ఆంధ్ర ప్రదేశ్

Vijayawada Minor Girl Suicide Case: 14 ఏళ్ల బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, ఆత్మహత్య చేసుకున్న బాలిక, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ

Hazarath Reddy

ఏపీలో విజయవాడలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యారనే ఆరోపణలను (Vijayawada Minor Girl Suicide Case) ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ జైన్‌ను ( TDP leader Vinod Jain) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Covid in AP: ఏపీలో కొత్తగా 10,310 మందికి కరోనా, అత్యధికంగా కడప జిల్లాలో 1,697 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 39,296 కరోనా పరీక్షలు చేయగా... 10,310 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కడప జిల్లాలో 1,697 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,249 కేసులు, కృష్ణా జిల్లాలో 1,008 కేసులు గుర్తించారు.

MLA Nandamuri BalaKrishna: హిందూపురంలో MLA బాలకృష్ణ మిస్సింగ్ అంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు, అసలు సంగతి ఇదే..

Krishna

అన్ని పక్షాలు కలసి నిన్న హిందూపురంలో బంద్ ను కూడా నిర్వహించాయి. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళనలకు హాజరు కావడం లేదంటూ బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశారు.

AP Govt Employees: ఆదివారం కూడా పనిచేస్తున్న ఏపీ ట్రెజరీ ఉద్యోగులు, జీతాల బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆదేశం, ఉద్యోగ సంఘాల ఆగ్రహం..

Krishna

ఆంధ్రప్రదేశ్ లో ట్రెజరీ ఉద్యోగులు నేడు కూడా పనిచేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ట్రెజరీ కార్యాలయాల సిబ్బంది ఆదివారం కూడా పనిచేయాలని, జీతాల బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది.

Advertisement

AP Finance Minister Buggana On Fiscal Council: ఏపీ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది టీడీపీ హయాంలోనే, ఫిస్కల్‌ కౌన్సిల్‌ అవసరం లేదని కేంద్రమే చెప్పింది, రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన ధ్వజం

Krishna

బడ్జెట్‌ అమలు కోసం ద్రవ్య మండలి (Fiscal Council) ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తోసిపుచ్చారు. కాగ్, ఆర్థిక సంఘం, గణాంకాల సంస్థలు ఉండగా కౌన్సిల్‌ అవసరం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి పార్లమెంట్‌లో ప్రకటించడాన్ని గుర్తుచేశారు.

Gollapudi Maruthirao Wife Passed Away: ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు సతీమణి మృతి

Krishna

దివంగత సినీ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి (81) చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

AP BJP President Somu Veerraju: కడప ప్రజలకు క్షమాపణ చెప్పిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు

Krishna

కడప జిల్లా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్షమాపణలు చెప్పారు. ఇటీవల రాయలసీమ, కడప ప్రాంత ప్రజలపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హత్యల చేసే వారికి ఎయిర్ పోర్టులు ఎందుకు అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Wife Killed Husband: మద్యం మత్తులో కట్టుకున్న భర్త పురుషాంగం కోసి చంపేసిన భార్య, ఇద్దరు కలిసి సిట్టింగ్ వేశారు, కానీ అంతలోనే ఏం జరిగిందంటే..

Krishna

మృతదేహంపై గాయాలు, పురుషాంగం కోసిన ఆనవాళ్లు కనిపించడంతో.. పోలీసులు హత్యగా నిర్థారించి కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా ముత్యాలు ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో.. ఆమె హత్యానేరాన్ని అంగీకరించింది.

Advertisement

Hindupur Bandh Call: నేడు హిందూపురం బంద్, జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం నేతలు బంద్‌కు పిలుపు, మద్దతు తెలిపిన MLA నందమూరి బాలకృష్ణ

Krishna

ఈరోజు హిందూపురంలో అఖిలపక్షం నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని నిర్ణయించారు.

Krishna District Should be Named ANR: కృష్ణ జిల్లాకు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలి, అభిమానులు స్థానికుల నుంచి డిమాండ్...

Krishna

కృష్ణా జిల్లాకు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలంటూ ఏఎన్నార్ అభిమానుల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అక్కినేని నాగేశ్వరరావు చలనచిత్ర పరిశ్రమలో అనేక సంవత్సరాలు రెండు రాష్ట్రాలను అలరించారని గుర్తు చేస్తున్నారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 12,561 మందికి కరోనా, 12 మంది మృతి, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,710 కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,635 కరోనా పరీక్షలు నిర్వహించగా... 12,561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా 12 మంది మరణించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,710 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 1,625 కేసులు, కడప జిల్లాలో 1,215 కేసులు, విశాఖ జిల్లాలో 1,211 కేసులు వెల్లడయ్యాయి.

New National Highway Between TS-AP: తెలుగు రాష్ట్రాల మధ్య ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ ఆమోదం, రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో కొత్త జాతీయ రహదారి నిర్మాణం

Hazarath Reddy

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్‌ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది.

Advertisement

Andhra Pradesh: గుడ్ న్యూస్.. ఏపీలో సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14,493 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, సచివాలయాల వ్యవస్థపై జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Hazarath Reddy

: ఏపీ ప్రభుత్వం త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ (Vacancies in village and ward secretariats) చేయనుంది. త్వరలో 14,493 పోస్టుల భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. వచ్చే జూన్‌ నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

Ex TDP MLA Sobha joins YSRCP: విజయనగరం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ, వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎస్‌. కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి

Hazarath Reddy

విజయ నగరం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లా ఎస్‌. కోట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి వైసీపీ తీర్థం పుచుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్‌సీపీలోకి వచ్చానని ఆమె తెలిపారు.

Balakrishna: సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బాలకృష్ణ, హిందూపురంను కేంద్రంగా చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

Hazarath Reddy

పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇవాళ ఆయనొక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 13,474 మందికి కరోనా, కడప జిల్లాలో అత్యధికంగా 2,031 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 41,771 కరోనా పరీక్షలు నిర్వహించగా... 13,474 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడప జిల్లాలో అత్యధికంగా 2,031 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 1,835 కేసులు, విశాఖ జిల్లాలో 1,349 కేసులు, గుంటూరు జిల్లాలో 1,342 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,259 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 1,066 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,007 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement

Andhra Pradesh: భూవివాదం, కర్నూలులో ఇద్దరిని వేట కొడవళ్లతో నరికి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రత్యర్థులు,

Hazarath Reddy

ఏపీలో కర్నూలు జిల్లా కైతాలం మండలంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప. ఈరప్ప, అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి పెట్రోల్ పోసి (Faction fight leaves 2 dead in Kurnool) నిప్పంటించారు.

New Revenue Divisions in AP: కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు, రాష్ట్రంలో 63 కి చేరుకోనున్న మొత్తం రెవిన్యూ డివిజన్ల సంఖ్య, రెవిన్యూ విడిజన్లపై పూర్తి సమాచారం ఇదే

Hazarath Reddy

ఏపీలో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు (Andhra Pradesh New Districts) ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం నిన్న ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 26 జిల్లాలకు సంబంధించి వరుసగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

New Districts in AP: ఏపీలో కొత్త జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు, మెమొరాండానికి, గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి స్వల్ప తేడాలు

Hazarath Reddy

ఏపీలో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం నిన్న ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 26 జిల్లాలకు సంబంధించి వరుసగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

Corona in AP: ఏపీలో కొత్తగా 13,618 మందికి కరోనా, విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,791 కేసులు నమోదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 13,618 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,791 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 466 కేసులు నమోదయ్యాయి.

Advertisement
Advertisement