయించింది టీటీడీ. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్‌ లో(offline) కూడా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ నెల 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ (TTD)టోకెన్లు జారీ చేయనుంది.
Coronavirus in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, గత 24 గంటల్లో 896 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 206 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 24,066 కరోనా పరీక్షలు నిర్వహించగా, 896 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 206 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 141, కృష్ణా జిల్లాలో 130, పశ్చిమ గోదావరి జిల్లాలో 113 కేసులు గుర్తించారు. అదే సమయంలో 8,849 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు.
US: అమెరికాలో తెలుగు యువకుడిపై పట్టపగలే కాల్పులు, అక్కడికక్కడే మరణించిన విశాఖ వాసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు
Hazarath Reddyఅమెరికాలో దోపిడి దొంగలు పట్టపగలే లూటీలకు ప్రయత్నిస్తున్నారు. తుపాకులు చేతబట్టి కాల్పులకు తెగపడుతున్నాడు. కాగా అలబామలోని బిర్మింగ్‌హమ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన కాల్పుల్లో తెలుగు యవకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Andhra Pradesh: దేశ చరిత్రలోనే తొలిసారి, రెండు లక్షల కిలోల గంజాయిని దహనం చేయనున్న ఏపీ పోలీసులు, దీని విలువ దాదాపు రూ. 500 కోట్ల పై మాటే
Hazarath Reddyరెండు లక్షల కిలోల గంజాయిని ఏపీ పోలీసులు దహనం చేయనున్నారు. దీని విలువ దాదాపు ఐదు వందల కోట్ల విలువైన ఉంటుందని అంచనా. దేశ చరిత్రలోనే తొలిసారి ఇంత భారీ స్థాయిలో గంజాయిని దహనం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్ పాల్గొననున్నారు.
MHA: తెలుగు రాష్టాల మద్య సమస్కల పరిష్కారానికి తొలి దఫా చర్చలు, ఈ నెల 17న హాజరు కావాలని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం, తెర పైకి ఏపీ ప్రత్యేక హోదా అంశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక సమావేశం (MHA Crucial Meeting) ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ఫిబ్రవరి 17న జరగనుంది.
COVID in AP: ఏపీలో కొత్తగా1,166 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 256 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 25,495 కరోనా పరీక్షలు చేపట్టగా 1,166 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 256 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 184, గుంటూరు జిల్లాలో 127, పశ్చిమ గోదావరి జిల్లాలో 109 కేసులు గుర్తించారు.
Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ప్రమాదంలో ముగ్గురు మృతి,
Krishnaకర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
TDP MLC Ashok Babu Arrested: టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్, తప్పుడు సర్టిఫికెట్ల కేసులో ఉద్యోగ సంఘాల మాజీ నేతను అదుపులోకి తీసుకున్న సీఐడీ, కక్ష సాధింపేనని మండిపడ్డ చంద్రబాబు
Naresh. VNSతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబును (MLC Ashok babu) ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. తప్పుడు సర్టిఫికెట్ల విషయంలో అశోక్‌బాబుపై(Ashok babu) ఆరోపణలు ఉన్నాయి. ప్రమోషన్ కోసం ఆయన ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Andhra Pradesh at EXPO 2020 Dubai: దుబాయ్ ఎక్స్ పోలో ఏపీ ప్రత్యేకతను చాటుతాం, రేపు దుబాయిలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ను ప్రారంభించనున్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి
Krishnaదుబాయ్ ఎక్స్ పోలో ఏపీ ప్రత్యేకతను చాటేందుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం సిద్ధమైంది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో పయణమవుతోంది.
AP New Districts Row: ఏపీలో ఉగాది నాటికి కొత్త జిల్లాలు, ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలే కొత్త జిల్లాలకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశాలు, సన్నాహకాలు పూర్తి చేయాలని అధికారులకు సూచన
Hazarath Reddyఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సన్నాహకాలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల పునర్విభజనపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) గురువారం సమీక్ష చేపట్టారు.
COVID in AP: ఏపీలో గత 24 గంటల్లో 1,345 మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో 309 కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 1,345 మంది కరోనా బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో 309 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 6,576 మంది కరోనా నుంచి కోలుకోగా... రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మృతి చెందారు.
Mahesh Babu Wedding Anniversary: మహాష్ బాబుకు ఆకాశంలో పెళ్లి రోజు వేడుకుల నిర్వహించిన చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి...
Krishnaమహేష్ బాబు పెళ్లిరోజు అని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు మహేష్ బాబు పెళ్లిరోజు. మహేష్ బాబు, నమ్రత ల పదిహేడో పెళ్లిరోజు. ఈ సందర్భంగా మహేష్ బాబుకు ప్రత్యేకంగా బొకేను తెప్పించి విమానంలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.
AP Movie Ticket Price Issue: సినీ పరిశ్రమకు అండగా ఉంటాం, సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ కూడా వేశామని తెలిపిన మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ
Hazarath Reddyర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సినిమాకు ఒక స్థానం ఉండేలా చూడాలని సినీ ప్రముఖులు కోరినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా సహకారం అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారని తెలిపారు.